For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 14th: అఖిల్ కేసులో జ్ఞానాంబ శత్రువు.. మల్లిక మరో బిగ్ ప్లాన్!

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. జానకి చిన్న మరిది అఖిల్ మాధురిపై హత్యాయత్నం చేయడంతో జానకి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. దీంతో ఒక్కసారిగా కుటుంబంలో విబేధాలు వస్తాయి. జానకి భర్త రామ కూడా జానకి మాటలను పూర్తిగా నమ్మడు. మరోవైపు అత్త జ్ఞానాంబ కూడా బాధలో ఉంటుంది.

  మల్లిక నుంచి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. మరి జానకి ఏ విధంగా ఈ విషయంలో అందరికి అర్థమయ్యేలా చెబుతుంది అనే పాయింట్ ఆసక్తిగా మారింది. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 431 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  అఖిల్ తప్పు చేయడంతో

  అఖిల్ తప్పు చేయడంతో

  అఖిల్ మాధురి అనే అమ్మాయి పై హత్యాయత్నం చేయడం కల్లారా చూస్తుంది. ఆ తర్వాత అతనిపై పోలీస్ కేసు నమోదు చేస్తుంది. అయితే ఈ కారణం వలన జానకి తన అత్తగారింట్లో ఊహించని విధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సొంతమరిది అఖిల్ తప్పు చేయడంతో ఒక అమ్మాయికి అన్యాయం జరగకూడదు అని ఆలోచనతో జానకి ఆ విధంగా చేస్తుంది. అంతేకాకుండా అఖిల్ ఈసారి క్షమిస్తే భవిష్యత్తులో అతను మరింత తప్పులు చేసే అవకాశం ఉంటుంది అని కూడా ఆమె ఆలోచిస్తుంది. అయితే అఖిల్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదు అని అబద్ధాలు చెబుతూ ఉంటాడు.

  పోలీస్ స్టేషన్ లో జ్ఞానాంబ ఫ్యామిలీ

  పోలీస్ స్టేషన్ లో జ్ఞానాంబ ఫ్యామిలీ

  ఇక జానకి భర్త రామచంద్ర కూడా తన తమ్ముడు పోలీస్ స్టేషన్ లో ఉండడం ఏమాత్రం తట్టుకోలేక పోతాడు. ఆ విషయంలో జానకిని పదేపదే అతను ప్రశ్నిస్తూ ఉంటాడు. అఖిల్ ఏ తప్పు చేయలేదు అని మీరు అనవసరంగా కేసు పెట్టినట్లు అనిపిస్తుంది అని రామచంద్ర చెబుతాడు. కేవలం రామచంద్ర మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న అత్త జ్ఞానాంబ అలాగే మిగతా కుటుంబ సభ్యులు కూడా జానకి ఈ విధంగా చేయాల్సింది కాదు అని అనుకుంటూ ఉంటారు. ఇక అఖిల్ ను చూసేందుకు ఇంట్లో వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కు వెళ్తారు. అక్కడ సెల్ లో ఉన్న అఖిల్ ఇంటి సభ్యులందరిని చూసి కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు.

  ఏ తప్పు చేయలేదు

  ఏ తప్పు చేయలేదు

  తాను ఏ తప్పు చేయలేదు అని అనవసరంగా నా మీద కక్ష సాధింపు కోసమే వదిన ఈ విధంగా కేసు పెట్టింది అని అఖిల్ చెబుతూ ఉంటాడు. ఇక తల్లి జ్ఞానాంబ కూడా జానకి ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తుంది అని అనుకుంటుంది. పక్కనే ఉన్న రామచంద్ర కూడా మొండిగా కాదు మూర్ఖంగా ప్రవర్తిస్తోంది అని ఎలాగైనా అఖిల్ ను బయటకు తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాను అని అంటాడు. ఇక అందరూ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అఖిల్ మాత్రం ఎంతగానో బాధపడుతూ ఉంటాడు.

  మల్లిక vs జానకి

  మల్లిక vs జానకి

  మరోవైపు జానకి ఇంటిదగ్గరే కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అఖిల్ విషయంలో తన భర్త తప్పుగా అర్థం చేసుకున్నాడు అని ఆమె ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తోడికోడలు మల్లిక వచ్చే జానకికి హెచ్చరికలు చేయాలని అనుకుంటుంది. ఈ ఇంట్లో నువ్వు పెత్తనం చెలాయించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు నీకే ఇబ్బందులు వచ్చి పడ్డాయి అని పొగరుగా మాట్లాడుతుంది. మల్లికా దొంగ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడిన జానకి ఈ విషయం అంతా సర్దుకున్నాక నెక్స్ట్ నీ మీద నా టార్గెట్ అని హెచ్చరిక చేస్తుంది. నీ దొంగ ప్రెగ్నెన్సీ విషయం గురించి తప్పకుండా బయట పెడతాను అని ఈసారి నీ విషయంలో సిక్సర్ కొట్టడమే అని వార్నింగ్ ఇవ్వడంతో మల్లిక మల్లి ఆలోచనలు పడుతుంది.

  కేసులో సునంద ట్విస్ట్

  కేసులో సునంద ట్విస్ట్

  ఇక జ్ఞానాంబ కుటుంబ సభ్యుల పోలీస్ స్టేషన్ ముందు వెళుతూ ఉండగా ఆమె పాత విరోధి కార్పొరేటర్ సునంద దేవి అక్కడికి వస్తుంది నీ కుటుంబ పరిస్థితి చూస్తుంటే చాలా జాలిగా ఉంది జ్ఞానాంబ అని మాట్లాడుతుంది. ఎలాగైనా నా పవర్ ఉపయోగించి నీ కొడుకును బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను అని అంటుంది. ఇక పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిన సునంద దేవి పోలీసులతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ జ్ఞానాంబ కొడుకు బయటకు రాకూడదు అని మాట్లాడుతుంది. ఇక అందుకు పోలీసులు కూడా ఓప్పుకుంటారు.

  మల్లిక మరో ప్లాన్

  మల్లిక మరో ప్లాన్

  ఇక మరోవైపు మల్లిక జానకిని మరింత ఇబ్బంది పెట్టాలని జరిగిన విషయం మొత్తాన్ని కూడా అఖిల్ అత్తమామలకు చెబుతుంది. మీరు అనవసరంగా జానకి దేవత అనుకున్నారు కానీ ఆమె మీ అబ్బాయిని హత్యాయత్నం నేరం కింద అరెస్టు చేయించింది అని చెబుతుంది. ఇక మరోవైపు రామచంద్ర తన తమ్ముడికి బెయిల్ రప్పించే విధంగా లాయర్ తో వెళ్లి మాట్లాడుతాడు. అయితే ఎఫ్ఐఆర్ నమోదయిందని చెప్పడంతో లాయర్ అందుకు సంబంధించిన కాపీని తీసుకురమ్మని చెబుతాడు.

  అంతే కాకుండా ఎవరైతే కేసు పెట్టారో వారిని కేసు వెనక్కి తీసుకునే విధంగా ఒప్పించాలి అని కూడా లాయర్ చెప్పాడు. ఇక రామచంద్ర మరోసారి జానకిని బ్రతిమాలేదుకు ఇంటికి వెళతాడు. మీరు ఒకసారి కుటుంబం పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి అని చెబుతాడు. మరి జానకి కుటుంబం గురించి ఆలోచించి మాధురి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 431
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X