Karthika Deepam 2 October 1st: జ్యోత్స్న ముఖాన 10 కోట్లు కొట్టిన శ్రీధర్.. కార్తీక్ చేతుల్లోనే నిర్ణయం
కళ్లు తిరిగి పడిపోయిన దీపకు భోజనం పెడుతుంది సుమిత్ర. నీకు ప్లేట్‌లో భోజనం పెట్టేంత మానవత్వం నాకు ఉంది కానీ, నా చేత్తో తినిపించేంత ప్రేమ లేదని అంటుంది సుమిత్ర. ఒకప్పుడు దీపలో ప్రేమ, మానవత్వం ఉండేవని.. కానీ ఇప్పుడు స్వార్ధం వచ్చిందని, ఉప్పు తిన్న విశ్వాసం లేదని నానామాటలు అంటుంది. సుమిత్ర మాటలతో దీప కంటతడి పెడుతుంది. మీరు నన్ను కొట్టినా ఇంతలా బాధపడేదానిని కాదని, కానీ కత్తుల్లాంటి మాటలతో చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
దీపకు ఎక్కిళ్లు రావడంతో సుమిత్ర స్వయంగా మంచినీళ్లు తీసుకొచ్చి తాగిస్తుంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్, జ్యోత్స్న, పారులు వీరిద్దరినీ చూసి షాక్ అవుతారు. మీ అమ్మ నువ్వు కలిసిపోయినట్లుగా ఉన్నారుగా.. మీ అమ్మ తిట్టి మరి నీకు భోజనం పెట్టింది, నా మాట వినవని కార్తీక్ అంటాడు. సుమిత్ర, దీపలు దగ్గరవుతుండటంతో వారిని ఎలాగైనా విడదీయాలని పారు, జ్యోత్స్నలు ప్లాన్ చేస్తారు. కాంచన ఇంటికి సరుకులతో పాటు డబ్బులు తీసుకెళ్లి ఇస్తాడు శ్రీధర్. అవేవీ నాకేమీ వద్దని వెళ్లిపొమ్మని మండిపడుతుంది కాంచన. సరుకులు వద్దు కానీ కనీసం డబ్బుల్ని చేబదులుగా ఇచ్చాననుకుని, తర్వాత తనకు ఇవ్వమంటాడు శ్రీధర్. దాంతో కాంచన ఆలోచనలో పడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. మరి అక్టోబర్ 1వ తేదీ 477వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో శ్రీధర్ ఉండటంతో కొడుక్కి కనిపించకుండా భర్త ఇచ్చిన డబ్బును చీర కొంగులో దాచేస్తుంది కాంచన. సరుకులు రేపు తీసుకొస్తానని చెప్పాను కదా పెద్దమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టావని అడుగుతాడు కార్తీక్. ఈ సరుకులు నేను తీసుకురాలేదని, మీ నాన్నగారు తీసుకొచ్చారని చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. మీ ఇంటికి తీసుకెళ్లాల్సిన సరుకులు పొరపాటున మా ఇంటికి వచ్చాయని తీసుకెళ్లి కారులో పెట్టేద్దామని అనసూయని సాయం పట్టామని అంటాడు కార్తీక్. దాంతో శ్రీధర్ తన కొడుకుని అడ్డుకుని, మీ ఇంట్లో పెళ్లిళ్లు జరగడానికి, పూజలు జరగడానికి నాన్న కావాలి? ఇంటికి సరుకులు తీసుకురావడానికి నాన్న అక్కర్లేదా? అని శ్రీధర్ ప్రశ్నిస్తాడు.
కానీ అవసరాలకు బాధ్యతలకు తేడా తెలుసుకోవాలి.. నా తండ్రిగా నా పక్కన నిలబడితే అది బాధ్యత తీర్చడం అవుతుందని, నా కంచంలో భోజనంలా నిలబడితే అది నా అవసరాన్ని తీర్చడం అవుతుందని అంటాడు కార్తీక్. అవసరం తీర్చాల్సింది తండ్రేనని, కానీ నిన్ను బాధ్యత వరకే పరిమితం చేశానని, అవసరం తీర్చడం నా బాధ్యత అని మీ సరుకులు మీరే తీసుకెళ్లండి అని చెబుతాడు. దీనికి ఇంత కోప్పడితే డబ్బులు ఇచ్చాడని తెలిస్తే ఇంకెంత కోప్పడతాడోనని కాంచన వణికిపోతుంది. ఈ సరుకులు కారులో పెట్టావంటే మరోసారి నేను నీ ఇంటికి రానని శ్రీధర్ వార్నింగ్ ఇస్తాడు. మీరు మా కోసం ఏమైనా చేయొచ్చు, మేం మీ కోసం ఏం చేయకూడదా? అని మండిపడతాడు.
