»   » కెరీర్ నాశనమైంది, మళ్లీ తేరుకుని కమెడియన్ రీ ఎంట్రీ, ప్రియురాలితో పెళ్లి కూడా!

కెరీర్ నాశనమైంది, మళ్లీ తేరుకుని కమెడియన్ రీ ఎంట్రీ, ప్రియురాలితో పెళ్లి కూడా!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  కపిల్ శర్మ... ఒకప్పుడు హిందీ టెలివిజన్ రంగంలో తిరుగులేని కమెడియన్. తన షోలతో కొన్నేళ్ల పాటు హిందీ టెలివిజన్ రంగంలో హవా కొనసాగించిన ఈ కమెడియన్ పలు వివాదాల కారణంగా చివరకు కెరీర్ నాశనం చేసుకున్నాడు. ప్రస్తుతం అన్ని వదిలేసి డిప్రెషన్ నుండి బయటపడే ప్రయత్నంలో ఉన్న కపిల్... త్వరలో న్యూ కామెడీ షో ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సోనీ ఎంటర్టెన్మెంట్ టెలివిజన్లో దిపావళి నుండి కపిల్ కామెడీ షో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. మరో విశేషం ఏమిటంటే ఈ షో ప్రారంభమైన నెల వ్యవధిలో కపిల్ తన గర్ల్ ఫ్రెండ్ గిన్ని ఛాత్రత్‌ను పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

  హద్దులు మీరాడు, అందరూ ఆ కమెడియన్‌ను దూరం పెట్టారా?... షాకింగ్ లుక్!

  గిన్నితో గతేడాది ఎంగేజ్మెంట్

  గిన్నితో తన ఎంగేజ్మెంట్ జరిగినట్లు 2017 మార్చిలోనే కపిల్ శర్మ అఫీషియల్ గా ప్రకటించారు. ‘ఆమె నాలో సగం అని చెప్పను... అందుకంటే నాలో పూర్తిగా ఆమెనె ఉంటుంది. నువ్వు నా జీవితంలోకి వస్తున్నందుకు ఆనందంగా' ఉంది అంటూ ట్వీట్ చేశాడు.

  డిసెంబర్లో వివాహం

  డిసెంబర్లో వివాహం

  ఈ ఇద్దరి వివాహం ఈ ఏడాది డిసెంబర్లో జరుగబోతున్నట్లు తెలుస్తోంది. పంజాబీ సాంప్రదాయంలో ఆర్భాటంగా వీరి పెళ్లి జరుగబోతోందని, కపిల్ హోమ్ టౌన్ అమృత్‌సర్‌లో ఈ వేడుక జరుగబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

  తిరిగి రీ ఎంట్రీ

  తిరిగి రీ ఎంట్రీ

  ఒకప్పుడు హిందీ టెలివిజన్ రంగంలో తిరుగులేని కమెడియన్‌గా ఉన్న కపిల్.... తన తోటి కమెడియన్ సునీల్ గ్రోవర్‌తో వివాదాలు, వరుసగా షోలు రద్దు చేసుకోవడం లాంటి పరిణామాలతో కెరీర్ నాశనం చేసుకున్నాడు. ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్లి మద్యానికి బానిసయ్యాడు. డిప్రెషన్ నుండి కోలుకున్న కపిల్ శర్మ తిరిగి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.

  సునీల్ గ్రోవర్ కూడా

  త్వరలో సోనీ ఎంటర్టెన్మెంట్ ఛానల్‌లో ప్రసారం అయ్యే తన కొత్త కామెడీ షోలో.... కపిల్, సునీల్ గ్రోవర్ కలిసి కనిపించబోతున్నారట. ఇద్దరి మధ్య రాజీ కుదరిందని, వివాదాలు సమసిపోయాయని తెలుస్తోంది. తన కొత్త షో గురించి కపిల్ శర్మ ట్విట్టర్ ద్వారా ఖరారు చేశారు.

  English summary
  Controversial comedian Kapil Sharma is all set for a comeback to television in a new comedy show on Sony Entertainment Television that will premiere around Diwali in November. Kapil tweeted about his new show, "Jalad wapas aa raha hoon 'The Kapil Sharma Show' lekar aap ke liye sirf SonyTV par. TataSky subscribers Sony TV ka mazza without any additional cost lijiye, Abhi call kariye 18002086633 or email contacttatasky.com"
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more