Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Janaki Kalaganaledu November 1st: మల్లికకు మరింత పెరిగిన టెన్షన్.. అఖిల్ వర్సెస్ జానకి వార్ స్టార్ట్!
జానకి కలగనలేదు మరో కీలక మలుపు తిరిగింది. ఊరందరికి ఎంతో ప్రేరణగా నిలిచే జ్ఞానాంబ కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. ఇక కుటుంబం విడిపోయే పరిస్థితికి రావడంతో పెద్ద కోడలు జానకి విడిపోనివ్వకుండా చూసుకుంటుంది. జానకి తన భర్త రామ సహాయంతోనే ఐపీఎస్ చదువును పూర్తి చేయాలని అనుకుంటుంది. అందుకు అత్త జ్ఞానాంబ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక జనకికి ఇంట్లోనే మల్లిక నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురవుతాయి. మరి జానకి ఏ విధంగా తన డ్రీమ్ ను సాధిస్తుంది అనేది ఈ సీరియల్ లోని ప్రధాన అంశం. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 422 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

మల్లికకు ప్రెగ్నెన్సీ టెన్షన్
జ్ఞానాంబ రెండవ కోడలు మల్లికా ఇంట్లో తన స్థాయి పెరగాలి అని గర్భవతి కాకున్నప్పటికి కూడా తనకు కడుపు వచ్చింది అని అబద్ధాలు చెబుతుంది. ఆ వంకతోనే ఇంట్లో ఏ పనులు చేయకుండా తింటూ కూర్చుంటుంది. అయితే అసలు విషయం జానకికి తెలియడంతో ఆమె ఎక్కడ అత్త గారితో చెబుతుందో అని మల్లికా భయపడుతూ ఉంటుంది. జానకి ఈసారి ఏమాత్రం క్షమించేది లేదు అని కూడా వార్నింగ్ ఇస్తుంది. దీంతో మల్లికకు టెన్షన్ తో ఏం చేయాలో తోచదు. నిత్యం అదే ఆలోచనతో టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో జానకి నిజంగానే అత్తగారితో చెప్పింది అనే విధంగా ఒక కల కూడా వస్తుంది. దీంతో ఆ కలలో ఉలిక్కిపడిన మల్లిక ఎంత మాత్రం కూడా తన గదిలో నుంచి బయటకు వెళ్లకూడదు అని అనుకుంటుంది. తప్పకుండా జానకి అత్త గారితో ఈ విషయం చెప్పి ఉంటుందేమో అని ఆలోచిస్తూ ఉంటుంది.

జానకి అలా చెప్పడంతో..
మరోవైపు జ్ఞానాంబ చిన్న కుమారుడు అఖిల్ ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉండడంతో ఏదైనా పని చేసుకోవాలి అని జానకి చెబుతుంది. ఇప్పుడు నువ్వు ఒక్కడివే కాదు నీకు తోడుగా భార్య కూడా ఉంది. అలాగే గర్భవతిగా ఉంది. రేపు పుట్టబోయే బిడ్డకు నీ సపోర్ట్ చాలా అవసరం. అలాంటప్పుడు నువ్వు నీ కెరీర్ ను ఇప్పుడే సెట్ చేసుకొని కుటుంబానికి నువ్వే అండగా నిలవాలి అని జానకి చెప్పడంతో అఖిల్ మొదట కొంత అసహనంతో ఉంటాడు. ఆ తర్వాత ఎలాగైనా డబ్బు సంపాదించి ఇంట్లో తన స్థాయిని పెంచుకోవాలని అనుకుంటాడు.

డబ్బు కోసం అబద్ధాలు
ఇక తర్వాత అఖిల్ ఊహించని విధంగా ఒక తప్పుడు దారిలో వెళతాడు. మాదక ద్రవ్యాలు సప్లై చేసే బిజినెస్ లోకి దిగుతాడు. అయితే పెట్టుబడి కింద పది వేల రూపాయలు కట్టాలి అని తన స్నేహితుడు చెప్పడంతో అఖిల్ ఎలాగైనా ఇంట్లో నుంచి పదివేలు తీసుకురావాలని అనుకుంటాడు. మొదట జెస్సి మెడలో ఉన్న గోల్డ్ చూసి దాన్ని తాకట్టు పెట్టుకోవాలని అనుకుంటాడు. ఇక గొలుసును తీసుకోవడానికి అఖిల్ మరొక అబద్ధం చెబుతాడు. తాను ఒక కోర్సులో జాయిన్ కాబోతున్నానని దాని కోసం కొంత డబ్బు కావాలి అని అంటాడు ఇక జానకి మొదట అనుమానం వ్యక్తం చేసినప్పటికీ నా ప్రయత్నం నన్ను చేయనివ్వాలి అని అఖిల్ నమ్మిస్తాడు. ఆ తర్వాత జానకి కూడా అఖిల్ చేతికి 5000 రూపాయలు ఇస్తుంది. ఆ తర్వాత నెక్లెస్ తో పాటు కూడా అఖిల్ డబ్బు తీసుకుంటాడు. అఖిల్ భార్య జెస్సి కూడా అతనికి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది.

జ్ఞానాంబ ముందు మల్లిక
ఇక తర్వాత మల్లిక ఎక్కడ దొంగ ప్రెగ్నెన్సీ బయటపడుతుందో అని భయపడుతూ ఉంటుంది. ఇక తన గదిలోనే ఉంటూ బయటకు ఎవరు పిలిచినా రాకూడదు అని అనుకుంటుంది. ఇంతలో పనిమనిషి వచ్చే మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు అని చెబుతారు. దీంతో అత్తయ్య గారికి నిజం తెలిసిందేమో అని మల్లిక భయపడుతూ ఉంటుంది. ఇక హాల్లోకి వెళ్లేసరికి అందరూ కూడా మల్లికవైపు చూస్తూ ఉంటారు. దీంతో జానకి తన కడుపు గురించి అసలు విషయం చెప్పేసిందేమో అనే టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు జ్ఞానాంబ కూడా అదే అనుమానంతో మాట్లాడుతూ ఉండడంతో మల్లికలో మరింత భయం పెరుగుతుంది. నువ్వు మమ్మల్ని ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అని మల్లికను వారు మరింత భయపెడుతూ ఉంటారు.

అఖిల్ కు అడ్డుకట్ట?
ఇక మరొకవైపు అఖిల్ మాదకద్రవ్యాలు సప్లై చేసే డ్యూటీలోకి ఎక్కుతూ ఉండగానే మరోవైపు జానకి తన ఐపీఎస్ కు సంబంధించిన ప్రమాణాలలో బిజీగా ఉంటుంది. నా కర్తవ్యం లో కుటుంబం లోని వారు తప్పు చేసినా కూడా ఏమాత్రం వదిలిపెట్టను అని జానకి ప్రమాణం చేస్తూ ఉంటుంది. మరి అఖిల్ డ్రగ్స్ సప్లయర్ గా మారడంతో అతనికి జానకి ఎలాంటి అడ్డుకట్ట వేస్తుంది? ఆ తర్వాత జానకి ఇంట్లో పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటుంది? అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.