నా పిల్లల కోసం నేనేం చేయలేకపోతున్నానని, ఓ తండ్రిగా బాధపడతానని, మీ తాత ఇంట్లో నువ్వు డ్రైవర్‌గా పనిచేయడం నాకిష్టం లేదని.. కానీ ఏం చేయాలో నాకు అర్ధం కావడం లేదని చెబుతాడు శ్రీధర్. ఇటు కొడుకు, కూతురి జీవితాలు అలాగే ఉన్నాయని.. కొడుకు డ్రైవర్‌గా పనిచేయడం ఏ కోటీశ్వరుడికి ఇష్టం ఉండదని అంటాడు. సరుకులు ఇక్కడే ఉంచమని కార్తీక్ చెప్పడంతో శ్రీధర్ శాంతిస్తాడు. దీపకి ఎలా ఉందని అడగ్గా.. మీ ఎదురుగానే ఉంది కదా? మీరే అడగండని కార్తీక్ చెబుతాడు. దీపకి ఏమైందని కాంచన టెన్షన్ పడటంతో కార్తీక్ జరిగింది చెబుతాడు.
నేను రాత్రే చెప్పానని.. ఇప్పుడైనా ఏమైనా తినిందా? లేదా? అని అనసూయ అడగ్గా.. సుమిత్ర అత్త భోజనం పెట్టిందని చెబుతాడు కార్తీక్. ఆ మాటలు విన్న కాంచన షాక్ అవుతుంది. దీపని అత్తయ్య క్షమించలేదు.. నువ్వు మా ఇంట్లో పడిపోతే చెడ్డ పేరు మాకు, నేనే ఏదో చేశానని అనుకుంటారని భోజనంతో పాటు నాలుగు తిట్లు కూడా పెట్టిందని చెబుతాడు కార్తీక్. తమరు ఉదయం ఇంట్లో నాలుగు దోశలు తినుంటే అక్కడ తిట్లు తినాల్సిన అవసరం ఉండేది కాదని దీప మీద కోప్పడతాడు కార్తీక్. మరోసారి మీరు సరుకులు తీసుకొస్తే నేనే తీసుకొచ్చి మీ ఇంట్లో డెలివరీ ఇస్తానని శ్రీధర్‌పై మండిపడతాడు. శ్రీధర్ వెళ్లిపోయిన తర్వాత భర్త ఇచ్చిన డబ్బుల గురించి కార్తీక్‌కి చెప్పాలా? వద్దా? అని టెన్షన్ పడుతుంది కాంచన.
భోజనం చేద్దామని జ్యోత్స్న సుమిత్రని అడగ్గా.. నాకు ఆకలిగా లేదని మీరు తినండని చెబుతుంది సుమిత్ర. మీ నాన్న తినకుండా మీ అమ్మ తినదని పారు చెప్పడంతో సుమిత్ర షాక్ అవుతుంది. దాంతో జ్యోత్స్న వెళ్లి భోజనం చేయడానికి దశరథ్‌ని పిలుస్తుంది. నేను తర్వాత తింటాను, మీరు తినమని వెళ్లిపోతాడు దశరథ్. నువ్వు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయొచ్చు కదా అని దశరథ్‌ను అడగ్గా.. జ్యోత్స్నపై తండ్రి కోప్పడతాడు. ఈ రోజు దీప కళ్లు తిరిగి పడిపోతే ఆ టైంలో మమ్మీ మాత్రమే ఇంట్లో ఉందని, పోతేపోనీ అని దీపని మమ్మీ వదిలేయొచ్చు కానీ వదల్లేదు, కూర్చోబెట్టి సేవలు చేసిందని తండ్రికి చెబుతుంది జ్యోత్స్న.
దీప నిజం ఒప్పుకుంటే మమ్మీ క్షమించడానికి సిద్ధంగా ఉందని, కానీ దీప సిద్ధంగా లేదని చెబుతుంది జ్యోత్స్న. కానీ మీరు మా మమ్మీని దూరం పెట్టారని, ఆవిడతో భోజనం చేయడం, మాట్లాడటం కూడా మీకు నచ్చదని మండిపడుతుంది. ఒక మనిషి ఒక తప్పు చేసినప్పుడు దానిని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని, ఆ అవకాశం దొరికినప్పుడు మరో తప్పు చేస్తే ఆ కోపం ఎలా పోతుందని ప్రశ్నిస్తాడు దశరథ్. మీ అమ్మనాన్నల మధ్య దూరం మరింత పెంచొద్దని జ్యోత్స్నకి శివన్నారాయణ వార్నింగ్ ఇచ్చి కొడుకుని భోజనానికి తీసుకెళ్తాడు.
