For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janaki Kalaganaledu November 28th: ఊహించని రిస్క్ లో మల్లిక.. జానకి చదువు కోసం రామ మొండిపట్టు

  |

  జానకి కలగనలేదు కథ మరింత ఆసక్తికరంగా మారుతోంది. జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్ మాధురి అనే అమ్మాయిపై హత్య ప్రయత్నం చేయడంతో జానకి చూస్తుంది. అయితే జానకి అతడి పై కేసు కూడా పెడుతుంది. కానీ జానకి పొరపాటు పడింది అని ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటాడు. అఖిల్ కూడా ఆ విధంగా అందరిని నమ్మిస్తాడు. జానకి తన భర్త ఒత్తిడి కారణంగా అలాగే కుటుంబం సంతోషం కారణంగా అఖిల్ మీద కేసును వెనక్కి తీసుకుంటుంది.

  దీంతో జానకి తన ఐపిఎస్ చదువుకు న్యాయం చేయలేనెమో అనుకొని ఆ చదువులు ఇంతటితో వదిలేయాలని అనుకుంటుంది. కానీ రామచంద్ర మాత్రం అలా జరగకూడదు అని అనుకుంటాడు. జానకి కలగనలేదు సీరియల్ కు గత వారం కంటే ఈ వారం రేటింగ్స్ పెరిగాయి. 7.90 రేటింగ్ తో గత వారం మంచి క్రేజ్ అందుకుంటోంది. నేడు ప్రసారం కాబోయే 441 వ ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలుసుకుందాం..

  న్యాయం చేయాలనెమో అని..

  న్యాయం చేయాలనెమో అని..

  ఇంట్లో కొన్ని పరిస్థితుల కారణంగా జానకి మళ్ళీ తన చదువుని కొనసాగించకూడదు అని అనుకుంటుంది. ముఖ్యంగా రామ ఒత్తిడి కారణంగానే ఆమె చదువుపై తన ఆసక్తిని కోల్పోతుంది. ఐపీఎస్ చదువుకునే న్యాయం చేయాలనెమో అని అనవసరంగా తప్పు చేసిన అఖిల్ను విడిపించడం ఏమాత్రం కరెక్ట్ కాదని అనుకుంటుంది.

  అందుకే ఐపీఎస్ చదువుకుకు న్యాయం చేయాలేమో అని ఆమె మళ్ళీ వెనకడుగు వేస్తుంది. ఇక రామచంద్ర మాత్రం మొదట తన భార్య చదువుకుంటుందేమో అనుకుని అనుకుంటాడు. కానీ ఆమె మెల్లగా మెల్లగా తన చదువుపై దృష్టిని తప్పించేందుకు ప్రయత్నం చేస్తుంది.

  తప్పును కూడా సరిదిద్దుకోవాలి

  తప్పును కూడా సరిదిద్దుకోవాలి

  ఇక రామచంద్ర అసలు విషయం తెలుసుకున్నాక ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఎలాగైనా మళ్ళీ జానకి చదువుకునేలా చేయాలని అనుకుంటాడు. అంతేకాకుండా తన తప్పును కూడా సరిదిద్దుకోవాలని ఆలోచిస్తాడు. అయితే ఇంట్లో జరుగుతున్న అనర్థాల కారణంగా ఏదో దోషం ఉంది అని అందుకే శివాలయం కు వెళ్లే ప్రత్యేకంగా పూజలు హోమాలు చేయించాలి అని జ్ఞానాంబ అనుకుంటుంది.

  దీపం మునిగిపోయేలా చేయాలని

  దీపం మునిగిపోయేలా చేయాలని

  ఇక కుటుంబ సభ్యులందరితో కలిసి గుడికి వెళతారు. అయితే అక్కడ కోనేటిలో దీపాన్ని వదిలే క్రమంలో రామచంద్ర తన మనసులో ఒక కోరికను బలంగా కోరుకుంటాడు. తప్పకుండా అది నెరవేరుతుంది అని జానకితో కూడా చెబుతాడు. అయితే జానకి రామచంద్ర అలా దీపం వదలగానే పక్కనే ఉన్న మల్లికా ఎలాగైనా వారి దీపం మునిగిపోయేలా చేయాలని అనుకుంటుంది.

  అందుకే పక్కనే ఉన్న నీళ్లను తగిలించాలని కూడా ఆమె ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కానీ మల్లిక అప్పుడే తన దీపాన్ని కూడా కోనేటిలో వదులుతుంది. ఎలాగైనా మరో కాపురం పెట్టి సపరేట్ గా ఉండాలని కోరుకుంటుంది. జానకి దీపం కూడా పడిపోవాలని మనసులో అనుకుంటుంది. కానీ మల్లికా చేసిన పొరపాటుకు తన దీపమే మునిగిపోతుంది.

   మల్లిక పై అత్త మామ సీరియస్

  మల్లిక పై అత్త మామ సీరియస్

  అయితే మల్లిక చేసిన తప్పును జానకి కూడా చూస్తుంది. ఇక జానకిని చూసిన మల్లికా మళ్ళీ ఒక్కసారిగా భయపడుతుంది. ఆ తర్వాత అందరూ కూడా హోమం దగ్గరికి వస్తారు. అయితే మల్లిక కాస్త టెన్షన్ లో ఉండడంతో ఏమైంది అని జ్ఞానాంబ అడుగుతుంది. దీంతో పక్కనే ఉన్న పనిమనిషి ఆమె దీపం నీటిలో మునిగిపోయింది అని చెబుతుంది. ఇక మల్లిక అజాగ్రత్త వల్లే అది జరిగింది అని మామ గోవిందరాజులు కూడా మల్లికపై సీరియస్ అవుతాడు. ఇక జ్ఞానాంబ కూడా ఏదైనా పని చేసేటప్పుడు ధ్యాస దేవుడిపై ఉండాలి అని చివాట్లు పెడుతుంది.

   మల్లికకు మరో షాక్

  మల్లికకు మరో షాక్

  ఆ తరువాత హోమం విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉండాలి అని నిష్టతో పూజను కొనసాగించాలని హెచ్చరిస్తుంది. ఇక మల్లిక సరే అని హోమంలో కూర్చుంటుంది అయితే అప్పుడే జ్ఞానాంబ మల్లికకు మరో షాక్ ఇస్తుంది. కోనేటిలో దీపం మునిగిపోయింది అని ఏమాత్రం బాధపడకు అంటుంది. ఇక కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉంటాడు అని అందుకే రేపు ఒకసారి హాస్పిటల్ కి వెళ్తాము అని అంటారు. దీంతో మల్లికా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు దొంగ ప్రెగ్నెన్సీ నాటకమాడిన మల్లిక రేపు హాస్పిటల్ కి వెళితే అసలు విషయం బయటపడుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

  రామ మొండిపట్టు

  ఇక అప్పుడు కొబ్బరికాయలు కారులోనే మర్చిపోవడంతో జానకి తీసుకురావడానికి వెళుతుంది. ఇంతలో జ్ఞానాంబ చిరకాల శత్రువు సునంద దేవి అక్కడికి వస్తుంది. ఇక అక్కడ కడుపుతో ఉన్న మల్లికతో అలాగే చిన్న కోడలు జెస్సి తో హోమం చేయిస్తున్న విధానాన్ని చూసి పెద్ద కోడలు ఎందుకు కూర్చోలేదు అని అడుగుతుంది.

  అంతేకాకుండా మీ పెద్ద కోడలు ఇంకా తల్లి కాలేదు కదా అని అందరి ముందు మాట్లాడుతుంది. దీంతో మిగతా వాళ్ళు కూడా అదే విధంగా జ్ఞానాంబ కుటుంబాన్ని ప్రశ్నిస్తారు. ఇక అప్పుడే జానకి వచ్చి సునంద దేవికి కౌంటర్ ఇవ్వాలని అనుకుంటుంది. అయితే మరొకవైపు రామచంద్ర తన భార్యను ఎలాగైనా చదువును కొనసాగించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.

  అందుకే చేతిలో కర్పూరం పెట్టుకుని దేవుడిని కోరుకుంటు ఉంటాడు. ఇక అతను చేతిలో కర్పూరం పెట్టుకున్నప్పుడు కాలుతూ ఉంటుంది. అయినా అలానే ఉంటాడు. ఇక జానకి అప్పుడు కర్పూర అనేదాన్ని తీసేస్తుంది. మరి తన భార్యకు రామచంద్ర ఇంకా ఎలా అర్థమయ్యేలా చెబుతాడో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

  English summary
  Janaki Kalaganaledu Today Episode 441
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X