»   » తాగి,వాగి రచ్చ రచ్చ చేసిన సీరియల్ ఆర్టిస్టు..అరెస్ట్

తాగి,వాగి రచ్చ రచ్చ చేసిన సీరియల్ ఆర్టిస్టు..అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: కన్నడ టీవీ ఆర్టిస్ట్ రక్షిత్‌ అలియాస్‌ మహేష్‌ను కళాసీపాళ్య పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసారు. అనంతరం వ్యక్తిగత పూచీపై విడుదల చేశారు. విజయనగరకు చెందిన ఆ నటుడు మంగళవారం తెల్లవారు జామున 2.30 గంటలకు జేసీరోడ్డు మినర్వ కూడలిలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులపట్ల అసభ్యంగా, ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించినట్లు అధికారులు తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారనే అనుమానంతో సిటీ మార్కెట్‌ సంచార పోలీసులు రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు వాహనాల తనిఖీ చేశారు. ఆ కూడలిలోకి వచ్చిన నటుడు రక్షిత్‌ కారును పోలీసులు నిలిపారు. ఆల్కో మీటరు నోట్లో పెట్టి వూదమన్నారు. అందుకు ఆయన నిరాకరించారు.

kannada tv artist Mahesh arrest for Drunk Driving

తాను సమాజంలో ప్రముఖ వ్యక్తిని.. నన్నే పరీక్ష చేస్తారా? అని సంచార ఎస్‌.ఐ. నటరాజ్‌పై విరుచుకుపడ్డారట. వాగ్వాదానికీ దిగారట. తన కర్తవ్యానికి అడ్డుపడ్డారంటూ ఆ ఎస్‌ఐ కళాసీపాళ్య ఠాణకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి ప్రత్యేక బృందం కదలివచ్చి రక్షిత్‌ను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.

kannada tv artist Mahesh arrest for Drunk Driving

అక్కడా ఆయన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారని అధికారులు చెప్పారు. మూడుగంటల పాటు అక్కడే ఉంచాక ఆల్కో మీటరు పరీక్ష చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీపై ఇంటికి పంపించారు. ఉదయం 11 గంటలకు మళ్లీ పోలీస్ స్టేషన్ కు చేరుకుని విచారణకు సహకరించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని నటుడు రక్షిత్‌ స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

English summary
Rakshith, who acts in Puttagowri Maduve, a Kannada serial arresed.The actor who drove the car in an inebriated state and later abused the police for stopping his car was detained by Kalasipalya police.
Please Wait while comments are loading...