»   » ఫుల్ గా తాగి,మత్తులో టీవి నటిపై లైంగిక దాడి, పోలీస్ కంప్లైంట్

ఫుల్ గా తాగి,మత్తులో టీవి నటిపై లైంగిక దాడి, పోలీస్ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: తాగిన మైకంలో చేసే చిల్లర పనులు ఒక్కోసారి పెద్ద ఇబ్బందులనే కొని తెచ్చిపెడుతూంటాయి.తాజాగా బెంగ‌ళూరులోని ఓ బార్‌లో జ‌రిగిన గొడ‌వ‌లో ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త కుమారుడు ఒక‌రు టీవి న‌టిపై దాడికి య‌త్నించాడు. దాడి ఘ‌ట‌న‌పై న‌టి స్నేహితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.


పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. బెంగళూరు యూబీ సిటీ 17వ అంతస్ధులోని స్రైబార్‌లో ఆదివారం రాత్రి ఫుల్ గా తాగిన కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు తీవ్రంగా గొడవపడి తిట్టడంతో పరస్పరం కొట్టుకున్నారు.

Kannada TV Actress Files Molestation Complaint

వాళ్లు మొత్తం ఏడుగురు. వాళ్ళలో ..బుల్లితెర నటి నిరూషా కూడా ఉంది. ఓ ద‌శ‌లో పీక‌లదాకా తాగిన పారిశ్రామికవేత్త కుమారుడు ద‌ర్శ‌న్ ...నిరూషాపై లైంగిక దాడికి య‌త్నించాడు. దీంతో స్నేహితుల‌తో క‌లిసి క‌బ్బ‌న్‌పార్క్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన నిరూషా ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

అయితే మ‌త్తు దిగిన ద‌ర్శ‌న్ చేసిన త‌ప్పుకు క్ష‌మించాల‌ని కోరుతూ నిరూషాకు లేఖ రాయ‌డంతో క‌థ అక్క‌డితో ముగిసింది. నిరూషా కూడా దర్శన్‌పై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకునేందుకు అంగీకరించింది. అడపాదడపా స్కైబార్‌లో ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు.

English summary
A Kannada television actress has filed a complaint of sexual harassment against Darshan, son of a prominent builder in Bengaluru. She filed a complaint of molestation and of attempts to bury the case by local cops at a police station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu