»   » సిద్ధార్థ్‌తో అఫైర్ లేదు. అలాంటి రిలేషన్ లేదు.. జాస్మిన్

సిద్ధార్థ్‌తో అఫైర్ లేదు. అలాంటి రిలేషన్ లేదు.. జాస్మిన్

Written By:
Subscribe to Filmibeat Telugu

టెలివిజన్ తెరపై దిల్ సే దిల్ తక్ అనే సీరియల్ ద్వారా సిద్ధార్థ్ శుక్లా, జాస్మిన్ భాసిన్ సుపరిచితులు. వారి మధ్య సన్నిహిత సంబంధాలపై అనేక రకాల రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. సిద్ధార్థ్‌తో ఉన్న సంబంధంపై వస్తున్న పలు ఆరోపణలపై జాస్మిన్ స్పందించింది. తాజాగా ఆమె మీడియాతో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకొన్నారు.

వాస్తవం కాదు..

వాస్తవం కాదు..

సిద్ధార్థ్‌తో ఉన్న రిలేషన్‌పై వస్తున్న రూమర్లలో వాస్తవం లేదు. అతడి గురించి తెలిసిన వారు అలాంటి వ్యాఖ్యలు చేయరు. నిజానికి ఆయన మంచి మనసు ఉన్న మనిషి. ఎప్పుడూ జోక్స్ పేల్చుతూ సరదాగా ఉంటాడు. అతడిని కొన్నిసార్లు టపోరి అని పిలుస్తాను అని జాస్మిన్ తెలిపింది.

సిద్ధార్థ్‌తో అఫైర్ లేదు.

సిద్ధార్థ్‌తో అఫైర్ లేదు.

సిద్ధార్థ్‌తో అఫైర్ ఉన్నట్టు వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. మా రిలేషన్‌పై వస్తున్నవన్నీ రూమర్లే. అతడు నాకు మంచి స్నేహితుడు. మా మధ్య స్నేహం తప్ప మరో బంధం లేదు. నా సహచర నటుడు
సూరజ్‌తో సంబంధాలు అంటగడుతూ వార్తలు రాస్తున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

స్నేహితులు కాలేరా?

స్నేహితులు కాలేరా?

నిజ జీవితంలో ఒక యువకుడు, యువతి మంచి స్నేహితులు కాలేరా? ఫ్రెండ్స్‌తో కలిసి హాలీడేస్ గడిపేందుకు వెళ్లడం కూడా తప్పేనా. అందరి వలనే నా స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటాను. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌పైనే ఉంది. ప్రేమ, అఫైర్ లాంటి అంశాలకు ప్రస్తుతం సమయం లేదు. ఎవరితోనైనా, ఎప్పుడైనా ప్రేమలో పడితే మీతో ఆ విషయాన్ని పంచుకొంటాను అని జాస్మిన్ చెప్పింది.

నిజంగా అదృష్టం

నిజంగా అదృష్టం

దిల్ సే దిల్ తక్ సీరియల్‌తోనే కాకుండా తషాన్ఏ ఇష్క్‌లో ట్వింకిల్ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చింది. తొలిసారి పోషించే పాత్ర గుర్తుండి పోయేలా ఉంటుంది. ట్వింకిల్ లాంటి పాత్ర దొరకడం నిజంగా అదృష్టం. ఆ పాత్ర ద్వారా చాలా నేర్చుకోవడమే కాకుండా అత్యంత ప్రజాదరణ తెచ్చిపెట్టింది అని జాస్మిన్ తెలిపింది.

English summary
Television actress Jasmin Bhasin responded about the rumours of her closeness with Siddharth and she denies it vehemently. “This is just a rumour. He is my best friend and there is nothing more than friendship between us.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu