twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బయట పడుతున్న శిఖా చౌదరి నిజస్వరూపం... బీరువా తాళాల కోసం గొడవ!

    |

    తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పారిశ్రామిక వేత్త, ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని జయరాం హత్య కేసులో సంచలన విషయాలు బయట పడుతున్నాయి. తాజాగా జయరాం భార్య పద్మశ్రీ ఓ ఛానల్ తో మాట్లాడుతూ 2015 నుంచే తన భర్తకు ఇబ్బందులు మొదలయ్యాయని తెలిపారు.

    మొదటి భార్య నుంచి ఎలాంటి ఇబ్బందులు రాలేదని, తన భర్త బంధువుల నుంచే ప్రమాదం ఉందని తెలిపారు. శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్ అని, ఎక్స్‌ప్రెస్ టీవీలో జాయినైన తర్వాత కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని, అందుకే టీవీ ఛానల్ నుంచి ఆమెను తప్పించారని పద్మశ్రీ మీడియాకు తెలిపారు.

    బీరువా తాళాల కోసం గొడవ

    బీరువా తాళాల కోసం గొడవ

    జయరాం 30వ తేదీన తన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత 31వ తేదీన శిఖా చౌదరి ఆయన ఇంటికి వెళ్లింది. బీరువా తాళాలు ఇవ్వాలని వాచ్‌మెన్ తో గొడవకు దిగింది. ఆ సమయంలో శిఖా అక్కడికి ఎందుకు వెళ్లింది అనేది మిస్టరీగా మారడంతో పోలీసులు ఆమెను విచారిస్తున్నారు.

    బీరువాలో ఏమున్నాయి?

    బీరువాలో ఏమున్నాయి?

    శిఖా చౌదరి బీరువా తాళాల కోసం గొడవ చేయడంతో... ఆ బీరువాలో ఏమున్నాయి? అనేది చర్చనీయాంవం అయింది. ఈ అంశాలపైనే పోలీసులు ఆమెను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెను ఎక్కడ విచారిస్తున్న విషయం రహస్యంగా ఉంచారు.

    31 గంటల్లో ఏం జరిగింది?

    31 గంటల్లో ఏం జరిగింది?

    జనవరి 30వ తేదీన జయరాం తన ఇంటి నుంచి బయల్దేరి వచ్చారు. 31 గంటల తర్వాత ఆయన మృతదేహం నందిగామ వద్ద బయటపడింది. ఈ 31 గంటల్లో ఏం జరిగింది? ఈ హత్యలో ఎవరెవరి పాత్ర ఉంది అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

    హోటల్‌లో ఎవరిని కలిశారు?

    హోటల్‌లో ఎవరిని కలిశారు?

    జయరాం సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో చాలా సేపు ఓ గదిలో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత జూబ్లీ హిల్స్‌లోని వివాహ భోజనంబు హోటల్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఆయన ఎవరిని కలిశారు అనే అంశాలను పోలీసులు ట్రేస్ చేస్తున్నారు.

    రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి

    రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి

    ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ఇంకా ఐదుగురికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణం. అయితే ఈ కేసులో శిఖా చౌదరి పాత్ర లేదన పోలీసులు ప్రాథమికంగా నిర్దారించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    హైదరాబాద్‌కు కేసు బదిలీ

    హైదరాబాద్‌కు కేసు బదిలీ

    జయరాంను హైదరాబాద్ లోనే హత్య చేసి కారులో నందిగామ తరలించి అక్కడ వదిలేసినట్లు తెలుస్తోంది. జయరాం హత్య హైదరాబాద్ లో జరిగింది కాబట్టే ఇక్కడకు కేసు బదిలీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే పోలీసులు ఈ కేసుకు సంబందించిన వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని అంటున్నారు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, చాలా మందిని విచారిస్తున్నట్లు తెలిపారు. అందులో శిఖా చౌదరి ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు అన్నారు.

    English summary
    NRI businessman Jayaram's wife Padma Shri reveals facts on Shikha Chaudhary. She nailed Shikha Chaudhary in murder case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X