For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 24th: అఖిల్ విషయంలో గోవిందరాజులు అనుమానం.. మల్లిక కౌంటర్

  |

  జానకి కలగనలేదు సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. రామచంద్ర తమ్ముడు అఖిల్ హత్య ప్రయత్నం చేయడంతో ఆ ఘటనను జానకి చూస్తుంది. అయితే జానకి అతడి పై కేసు కూడా పెడుతుంది. కానీ జానకి అఖిల్ విషయంలో పొరపాటు పడింది అని ఇంట్లో వాళ్ళందరూ కూడా నమ్ముతారు. అఖిల్ కూడా ఆ విధంగా నమ్మిస్తాడు. దీంతో జానకి తన భర్త ఒత్తిడి కారణంగా అలాగే కుటుంబం సంతోషం కారణంగా అఖిల్ మీద కేసును వెనక్కి తీసుకుంటుంది.

  అయితే జానకి ఈ విధంగా జరిగితే రేపు ఐపిఎస్ చదువుకు న్యాయం చేయలేనెమో అనుకొని ఆ చదువులు ఇంతటితో వదిలేయాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం అలా జరగకూడదు అని అనుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 439 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  నిజం మనకు మాత్రమే తెలుసు

  నిజం మనకు మాత్రమే తెలుసు

  అఖిల్, మాధురిపై హత్యాయత్నం చేసి ఏమీ తెలియని వాడిగా ఇంట్లో తిరుగుతూ ఉంటాడు. అలాగే ఇంట్లో వాళ్ళు ముందు మంచివాడిగా నటిస్తూ ఉండాలని అనుకుంటాడు. వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా ఏమాత్రం తీసుకోడు. అయితే ఈ క్రమంలో జానకి నుంచి తప్పించుకోవడం కష్టమని కూడా అఖిల్ ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు.

  ఇక అఖిల్ ఆ విధంగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వచ్చిన జానకి నిజం ఏమిటి అనేది మన ఇద్దరికీ మాత్రమే తెలుసు అయితే రెండు వైపులా కూడా బాధను గమనించాలి అని కనీసం మనిషికి పశ్చాతాపం అయినా ఉండాలి అని జానకి చెబుతుంది. ఇప్పుడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నీ అవసరం ఉంది. అలాగే మరోవైపు మరో అమ్మాయి నీ కారణంగా కోమాలో ఉంది ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకొ అని జానకి అఖిల్ తో మాట్లాడుతుంది.

  అఖిల్ సైలెంట్

  అఖిల్ సైలెంట్

  ఇక జానకి అలా చెబుతుంటే అఖిల్ ఏమీ తెలియని వాడిగా సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత జానకి ఇంట్లో పనులన్నిటిని కూడా చకచకా చేస్తూ ఉంటుంది. అయితే మరోవైపు మల్లిక మాత్రం చాలా ఆనందంగా గంతులు వేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గోవిందరాజులు జ్ఞానాంబ అక్కడికి వచ్చి నువ్వు కడుపుతో ఉన్నావు కదా అలా ఎగరకూడదు అని చెబుతారు. అంతేకాకుండా ఆమె ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోకుండా వేరేవి తింటూ ఉంటే.. ఇలాంటివి తినకూడదు కదా అని చెప్పాను కదా అని క్లాస్ చెప్తారు.

   నిజం చెప్పకముందే

  నిజం చెప్పకముందే

  అప్పుడే జానకి అక్కడికి వచ్చి భోజనం రెడీ చేశాను అని చెబుతోంది. అయితే అందుకు జ్ఞానాంబ సమాధానం ఇస్తూ నువ్వు ఇంట్లో పనులు చాలా ఎక్కువగా చేస్తున్నావు ఈరోజు కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు అని నీ ఐపిఎస్ పరీక్షలకు ఇంకా చాలా తక్కువ సమయం ఉంది కదా అని అడుగుతుంది. అయితే జానకి అందుకు ఇకనుంచి వెళ్లాల్సిన అవసరం లేదు అని సమాధానం ఇస్తుంది.

  దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అయితే అప్పుడు వచ్చిన రామచంద్ర జానకి నిజం చెప్పక ముందే రెండు మూడు రోజులు కాలేజ్ కు సెలవులు ఉన్నాయని అబద్ధం చెబుతాడు. అయితే జ్ఞానాంబ నమ్మినప్పటికి కూడా రామచంద్ర తండ్రి గోవిందరాజులు మాత్రం ఏదో దాస్తున్నారు అని అనుమానం వ్యక్తం చేస్తాడు.

  మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

  మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

  ఇక గదిలోకి వెళ్లిన తర్వాత రామచంద్ర జానకిని మరోసారి బ్రతిమాలే ప్రయత్నం చేస్తాడు. మీరు మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని రామచంద్ర ఎంతగానో చెబుతాడు. అయితే జానకి మాత్రం ఒప్పుకొడు. మీరు ఈ విషయంలో ఎంత బాధ పడుతున్నారో తెలియదు కానీ నేను మాత్రం చాలా బాధపడుతున్నాను అని నా కారణంగా మీరు ఐపీఎస్ కలను వదులుకోవడం నాకు సంతోషాన్ని ఇవ్వదు అని అలాగే నేను కావాలనుకున్న ఐపీఎస్ కలను మీ ద్వారా తీర్చుకుందాం అని అనుకున్నట్లు కూడా రామచంద్ర చెప్తాడు.

  అయితే కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనల్ని కాలానుగుణంగా మారుస్తాయి అని ఈ విషయంలో మీ తప్పు ఏమి లేదు అని నాకు కుటుంబమే అలాగే మీరు ముఖ్యమని ఐపీఎస్ అంతకంటే ఎక్కువ కాదు అని జానకి చెబుతుంది.

  ఏదో జరుగుతుంది

  ఏదో జరుగుతుంది

  ఇక తరువాత మరోవైపు గోవిందరాజులు కోడలి విషయంలో ఏదో జరుగుతుంది అని అనుకుంటాడు. అఖిల్ విషయంలో మనం పొరపాటు పడి జానకిని మరో విధంగా అర్థం చేసుకున్నామెమో అని అనుకుంటాడు. అయితే గోవిందరాజులు అలా మాట్లాడడంతో భార్య జ్ఞానాంబ వెంటనే జానకితో నేను మాట్లాడతాను అని అంటుంది. ఒక తల్లి తరహాలో అడిగే ప్రయత్నం చేస్తుంది. అఖిల్ విషయంలో నువ్వు చేసిన పొరపాటున మేము అందరం మర్చిపోయాము అని నువ్వు ఆ విషయం గురించి ఇక మర్చిపోవాలి జ్ఞానాంబ అంటూంది. అందుకు జానకి కూడా ఆశ్చర్య పోతుంది.

  ఆ విషయం మర్చిపోండి

  ఆ విషయం మర్చిపోండి

  అయితే వెనకాల నుంచి అప్పుడే రామచంద్ర కూడా తల్లి తన భార్యతో మాట్లాడిన విధానం గురించి వింటాడు. మీరు ఏ పొరపాటు చేయలేదు అని వాళ్లకు తెలియక ఆ విధంగా మాట్లాడుతున్నారు అని ఈ విషయంలో మీరు మరొక విధంగా ఆలోచించాలి అని వెంటనే చదువును కొనసాగించాలని రామచంద్ర మళ్ళి బ్రతిమాలే ప్రయత్నం చేసాడు. అయితే ఆ విషయం మర్చిపోండి అంటూ మళ్ళీ జానకి సమాధానం చెబుతుంది.

   మల్లిక కౌంటర్

  మల్లిక కౌంటర్

  అయితే వీరు మాట్లాడుకుంటున్న విషయాన్ని మల్లిక కనిపెడుతుంది. మొత్తానికి జానకి ఐపిఎస్ చదవడం వదిలేసింది అని అయితే అందుకు గల కారణం ఏమిటో తెలుసుకోవాలి అని ఆమె వారిని ఫాలో అవ్వాలని అనుకుంటుంది. అయితే ఈ వంకతో మల్లిక ఎంతో సంతోషంగా ఉంటుంది. కింద పడిపోతూ ఉంటే జ్ఞానాంబ పట్టుకుంటుంది. ఇక మల్లిక గదిలోకి వెళ్ళిన తర్వాత జానకితో మరొక విధంగా మాట్లాడుతుంది. ఈ దొంగ ప్రెగ్నెన్సీ గురించి ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అంటుంది. దీంతో ఆ విషయం ఎవరికి తెలియదు అని మల్లికా మరొక కౌంటర్ ఇస్తుంది. మరి ఈ విషయంలో జానకి ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 439
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X