For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 3rd: డ్రగ్స్ ఉచ్చులో మాధురిని కొట్టిన అఖిల్.. కాపాడిన జానకి!

  |

  జానకి కలగనలేదు సీరియల్ మరో ఊహించని ట్విస్ట్ తో ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. ఎంతో ప్రేరణగా నిలిచే జ్ఞానాంబ కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. అయితే కుటుంబం విడిపోయే పరిస్థితికి రావడంతో అందుకు పెద్ద కోడలు జానకి ఎవరిని విడిపోనివ్వకుండా చూసుకుంటుంది. జానకి తన భర్త రామ సహాయంతోనే ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. అందుకు అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. మరి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోని ప్రధాన అంశం. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 424 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  కుటుంబం విడిపోకుండా ఉండాలని

  కుటుంబం విడిపోకుండా ఉండాలని

  కుటుంబం ఎప్పటికీ కూడా విడిపోకుండా ఉండాలి అని జానకి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే మరొకవైపు రెండవ కోడలు మల్లిక మాత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయి మరో కాపురం పెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ దానికి ఆమె ఆలోచనలు కూడా మార్చేయాలని ఆలోచిస్తుంది. జానకి ఇంటికి పెద్ద కోడలిగా అన్ని బాధ్యతలను తన భుజాన వేసుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి అని కూడా అని ఆలోచిస్తుంది.

  ఎలాగైనా డబ్బులు సంపాదించాలని..

  ఎలాగైనా డబ్బులు సంపాదించాలని..

  అయితే ఈ క్రమంలో జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ మాత్రం ఊహించని విధంగా తప్పుడు దారిలో డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. మొదట అతను ఖాళీగా ఉండడంతో జానకి కెరీర్ సెట్ చేసుకోవాలి అని నిన్ను నమ్ముకుని నీ భార్య ఉంది అని ఆమెను రేపు ఎలా పోషిస్తాము అని అతనికి బుద్ధి వచ్చేలా చెబుతుంది. అయితే అఖిల్ మొదట ఆ మాటలు విన్నట్లే విని ఆ తర్వాత గాలికి వదిలేస్తాడు. కానీ ఎలాగైనా డబ్బులు సంపాదించి ఇంట్లో వాళ్ళ ముందు తలెత్తుకు తిరగాలి అనుకుంటాడు. కానీ అతను తప్పుడు దారిలో డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు.

  డ్రగ్స్ వ్యాపారంలో అఖిల్ తప్పులు

  డ్రగ్స్ వ్యాపారంలో అఖిల్ తప్పులు

  అఖిల్ తన స్నేహితుడి సలహా మేరకు ఊహించని విధంగా డ్రగ్స్ వ్యాపారం లోకి దిగుతాడు. మొదట పెట్టుబడి కింద డబ్బులు కావాలి అని అడగడంతో తన భార్య జెస్సి బంగారు గొలుసును కూడా తాకట్టు పెడతాడు. అంతేకాకుండా జానకి కూడా అతనికి 5000 రూపాయలు ఇస్తుంది. భవిష్యత్తులో సెటిల్ కావడానికి ఒక కోర్స్ నేర్చుకోవాలని డబ్బులు అవసరం ఉంది అని అబద్ధం చెప్పి జానకికి చెబుతాడు. ఇక జానకి అతని మాటలు నమ్ముతుంది. ఇక అఖిల్ తీసుకున్న డ్రగ్స్ ను కాలేజీలో అమ్మడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

   నిలదీసిన మాధురి

  నిలదీసిన మాధురి

  తన క్లాస్మేట్ అయినా ఒక వ్యక్తిని పిలిచి తన దగ్గర మాల్ ఉంది అని దాన్ని అమ్మాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. అయితే జానకి కూడా అప్పుడు అదే కాలేజ్ లో ఉంటుంది. ఇక తర్వాత అఖిల్ కు ఎంతో క్లోజైనా మరొక స్నేహితురాలు మాధురి అతను ఏదో తప్పు చేస్తున్నాడు అని గ్రహిస్తుంది. నువ్వు ఏదో చేయకూడని తప్పు చేస్తున్నావ్ అని ఎంతో గౌరవప్రదమైన మీ కుటుంబ పరువు తీస్తున్నావు అని ఆ అమ్మాయి ప్రశ్నిస్తుంది. నువ్వు ఇలాంటి తప్పు చేయకూడదు అని వెంటనే ఈ విషయం ఇంట్లో చెబుతాను అని కూడా ఆ అమ్మాయి అంటుంది.

  రక్తం వచ్చేలా కొట్టిన అఖిల్

  రక్తం వచ్చేలా కొట్టిన అఖిల్

  కానీ మాధురిని అఖిల్ ఆపాలని అనుకుంటాడు. ఆమెను ఎంతో బ్రతిమాలినప్పటికీ కూడా వినిపించుకోకుండా ఆ అమ్మాయి అలానే పరిగెడుతుంది. ఇక అనుకోకుండా అఖిల్ పక్కనే ఉన్న ఒక కర్రను తీసుకొని ఆమెను కొడతాడు. అయితే అఖిల్ చేసిన పనిని కూడా జానకి అక్కడే అనుకోకుండా చూస్తుంది. అయితే మాధురి పరిగెడుతూ ఉంటే ఆమె వెంబడి అఖిల్ కూడా పరిగెడుతూ ఉంటాడు. ఇక వీరిద్దరి కి తెలియకుండా జానకి కూడా వారి వెంటే పరిగెడుతూ ఉంటుంది. మాధురి ఒకచోట కళ్ళు తిరిగి రాయి మీద పడిపోతుంది. ఇక ఆమెకు రక్తం రావడంతో అఖిల్ కు ఏం చేయాలో అర్థం కాదు. అక్కడే ఉంటే తాను ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది అని వెళ్ళిపోతాడు.

   జానకి నిజం చెబుతుందా?

  జానకి నిజం చెబుతుందా?

  ఇక అఖిల్ ఇంటికి రాగానే తల్లి జ్ఞానాంబ, తండ్రి గోవిందరాజులు ఎదురుపడతారు. టెన్షన్ గా ఉంటే వాళ్ళు అనుమానిస్తారు అని ఏమీ తెలియనట్టుగా అఖిల్ తాను చాలా మారిపోయాను అని చదువుకోడానికి కాలేజీకి వెళ్లి వస్తున్నాను అని అంటాడు. ఇక జ్ఞానాంబ కూడా అఖిల్ చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నాడు అని అనుకుంటారు. ఇక మరొకవైపు జానకి మాధురి రక్తపు మడుగులో మునిగి ఉండడంతో వెంటనే హాస్పిటల్ లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. ఇక అందరూ ఇంట్లో మాట్లాడుకుంటున్న తరుణంలో అఖిల్ కూడా వస్తాడు. జానకి ఒక విషయం మాట్లాడాలి అని అత్తగారికి చెబుతుంది. మరి అఖిల్ చేసిన తప్పు గురించి ఇంట్లో జానకి ఏ విధంగా చెబుతుంది ఇక అతన్ని డ్రగ్స్ బారి నుంచి ఎలా తప్పిస్తుంది? అనేది తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Serial Episode from November 3rd
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X