For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘జబర్ధస్త్’ కమెడియన్లపై జానీ మాస్టర్ సీరియస్.. కొరియోగ్రాఫర్ దెబ్బకు భయంతో వణికిపోయారు.!

  By Manoj Kumar P
  |

  తెలుగు బుల్లితెరపై పాపులారిటీ దక్కించుకున్న ప్రోగ్రామ్‌లలో 'పటాస్' ఒకటి. ఈ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకానొక సమయంలో మరో క్రేజీ షో 'జబర్ధస్త్‌'కు పోటీ ఇచ్చేలా ఈ షో టీఆర్పీలను సాధించిన విషయం తెలిసిందే. పటాస్ ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ షో పాపులర్ అవ్వడానికి కంటెంట్‌తో పాటు యాంకర్లు రవి, శ్రీముఖి పాత్ర కూడా ఎంతో ఉంది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ దీనికి మరింత హైప్ తీసుకొచ్చింది. అదే సమయంలో వివాదాలనూ మోసుకొచ్చింది. తాజాగా ఈ షోలో ఊహించని పరిణామం జరిగింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది.?

  ఆమె వెళ్లిపోయింది.. ఈమె ఎంటర్ అయింది

  ఆమె వెళ్లిపోయింది.. ఈమె ఎంటర్ అయింది

  ఈ షో ప్రారంభం నుంచీ యాంకర్‌గా పని చేసిన శ్రీముఖి బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంటర్ అవడం కోసం పటాస్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె స్థానంలో మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టిన వర్షిణి ఎంటర్ అయింది. ఆమె అంత ఎఫెక్టివ్‌గా యాంకరింగ్ చేయలేకపోయినా పర్వాలేదనిపిస్తోంది. అయితే, ఉన్నట్లుండి ఈ షోలో సరికొత్త యాంగిల్ దర్శనమిచ్చింది.

  అప్పటిలా లేదు.. ఫ్యాన్స్‌లో నిరాశ

  అప్పటిలా లేదు.. ఫ్యాన్స్‌లో నిరాశ

  పటాస్ ఎంత సక్సెస్‌ఫుల్ షోనో.. కొద్ది రోజుల నుంచి మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోతోంది. శ్రీముఖి గైర్హాజరు అవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో షో మునపటిలా లేదంటూ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అంతేకాదు, పాత ఆర్టిస్టులు కూడా తప్పుకోవడం షోపై తీవ్రంగా ప్రభావం చూపించింది.

  రవి హ్యాండ్ ఇచ్చాడు.. చలాకీగా వచ్చాడు

  రవి హ్యాండ్ ఇచ్చాడు.. చలాకీగా వచ్చాడు

  ఈ షో రేటింగ్ తగ్గిపోతుందని అనుకున్నాడో.. మరేమైనా కారణమో తెలియదు కానీ.. ఇటీవల పటాస్ నుంచి యాంకర్ రవి కూడా బయటకు వెళ్లిపోయాడు. తర్వాత వేరే ఛానెళ్లలో ప్రసారం అవుతున్న ప్రోగ్రామ్‌లలో కనిపిస్తున్నాడు. దీంతో అతడి స్థానంలో చలాకీ చంటీ ఎంటర్ అయ్యాడు. అప్పటి నుంచి తనదైన టైమింగ్‌తో షోను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.

  పటాస్‌లో ఊహించని పరిణామం

  పటాస్‌లో ఊహించని పరిణామం

  పటాస్ షోలో వచ్చే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో ఓ ఊహించని పరిణామం ప్రేక్షకులతో పాటు యాంకర్లను షాక్‌కు గురి చేసింది. ఈ ఎపిసోడ్‌కు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గెస్ట్‌గా వచ్చారు. ఈ క్రమంలో ఆయనపై జబర్ధస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్, కార్తీక్ సెటైర్లు వేశారు. దీంతో ఆయన వాళ్లిద్దరిపై ఫైర్ అయిపోయారు.

  చేతిలో ఉన్నది విసిరేసి.. మీదకెళ్లాడు

  ఓ స్కిట్‌లో భాగంగా అవినాష్, కార్తీక్ ప్రదర్శన ఇస్తున్నారు. ఈ సందర్భంగా ‘జానీ మాస్టర్ షూలతో డ్యాన్స్ చేస్తాడు.. అందులో ఏమీ గొప్ప లేదు.. ఆయనకు చాలా టెంపర్ ఉంది' అంటూ సెటైర్లు వేశారు. దీంతో జానీ మాస్టర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. చేతిలో ఉన్న వస్తువును విసిరేయడంతో పాటు స్టేజ్‌పైకి వెళ్లి వాళ్లిద్దరితో వాదనకు దిగాడు.

  CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
  వణికిపోయిన కమెడియన్లు

  వణికిపోయిన కమెడియన్లు

  ఎప్పుడూ నవ్వుతూ ఉండే జానీ మాస్టర్ కోపంతో తమ పైకి రావడంతో అవినాష్, కార్తీక్ వణికిపోయారు. యాంకర్లు కూడా తెల్లమొఖమేశారు. ఆ సమయంలో ‘చెప్పండి.. ఇంకా చెప్పండి' అంటూ జానీ మాస్టర్ నవ్వడంతో, ఇదంతా కామెడీలో భాగమని అందరికీ అర్థం అయింది. దీంతో అక్కడున్న వాళ్లందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

  English summary
  Patas Show.. It is a stand-up comedy show hosted and anchored by Ravi and Varshini Sounderajan. Where daily three popular comedians from TV & Films will come and perform in two segments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X