సీరియల్ .. మనోభావాలను దెబ్బతీస్తోందంటూ...

By Srikanya

Jodha Akbar in new controversial
నాందేడ్‌ : జీ టీవీలో ప్రసారమవుతున్న జోథాఅక్బర్‌ హిందీ సీరియల్‌ను నిలిపివేయాలని క్షత్రియ సమాజం కార్యకర్తలు జిల్లా ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ దిలీప్‌స్వామికి వినతి పత్రం సమర్పించారు. క్షత్రియ సమాజం జిల్లాధ్యక్షులు పవన్‌సింగ్‌ భైస్‌ ఆధ్వర్యంలో సమాజం కార్యకర్తలు కలెక్టర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జీ టీవీలో ప్రసారమవుతున్న జోథాఅక్బర్‌ సీరియల్‌లో చాలా సన్నివేశాలు హిందూ మనోభావాలకు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో హిందూ యువతులను కించపరిచేవిగా ఉన్నాయని తెలిపారు.

ఇలాంటి సన్నివేశాలు దైనందిన హిందూ సమాజంపై దుష్ప్రభావం చూపుతాయని విమర్శించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జిల్లాధ్యక్షులు పవన్‌సింగ్‌తో పాటు ప్రతిపక్ష నాయకుడు దీపక్‌సింగ్‌ రావత్‌, శరద్‌సింగ్‌ చౌదరి, సుశ్మాఠాకూర్‌ తదితరులు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X