»   » ‘జనతా గ్యారేజ్’‌కి టాప్ రేటింగ్... (టాలీవుడ్ టాప్-10 లిస్ట్)

‘జనతా గ్యారేజ్’‌కి టాప్ రేటింగ్... (టాలీవుడ్ టాప్-10 లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ హీరోగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తవ్వగానే..... ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న మా టీవీ వారు అక్టోబర్ 28న బుల్లితెర ప్రీమియర్ షో వేసారు.

బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించిన 'జనతా గ్యారేజ్' బుల్లితెర పై కూడా తన సత్తా చాటింది. ఓ వైపు సినిమా థియేటర్లలో ఉండగానే టీవీల్లో షో వేయడంతో రెస్పాన్స్ అదిరిపోయింది. టీఆర్పీ రేటింగుల పరంగా రికార్డ్ సృష్టించింది.

2016 సంవత్సరంలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు రాని విధంగా..... 20.69 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ వచ్చాయి. ఇంతకు ముందు బిచ్చగాడు మూవీ 18 టీఆర్పీ రేటింగ్ పాయింట్లతో టాప్ లో ఉండేది. ఇపుడు జనతా గ్యారేజ్ మూవీ ఆరికార్డును తుడిచేసింది.

క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పటికీ

క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పటికీ

జనతా గ్యారేజ్ సినిమా టీవీల్లో ప్రసారం అయిన రోజు.... ఇండియా vs న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అయింది. అయినప్పటికీ ఇంత టీఆర్పీ రేటింగ్ సాధించడం విశేషం. ఆ మ్యాచ్ లేకుండా ఉంటే రేటింగ్ మరింత పెరిగే అవకాశం ఉండేదని అంటున్నారు.

ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ రేటింగ్

ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ రేటింగ్

ఇప్పటివరకూ ఎన్టీఆర్ నటించిన ఏ మూవీ కూడా 20 టీఆర్పీ రేటింగులను అందుకోలేదు. కానీ జనతా గ్యారేజ్ మూవీ ఎన్టీఆర్ కెరీర్లోనే టాప్ టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.

మగధీర టాప్

మగధీర టాప్

తెలుగు సినిమాలకు సంబంధించి... అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా రామ్ చరణ్ నటించిన ‘మగధీర' మూవీ టాప్ పొజిషన్లో ఉంది. మగధీర చిత్రం 22.7 రేటింగుతో నెం. 1 స్థానంలో ఉంది.

రెండో స్థానంలో బాహుబలి

రెండో స్థానంలో బాహుబలి

ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి' మూవీ 21.84 రేటింగుతో రెండో స్థానంలో ఉంది.

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది

పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది ఆ మద్య మాటీవీలో వేయగా 19.04 రేటింగ్ వచ్చింది.

రోబో

రోబో

రజనీకాంత్ నటించిన రోబో చిత్రం జెమిని టీవీలో వేయగా 19 రేటింగ్ వచ్చిం

దృశ్యం

దృశ్యం

వెంకటేష్ నటించిన దృశ్యం చిత్రం జెమిని టీవీలో వేయగా 18.61 రేటింగ్ వచ్చింది.

ఈగ

ఈగ

ఈగ చిత్రం ఆ మధ్య మాటీవీలో ప్రసారం అయి 17.72 రేటింగ్ దక్కించుకుంది.

సన్నాఫ్ సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి

అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి మాటీవీలో ప్రసారం అయి 17.38 రేటింగ్ దక్కించుకుంది.

దూకుడు

దూకుడు

మహేష్ బాబు నటించిన ‘దూకుడు' చిత్రం మాటీవీలో వేయగా 17.1 రేటింగ్ వచ్చింది.

అల్లుడు శీను

అల్లుడు శీను

అల్లుడు శీను చిత్రం జెమిని టీవీలో వేయగా 16.71 రేటింగ్ వచ్చింది.

గోవిందుడు అందరి వాడేలే..

గోవిందుడు అందరి వాడేలే..

గోవిందుడు అందరి వాడేలే చిత్రం జెమిని టీవీలో 15.85 రేటింగ్ వచ్చింది

English summary
'Janatha Garage', which was telecast on Oct 28 on MAA TV, has registered the highest-ever TRPs for a Telugu movie so far in 2016. The TRP figure, as put out by the channel, is 20.69.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu