Bigg Boss Telugu 5 లో షాకింగ్ సంఘటన.. జెస్సీని బయటకు పంపించిన బిగ్‌బాస్! అసలేం జరిగిందంటే?

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోను అభిమానులు ఆస్వాదిస్తూ సజావుగా సాగుతున్న సమయంలో చిన్న షాకింగ్ సంఘటన జరిగినట్టు సమాచారం బయటకు వచ్చింది. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్వంత్ పడాల తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు, ట్రీట్‌మెంట్ కోసం బయటకు పంపించినట్టు తెలుస్తున్నది. అయితే జెస్సీ అనారోగ్యానికి సంబంధించిన కారణాలు ఏమిటంటే..

అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీ

అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీ

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో తనదైన గేమ్ స్ట్రాటెజీతో ఆకట్టుకొంటున్న జస్వంత్ పడాల కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వాంతులు, ఇతర సమస్యలతో బాధపడుతుంటడం షోలో కనిపించింది. తనకు వెర్టిగో (vertigo) అనే సమస్యతో బాధపడుతున్నానని స్వయంగా జెస్సీ చెప్పడం జరిగింది.

వెర్టిగో సమస్యతో జస్వంత్ పడాల

వెర్టిగో సమస్యతో జస్వంత్ పడాల

గతవారం వెర్టిగో సమస్యతో బాధపడుతున్న జస్వంత్ పడాలను టాస్కుల నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకోమని బిగ్‌బాస్ ఆదేశించాడు. అయినా తన శక్తి మేరకు టాస్కుల్లో పాల్గొని ఆకట్టుకొన్నాడు. బిగ్‌బాస్ వద్దని చెప్పినా టాస్క్‌లో పాల్గొన్నావు.. అందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ నాగార్జున సండే ఫండే షోలో ప్రశంసలు గుప్పించారు. త్వరగా కోలుకోవాలని జెస్పీకి ఉపశమనం కలిగించే మాటలు చెప్పడం తెలిసిందే.

గత సీజన్‌లో నోయల్ సీన్ కూడా

గత సీజన్‌లో నోయల్ సీన్ కూడా

గతంలో బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో నోయల్ సీన్ అనారోగ్యానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులు నోయల్ ఇంటిలోనే ట్రీట్‌మెంట్ తీసుకొన్నప్పటికీ.. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో గేమ్ నుంచి నోయ్ బయటకు వెళ్లడం తెలిసిందే. అలాంటి పరిస్థితే ప్రస్తుతం జెస్సీకి ఎదురైంది. దాంతో ప్రస్తుతం చికిత్స కోసం బయటకు వెళ్లినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

తాత్కాలికంగానా? లేదా

తాత్కాలికంగానా? లేదా

అయితే జెస్సీ తాత్కాలికంగా ట్రీట్‌మెంట్ కోసం వెళ్లాడా? లేక పూర్తిగా గేమ్ నుంచి బయటకు వచ్చాడా? అనే విషయంపై క్లారిటీ లేదు. అయితే బిగ్‌బాస్ విడుదల చేసే తాజా ప్రోమోలో ఏదైనా విషయాన్ని వెల్లడిస్తాడా అనేది వేచి చూడాల్సిందే. జెస్సీ ఆరోగ్యం గురించిన వార్త బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Recommended Video

Hero Sudheer Babu Interaction With His Lady Fan
వెర్టిగో లక్షణాలు, సమస్య ఏమిటంటే

వెర్టిగో లక్షణాలు, సమస్య ఏమిటంటే

జస్వంత్ పడాలకు బాధపడుతున్న ఆరోగ్య సమస్య విషయానికి వస్తే.. వెర్టిగో అనే వ్యాధితో బాధపడుతున్నాడు. వెర్టిగో వ్యాధితో బాధపడే వాళ్లకి తలతిరగడం, ముందుకు తూలిపడటం, కంటిచూపు తగ్గడం, ఒక చెవిలో వినికిడి లోపం ఏర్పడటం, సరిగా నిలబడలేకపోవడం, చెవిలో ఇబ్బందికి గురిచేసే శబ్దాలు, చెమటలు పట్టడం, వాంతులు చేసుకోవడం లాంటి సమస్యలు ఉంటాయి. అయితే సరైన సమయంలో డాక్టర్ సలహాలు తీసుకోకపోయి.. వైద్యం తీసుకోకపోతే ప్రాణాంతకంగా కూడా మారే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X