నిద్రపట్టక అటు ఇటూ తిరుగుతున్న శ్రీధర్‌ని ఏం జరిగిందని కావేరి అడుగుతుంది. సుమిత్ర వదిన క్షమించి ఉంటే అందరం ఒక్కటే అయిపోయేవాళ్లమని అంటుంది కావేరి. నా కొడుకుని ఓ పనివాడిలా చూడలేకపోతున్నానని, వాడొక సామాన్యుడిలా బతుకుతుంటే ప్రశాంతంగా పడుకోలేకపోతున్నానని అంటాడు శ్రీధర్. కానీ ఏదో ఒకటి చేస్తానని చెబుతాడు. ఉదయాన్నే శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు శ్రీధర్. జ్యోత్స్నతో ఏదో మాట్లాడాలని పిలుస్తాడు. నా కొడుకు డ్రైవర్‌గా పనిచేయడం నాకిష్టం లేదు, నువ్వు వాడితో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నావట అని అడుగుతాడు. మీరిద్దరి మధ్య ఏం కండీషన్లు పెట్టుకున్నారో, ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు.. నా కొడుకుని విడిపించుకోవడానికి నేనేం చేయాలని ప్రశ్నిస్తాడు శ్రీధర్.
ఆరు నెలల కిందట కూడా కార్తీక్ నీ కొడుకే కదా? అప్పుడెందుకు పట్టించుకోలేదని పారిజాతం నిలదీస్తుంది. జ్యోత్స్న, శ్రీధర్‌లు తేల్చుకుంటారు నువ్వు మధ్యలోకి రావొద్దని పారుకు వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్ధితులు వస్తే 10 కోట్లు జరిమానా కట్టాలని అంటుంది జ్యోత్స్న. అయితే నేను పది కోట్లు కడతానని చెక్ రాసి ఇచ్చేస్తాడు శ్రీధర్. అతని నిర్ణయంతో అందరూ షాక్ అవుతారు. కొడుకు కోసం పది కోట్లు ఇస్తావా? అని పారు అడగ్గా.. నా కొడుకు కోసం నాకున్న ఆస్తి మొత్తం రాసిస్తానని చెబుతాడు శ్రీధర్. ఈ చెక్ తీసుకుని అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని జ్యోత్స్నతో చెబుతాడు.
అగ్రిమెంట్ ఇవ్వాల్సింది బావ అని.. ఆయనకు అభ్యంతరం లేకపోతే, నాకు కూడా అభ్యంతరం లేదని తేల్చేస్తుంది జ్యోత్స్న. ఇంతలో కార్తీక్, దీపలు వచ్చి శ్రీధర్‌ను శివన్నారాయణ ఇంట్లో చూసి షాక్ అవుతారు. మీ నాన్నని ముందు పంపి నువ్వు వెనక రావడం ఎందుకు? నీ కొడుకు జగన్నాటక సూత్రధారి అని సెటైర్లు వేస్తుంది పారిజాతం. మా నాన్న ఎందుకొచ్చాడో నాకు తెలియదని కార్తీక్ చెప్పగా.. వాడికి ఇలాంటి అవకాశాలు ఎన్నో వచ్చాయని, కానీ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయొచ్చని అడగొచ్చని కానీ వాడు అడగలేదని అంటాడు దశరథ.
మావయ్య అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయించడానికి వచ్చాడని జ్యోత్స్న చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ప్రతిసారి అగ్రిమెంట్ అనేది నీ నిర్ణయం దగ్గరే ఆగిపోతూ వచ్చిందని, ఈసారి సరైన నిర్ణయం తీసుకుంటావని అనుకుంటున్నానని అంటాడు దశరథ. నిన్ను అగ్రిమెంట్ నుంచి రిలీవ్ చేయడానికి మీ నాన్న జ్యోత్స్నకి 10 కోట్ల చెక్ ఇచ్చాడని చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. నా నిర్ణయమే నీ నిర్ణయం ఫైనల్ అని చెప్పమని కొడుకుతో అంటాడు శ్రీధర్. ఇన్నిరోజుల నుంచి నీ భార్య, నీ తల్లి, నేను ఈ విషయం గురించి బాధపడుతున్నామని చెబుతాడు శ్రీధర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications









