స్టార్ హీరోలు సైతం షాక్: టీవీ కెమెడియన్ లగ్జరీ వానిటీ వ్యాన్..... (ఫోటోస్)
టీవీ కార్యక్రమాలు హోస్ట్ చేసే కమెడియన్ కపిల్ శర్మ హిందీలో ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన కామెడీ షోల ద్వారా కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు కపిల్. మరి ఆ స్థాయి సంపాదన ఉన్నపుడు లగ్జరీ సదుపాయాలు సమకూర్చుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు. తాజాగా కపిల్ శర్మ విలాసవంతమైన కొత్త వానిటీ వ్యాన్(కారావ్యాన్) డిజైన్ చేయించుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

5 స్టార్ హోటల్‌ను తలపించే సదుపాయాలు
టీవీ షోలు, ఇతర కార్యక్రమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపే కపిల్ శర్మ..... షూటింగ్ గ్యాపులో రిలాక్స్ అయ్యేందుకు విలాసవంతమైన వానిటీ వ్యాన్ డిజైన్ చేయించుకున్నాడు. ఇందులో ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలపించేలా సదుపాయాలు ఉన్నాయి.

లగ్జరీ సదుపాయాలు
ఈ వానిటీ వ్యాన్‌లో ఎసీ, వైఫై, 70 ఇంచెస్ స్మార్ట్ 3డి టీవీ, ఎల్ఈడీ లైటింగ్, ఆటోమేటిక్ డోర్ లాక్స్, విశాలమైన బెడ్రూం, లాబీ. రిక్లైనర్ చెయిర్స్ లాంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. ఈ వానిటీ వ్యాన్ లోపలి ఇంటీరియర్ డిజైనింగ్ కూడా సూపర్బ్‌గా ఉంది. వ్యాన్ వెలుపలి వైపు కపిల్ శర్మ అనే పేరు కూడా రాసి ఉంది.

డిజైన్ చేసింది ఎవరంటే...
ఈ వానిటీ వ్యాన్ రూపకర్త దిలీప్ చాబ్రియా. డిసి డిజైన్ పేరుతో ఓ సంస్థను రన్ చేస్తున్న దిలీప్ చాబ్రియా సినీతారలు, పొలిటీషియన్ల కోసం ఇలా కస్టమ్ మేడ్ వెహికిల్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. తనకోసం ఇంత అద్భుతమైన వానిటీ వ్యాన్ డిజైన్ చేసినందుకు థాంక్స్ చెబుతూ కపిల్ శర్మ ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు.

ఖరీదు ఎంత?
అయితే ఈ వ్యానిటీ వ్యాన్ ఖరీదు ఎంత? అనే విషయమై మాత్రం కపిల్ శర్మ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు బాలీవుడ్లో షారుక్ ఖాన్‌కు అత్యంత ఖరీదైన రూ. 4 కోట్ల విలువ చేసే వానిటీ వ్యాన్ ఉంది. కపిల్ శర్మ వానిటీ వ్యాన్ ఖర్చు కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని అంటున్నారు.

స్టార్ హీరోలు సైతం ఈర్షపడేలా
బాలీవుడ్ బడా బడా స్టార్ హీరోలు సైతం ఈర్షపడేలా ఈ వానిటీ వ్యాన్ ఉంది. ఒక టీవీ యాక్టర్....... బాలీవుడ్ స్టార్ హీరో స్థాయిలో సంపాదించడం, లగ్జరీ సదుపాయాలు కల్పించుకోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.


Click it and Unblock the Notifications











