For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కరాటే కళ్యాణికి ఒరిస్సా ఎంపీ ఫోన్.. విజయశాంతి దగ్గర నెంబర్ తీసుకుని మరీ...ఎందుకో స్పెషల్ ఇంట్రెస్ట్!

  |

  తెలుగు రాష్ట్రాల్లో కరాటే కళ్యాణి అంటూ తెలియనివారుండరు. సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రల్లో ఫేమస్ అయిన కరాటే కళ్యాణి బయట మాత్రం చాలా రెబల్ గా వ్యవహరిస్తుంటారు.. నిజానికి ఆవిడ పేరు పడాల కళ్యాణి కాగా కరాటేలో శిక్షణ తీసుకున్న కారణంగా ఆమెకు కరాటే కల్యాణి అనే పేరు ఏర్పడింది. తాజాగా ఆమెకు ఒక ఒరిస్సా ఎంపీ వరుసగా ఫోన్లు చేయడం కలకలం రేపింది దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

   బహుముఖ ప్రజ్ఞాశాలి

  బహుముఖ ప్రజ్ఞాశాలి

  తెలుగు సినిమా లో పలు రకాల పాత్రలు పోషిస్తూ దాదాపు ఆమె 120కి పైగా సినిమాల్లో నటించింది. స్వతహాగా హరికథా కళాకారిణి అయిన ఆమె పాటలు కూడా పడుతుంది. మరోపక్క కరాటేలో నైపుణ్యం సంపాదించిన ఆమెకు బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. అలాగే సుదీర్ఘకాలంపాటు హరికథ చెప్పినందుకు గాను ఆమె పేరిట లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా రికార్డు నమోదు అయింది

   ఆ సినిమాల్లో గుర్తుండే పాత్రలు

  ఆ సినిమాల్లో గుర్తుండే పాత్రలు

  తెలుగులో చత్రపతి, కృష్ణ, మిరపకాయ్, బ్లేడ్ బాబ్జి, గోదావరి, శంకర్ దాదా ఎంబిబిఎస్, గుంటూరు టాకీస్, అదిరిందయ్యా చంద్రం లాంటి సినిమాల్లో ఆమెకు గుర్తుండిపోయే పాత్రలు దక్కాయి. ఇక సినిమాల్లో కాస్త ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో ఆవిడ టీవీ సీరియల్స్ కూడా చేస్తోంది. జీ తెలుగులో ప్రసారం అయిన కొన్ని సీరియల్స్ లో ఆమె నటించింది.

   బిగ్ బాస్ ఎంట్రీ - ఎగ్జిట్

  బిగ్ బాస్ ఎంట్రీ - ఎగ్జిట్

  ఇక తెలుగు లో పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా ఆమె ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. అయితే సీజన్ ఫోర్ లో కరాటే కళ్యాణి ఎంటర్ అయిన కొద్దిరోజులకే బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఆమెకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించని కారణంగా హౌస్ లోకి ఎంటరయిన కొన్నాళ్ళకి ఎగ్జిట్ ఇవ్వాల్సి వచ్చింది.. సాధారణంగా అన్ని విషయాల్లోనూ ఖరాఖండిగా ఉండే కరాటే కళ్యాణి తాజాగా ఒక అంశంలో సంచలన విషయాలు వెల్లడించింది.

   ఎంపీ నుంచి ఫోన్

  ఎంపీ నుంచి ఫోన్

  నిన్న తనకు కాల్ వచ్చిందని, ఎవరో ఒరిస్సా ఎంపీ అని నాకు కాల్ చేసి మీరు చేసిన సేవ బాగుంది నేను 3 సార్లు ఎంపీని మా ఓరిసా నుండి మీకు ఏదైనా సహాయం కావాలా అని అడిగారని పేర్కొంది. ''కోట్లు ఇస్తాడట నేనే దొరికేనా రా..గొంతు మార్చి ఒకడే మాట్లాడుతున్నాడు..నా దగ్గర నీ పప్పులు ఉడకవు నేను చెప్పా చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి మీ పేరు మీద ఇచ్చేయండి''....అని ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. ఆ ఎంపీ నా ఎఫ్బీ కూడా చూస్తున్నాడని పేర్కొన్న ఆమె చివరాఖరికి నాకు ఒక 10 సార్లు కాల్ చేసి విసింగించి మీకు పెళ్లి అయ్యిందా అన్నాడని, నాకు విషయం అర్థం అయిందని కల్యాణి పేర్కొంది.

  Recommended Video

  Actor Nani's Golden Heart | సార్.. క్షమించండి అంటూ..!!

  విజయశాంతి గారిని కూడా

  నా నంబర్ కోసం విజయశాంతి గారిని అలాగే డీకే అరుణ గారిని కూడా అడిగాడు అంట..ఎందుకో స్పెషల్ ఇంట్రెస్ట్....నేను బీజేపీలో ఏదో పదవి ఉంది అనుకున్న మీకు అని మాట కలిపాడని ఆమె పేర్కొంది. ఇక తాను ఏ పార్టీలో లేను అని చెప్పి పెట్టేశా అని, ఇలాంటి వాళ్ళు పొంచి ఉంటారు..తస్మాత్ జాగ్రత్త అని ఆమె పేర్కొంది. నేను కావాలని..మాట్లాడలేదు బిజీగా ఉన్నా అంటే కూడా వాడు పని మానుకొని మరి నాతో అన్నిసార్లు కాల్ చేస్తాడా ? పిచ్చి ఎంపీ, వేరేలా ట్రై చెయ్యి, బ్యాండ్ బాజా బారాత్. అయిపోగలదని ఆమె హెచ్చరించింది. ఫేస్ బుక్ వల్ల చాలా అనుభవాలు అయ్యాయని ఎవరినీ నమ్మకండి అని ఆమె పేర్కొంది.

  English summary
  Well known tollywood actress karate Kalyani made some sensational allegations on Orissa MP. Really good that MP tried to talk with her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X