‘నాగార్జున గారు మీ పరువు తీసుకోకండి.. బిగ్‌బాస్‌లో అలాంటి పిచ్చి పనులా?’
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 9వ సీజన్‌పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆట తీరును, కంటెస్టెంట్ల ఎంపికపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా దివ్వెల మాధురి, రీతూ చౌదరీ లాంటి కంటెస్టెంట్ల ఎంపికపై అనేక ఆరోపణలు వచ్చాయి. అలాంటి వారిని తీసుకోవడం వల్ల రియాలిటీ షో పాపులారిటీ తగ్గిపోతున్నదనే విమర్శలు వెల్లువెత్తాయి. కొందరైతే కంటెస్టెంట్లపై అసంతృప్తి వెళ్లగక్కుతూ పోలీస్ కేసులు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో సినీ నటి, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
గతంలో తాను బిగ్‌బాస్ తెలుగు షోలో ఉన్నప్పుడు తనతో దారుణంగా ప్రవర్తించారు. ఓ సమయంలో బంగాళదుంప కూర వేయలేదని నన్ను జీరో అన్నారు. నన్ను నామినేట్ చేసి ఇంటి నుంచి ఎలిమినేట్ చేశారు. అలాంటి విచిత్రమైన కారణాలతో ఆటను దిగజార్చారు. కరోనా సమయంలో ఇంటిలో ఉండటం కూడా కొంత ఆందోళన చోటు చేసుకొన్నది. ఆ సమయంలో 16 రోజులు ఇంట్లో ఉండటం కష్టంగా అనిపించింది అని కళ్యాణి తన అనుభవాలను పంచుకొన్నారు.

నేను ఉన్న బిగ్‌బాస్ తెలుగు సీజన్‌లో కొందరు బాగా ఆడుతున్నారు. కానీ ఇంటిలో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయమే తనకు అర్ధం కావడం లేదు. వారి ఆట తీరు కూడా బాగా లేదు. ఆ సీజన్‌లో అక్కడ బాగా ఎంటర్‌టైన్ చేసింది కూడా తానే. ఎలిమినేషన్ తర్వాత ఓటింగ్ చూపించమని అడిగితే.. చూపించలేదు. అలా నవ్వేసి ఊరుకొన్నారు. ఆ తర్వాత మళ్లీ పిలుస్తారేమో అని వేచి చూశాను. కానీ నాకు ఆహ్వానం అందలేదు. ఆ తర్వాత కొన్ని సీజన్లు జరిగినా తనకు ఆహ్వానం రాలేదు అని కల్యాణి అన్నారు.
బిగ్‌బాస్ రియాలిటీ షో మీద నాకు మంచి అభిప్రాయమే ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న తీరు చూస్తే.. ఆ హైప్ తగ్గిపోతున్నది. కామన్ మ్యాన్‌ను తీసుకోవడం మంచిదే కానీ... టాలెంట్ ఉన్న వారిని తీసుకొంటే బాగుండేది. ప్రతిభ ఉన్న వారిని తీసుకొంటే బాగుండేది. సంజన లాంటి వారిని తీసుకోవడం బాగుంది. కష్టాల్లో ఉన్న వారిని గుర్తించి వారిని షోలో అవకాశం కల్పిస్తే బాగుండేది. ముఖ్యంగా తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వాలి అని కరాటే కళ్యాణి అభిప్రాయపడ్డారు.

అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరో హోస్ట్ చేస్తున్నప్పుడు.. ఒక జంట కోసం ఓ పాట వేసి వారితో డ్యాన్సులు చేయించడం దిగజారుడుతనంగా అనిపించింది. నేను తట్టుకోలేకపోయాను. మీరు పేరు, ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉంది. అలాంటి వాటిని పునరావృతం చేయకూడదు. పిచ్చి పిచ్చి వాటిని పెడితే.. షోకి పరువు పోతుంది అని ఆమె సలహా ఇచ్చారు. మాధురి, దువ్వాడ శ్రీనివాస్ జంట గురించి ఆమె పరోక్షంగా విమర్శలు చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











