Janaki Kalaganaledu May 31st Episode: జానకి ఫస్ట్ నైట్ ఫెయిల్.. కడుపునొప్పితో రామచంద్ర డ్రామా?

జానకి కలగనలేదు కలర్ఫుల్ గా ఆఫ్ సెంచరీ కొట్టేసింది. ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ నుంచే ఆసక్తికరమైన సన్నివేశాలతో జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. అసలు కథను చాలా తొందరగానే జనాల్లోకి ఎక్కించేశారు. ప్రతి ఎపిసోడ్ కూడా తరువాత రోజు ఎపిసోడ్ పై అంచనాలను పెంచేస్తోంది. ఇక సోమవారం ప్రసారం కాబోయే ఈ సీరియల్ లో అందమైన సీన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

గత వారం కంటే ఈ వారం మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. రాశి పాత్ర శివగామి రేంజ్ లో హైలెట్ అవుతోంది. అందమైన ప్రేమ మధ్యలో భార్య జానకి ఆశయం, భర్త రామచంద్ర అమాయకత్వ ప్రేమ, అత్త జ్ఞానాంబ కట్టుబాట్లు ఆప్యాయత.. ఈ సిరియల్ లో ప్రధాన అంశాలు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే 51వ ఎపిసోడ్ పై ఒక లుక్కేస్తే..

మనసును గాయపరిచినా కూడా

మనసును గాయపరిచినా కూడా

జానకి మొదటిరాత్రి కోసమని ముందు నుంచి ఏర్పాట్లు జరుగుతుండగా ఎదో ఒక కారణం వల్ల ఆగిపోతు వస్తున్నాయి. ఇక ఫైనల్ గా మల్లిక గొడవ అనంతరం జానికిని ఫస్ట్ నైట్ కోసం రెడీ అవ్వాలని జ్ఞానంబ అదేశిస్తుంది. ఇక జానకిని మల్లిక రెడీ చేసి ఉంచగా జ్ఞానాంబ ఆమెను సూటి పోటీ మాటలతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెబుతుంది. ఇంతవరకు పిల్లలు లేరు అంటూ మనసును గాయపరిచినా కూడా మల్లిక ఏడ్చినట్లు యాక్టింగ్ చేస్తుంది. అత్త మాటలను కూడా అంతగా పట్టించుకొడు.

జానకి అందుకు సిద్ధంగా ఉండదు

జానకి అందుకు సిద్ధంగా ఉండదు

అయితే జానకి శోభనం గదిలోకి వెళ్లేముందు ఎలాగైనా వరాసుడిని ఇవ్వాలని జ్ఞానాంబ పాల గ్లాసు ఇచ్చి శోభనం గదికి పంపిస్తుంది. లోపలికి వెళ్లగానే రామచంద్ర అక్కడ మల్లిక విషయాన్ని గుర్తు చేస్తూ జానకికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతుంటాడు. బెడ్ పై రామ మెల్లమెల్లగా జానకి వైపుకు జరుగుతూ ఉంటాడు. కానీ జానకి అందుకు సిద్ధంగా ఉండదు. ఆ విషయాన్ని చెప్పాలని మనసులో అనుకుంటూ ఉంటుంది.

నాకు అర్ధమయ్యింది అంటూ

నాకు అర్ధమయ్యింది అంటూ

జానకి ఇబ్బంది పడుతున్నట్లు అనిపించి రామచంద్ర అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మీ అన్నయ్య అమెరికా వెళ్లిపోవడం, ఆ వెంటనే మల్లిక గొడవ జరగడం, నీకు అమ్మ కండిషన్ పెట్టడం వల్ల నువ్వు ఈ కార్యానికి సిద్ధంగా లేవని నాకు అర్ధమయ్యింది అంటూ రామచంద్ర కింద పడుకునే ప్రయత్నం చేసాడు.

చివరికి రామచంద్ర పక్కన జానకి

చివరికి రామచంద్ర పక్కన జానకి

పరవాలేదు పక్కనే పడుకోండి అంటూ జానకి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ నాకు నిద్రలో కాలు చేయి వేసే అలవాటు ఉంది. మళ్ళీ మీకు ఇబ్బంది ఎందుకని అంటూ రామచంద్ర కిందనే పడుకుంటాడు. ఇక జానకి భర్తను చూస్తూ ఉండగా పైన బల్లి అటు ఇటు తిరుగుతూ భయపడుతుంది. ఆ భయంతో ఆమె మళ్ళీ రామచంద్ర పక్కనే పడుకుంటుంది.

జానకి ట్రెడిషనల్ గా

జానకి ట్రెడిషనల్ గా

ఇక ఉదయం లేచేసరికి రామచంద్ర జానకిపై కాలు చేయి వేసి పడుకుంటాడు. ఇక ఉదయం జానకి ట్రెడిషనల్ గా తులసి కోట చుట్టూ తిరుగుతూ ఇంట్లో వారందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. జ్ఞానాంబ అది చూసి ఎంతగానో సంతోషిస్తుంది. ఇక చిన్న మరిది వచ్చి ఫొటోలు తీస్తుంటే అది చూసి మల్లిక తట్టుకోలేకపోతుంది. భర్తను తిడుతూ అసహనం వ్యక్తం చేస్తుంది.

జానకిపై పగతో

జానకిపై పగతో

ఇక మరోవైపు జానకి స్నేహితురాలిని పిలిపించి కౌన్సిలర్ సునంద దేవి భారీ స్కెచ్ వేయడానికి సిద్ధమవుతుంది. కన్నబాబు చెంప పగలగొట్టిన పగను దృష్టిలో ఉంచుకొని స్నేహితురాలి ద్వారా జానకిని తోటలోకి తీసుకురావాలని బెదిరిస్తారు. అందుకు ఆమె ఒప్పుకొని వారితో కారులో వెళుతుంది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
కడుపు నొప్పితో రామచంద్ర..

కడుపు నొప్పితో రామచంద్ర..

ఇక మామగారు కాఫీ తేవాలని ఆర్డర్ వేయడంతో కాఫీ ఎలా చేయాలో తెలియని జానకి కంగారుపడుతూ రెడీ చేస్తుంది. ఆ కాఫీ చాలా దారుణంగా ఉన్నట్లు అందరికి అర్ధమవుతుంది. ఇక జ్ఞానాంబ తాగే సమయంలో సడన్ గా రామచంద్ర కడుపు నొప్పి అని చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. మరి రామచంద్ర కడుపు నొప్పి నిజమా? లేక భార్యను కాపాడేందుకు అలా చేశాడా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X