సీక్రెట్ రూమ్‌లోకి జస్వంత్ పడాల.. క్వారంటైన్‌లో జెస్సీని ఎందుకు పెట్టారంటే? బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఇదే!

బిగ్‌బాస్ తెలుగు 5 షోలో అనారోగ్యంతో బాధపడుతున్న జస్వంత్ పడాల విషయంలో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వైద్య చికిత్స కోసం ఇంటి నుంచి బయటకు జెస్సీని పంపించడంతో ఇంటి సభ్యులు, బిగ్‌బాస్ ప్రేక్షకులు, జెస్సీ అభిమానులు షాక్ గురయ్యారు. అయితే జెస్సీ మళ్లీ ఇంటిలోకి వస్తాడా లేదా అనే విషయంపై బిగ్‌బాస్ వెంటనే క్లారిటీ ఇచ్చారు. వైద్య చికిత్స అందించిన తర్వాత జెస్సీని సీక్రెట్ రూమ్‌లోకి పంపించి గేమ్‌ను మరింత ఆసక్తిగా మలిచాడు. అయితే జెస్సీని ఎందుకు సీక్రెట్ రూమ్‌లో పెట్టారంటే..

వెర్గిగో వ్యాధితో బాధపడుతున్న జెస్సీకి

వెర్గిగో వ్యాధితో బాధపడుతున్న జెస్సీకి

వెర్టిగో అనే వ్యాధితో బాధపడుతున్న జస్వంత్ పడాలను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఆరోగ్యం ఎలా ఉందంటూ బిగ్‌బాస్ వాకబు చేశారు. దాంతో వైద్యులు మెడిసిన్స్ ఇచ్చారు. వాటిని వాడుతున్నాను. కానీ ఈ రోజు భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపించింది అని జెస్సీ సమాధానం చెప్పాడు. అయితే వైద్య పరీక్షల కోసం నిన్ను బయటకు పంపిస్తున్నాం. మీరు మెయిన్ గేట్ నుంచి బయటకు రండి అంటూ బిగ్‌బాస్ ఆదేశించాడు.

థ్యాంక్యూ నాగ్ సార్ అంటూ భావోద్వేగం

థ్యాంక్యూ నాగ్ సార్ అంటూ భావోద్వేగం

బిగ్‌బాస్ చెప్పిన మాటలు విన్న జెస్సీ ఎమోషనల్ అయి కంటతడి పెట్టారు. మీరు నాకు లైఫ్. నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు. లవ్ యూ బిగ్‌బాస్ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. హోస్ట్ నాగార్జున గుర్తు చేసుకొని లవ్ యూ నాగ్ సార్.. నాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు అంటూ జెస్సీ బయటకు వచ్చారు. ఇంటి సభ్యులకు చెప్పడంతో అందరూ కంటతడి పెట్టారు. సిరి హన్మంతు, షణ్ముఖ్ కంటతడి పెడుతూ బయటకు పంపించారు.

వైద్య పరీక్షల అనంతరం సీక్రెట్ రూమ్‌లోకి

వైద్య పరీక్షల అనంతరం సీక్రెట్ రూమ్‌లోకి

అయితే వైద్య పరీక్షల అనంతరం జెస్సీ ఆరోగ్యం విషయంలో భయపడాల్సిన అవసరం లేకపోవడంతో అతడిని సీక్రెట్ రూమ్‌కు పంపించారు. దాంతో సీక్రెట్ రూమ్‌లోకి వచ్చిన జెస్సీ.. బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెబుతూ.. నాకు ఎలాంటి హెల్త్ చెకప్ చేయించారు .ప్రాబ్లెం లేదని డాక్టర్లు చెప్పారు. మంచి మెడిసిన్స్ ఇచ్చారు. హెల్త్ కండిషన్ బాగా ఉందని ఇక్కడ పెట్టారు. అందుకు థ్యాంక్స్ అంటూ జెస్సీ అన్నాడు.

నీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు

నీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు

సీక్రెట్ రూమ్‌లోకి వచ్చిన జెస్సీతో బిగ్‌బాస్ మాట్లాడుతూ.. వెల్‌కమ్ బ్యాక్ జెస్సీ.. థ్యాంక్స్ బిగ్‌బాస్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని జెస్సీ అన్నాడు. జెస్సీ నీ ఆరోగ్యం విషయంలో మేము డాక్టర్లతో ఇన్వెస్టిగేషన్ చేయించాం. అందుకోసం బయటకు తీసుకెళ్లడం జరిగింది. మిమ్మల్ని క్షణ్ణంగా పరిశీలించడం జరిగింది. మీ ఆరోగ్య విషయంలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు అని జెస్సీకి బిగ్‌బాస్ చెప్పారు.

క్వారంటైన్‌లో పెడుతున్నాం అంటూ..

క్వారంటైన్‌లో పెడుతున్నాం అంటూ..

అయితే మెడికల్ చెకప్ కోసం బయటకు తీసుకెళ్లడం కారణంగా మిమ్మల్ని క్వారంటైన్‌లో ఉంచాం. బిగ్‌బాస్ తదుపరి ఆదేశాల వరకు సీక్రెట్ రూమ్‌లో ఉండాల్సి ఉంటుంది అని జెస్సీకి ఆదేశాలు ఇచ్చారు. దాంతో సీక్రెట్ రూమ్‌లో సంతోషంగా ఇంటి సభ్యుల ఆటను చూస్తూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అయితే క్వారంటైన్ ఎన్ని రోజులు అనే విషయంపై బిగ్‌బాస్ నిర్ణయం తీసుకొని ఇంటిలోకి అతడికి పంపిస్తారా అనేది ఆసక్తిగా మారింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : ఈ వారం ట్విస్ట్ ఇదే..!! || Filmibeat Telugu
క్షీణిస్తున్న బిగ్‌బాస్ రేటింగ్

క్షీణిస్తున్న బిగ్‌బాస్ రేటింగ్

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ షో రేటింగ్ విషయానికి వస్తే.. శనివారం, ఆదివారంలో హోస్ట్ నాగ్ నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన రేటింగ్ పెద్దగా మెరుగుపడినట్టు కనిపించలేదు. 42వ వారంలో 8.89 రేటింగ్ వస్తే.. 43వ వారంలో అర్బన్ ప్రాంతంలో 8.17గా నమోదైంది. ఇక రూరల్ ప్రాంతంలో 42వ వారం 6.54 రేటింగ్ వస్తే.. ఈ వారం అంటే 43వ వారం 5.47గా రేటింగ్ నమోదైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X