Karthika Deepam 2 October 15th: సుమిత్ర కోసం దశరథ కంటతడి... జ్యోత్స్నని ఇరికించేసిన పారు
Photo Courtesy: JioHotstar
సుమిత్ర - దశరథలను కలపాలని జ్యోత్స్న నానా రాద్ధాంతం చేస్తుంది. కార్తీక్ ఎంత చెబుతున్నా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వాగేస్తుంది. నువ్వు నీ పని చూసుకుంటే మంచిది, ఇది మా ఫ్యామిలీ మేటర్ అని జ్యోత్స్న నోరు జారడంతో కార్తీక్ నా మనవడు, నా కూతురి కొడుకని శివన్నారాయణ సీరియస్ అవుతాడు. ఆ దీప చేసిన తప్పుకి మా అమ్మని ఎందుకు శిక్షిస్తున్నావని దశరథను నిలదీస్తుంది జ్యోత్స్న. మీ అమ్మ తప్పు చేసిందని అసలు ఇలాంటి వ్యక్తికి భర్తగా ఉన్నందుకు ఎందుకు బతికి ఉన్నానా? అనిపిస్తోందని దశరథ అనడంతో అందరూ షాక్ అవుతారు. కొడుకు, కోడలి మధ్య గొడవతో శివన్నారాయణ కుప్పకూలిపోతాడు.
శివన్నారాయణ గారింట్లో జరిగినదంతా దీపకు చెబుతాడు కార్తీక్. నువ్వు తప్పు చేశావని జ్యోత్స్నను పారిజాతం కోప్పడుతుంది. ఇప్పుడు అమ్మ మీదున్న సానుభూతే నా సీఈవో పోస్ట్‌ని కాపాడుతుందని అంటుంది జ్యోత్స్న. తాను ఇంట్లో లేకపోతేనే తన భర్త హాయిగా ఉంటాడని బాధపడిన సుమిత్ర ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు జ్యోత్స్న ఆమెను చూసినా పారు దగ్గర సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 15వ తేదీ 489వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నువ్వు త్వరలోనే ప్రెగ్నెంట్ కావాలని దీపతో చెబుతుంది అనసూయ. ముత్యాలమ్మ అమ్మవారి దగ్గర కోరుకున్నానని.. నా మనవరాలు అని చెప్పుకోవడానికి నా చెల్లెమ్మకు ఓ మనవరాలు కావాలని అంటుంది అనసూయ. అలాగే నా సొంత కూతురు అని చెప్పుకోవడానికి కార్తీక్ బాబుకి ఓ కూతురు కావాలని, కలిసి ఆడుకోవడానికి శౌర్యకి ఓ చెల్లెలో, తమ్ముడో కావాలని అంటుంది. కార్తీక్ బాబుకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం కదా అందుకే అలా అన్నానని చెబుతుంది. మా కోరిక తీరుతుందని మేం ఆశపడొచ్చు అనుకుంటే ఈ బొమ్మ తీసుకొమ్మని చెబుతుంది అనసూయ. కార్తీక్ బాబు శౌర్యకు మాత్రమే తండ్రా? నీకు భర్త కాదా అని నిలదీస్తుంది అనసూయ.
మీ ఆశలు నిజమవుతాయని బొమ్మని తీసుకుంటూ దీప చెప్పడంతో కాంచన, అనసూయలు సంతోషిస్తారు. బావ, నేను శౌర్యకి అమ్మానాన్నలం మాత్రమే కాదు.. భార్యాభర్తలం కూడా అని చెబుతుంది. అమ్మవారి ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదం, మీ అందరి దీవెనలు కలిసి మీరు అనుకున్నది నిజం అవుతుందని అంటుంది దీప. దాంతో కార్తీక్ చాలా సంతోషిస్తారు. బయటికి రాగానే ఏంటీ ముఖంలో సిగ్గు కనిపిస్తోందని దీపను ఆటపట్టిస్తాడు కార్తీక్. పెద్దమ్మ ఇచ్చిన బొమ్మను మా అమ్మకి ఇచ్చినట్లున్నావుగా... వాళ్ల ఆనందాన్నికూడా చూశానని అంటాడు. ఈ మధ్య శౌర్యని మన మధ్యన కాకుండా వాళ్ల దగ్గర పడుకోబెట్టుకున్నప్పుడే వాళ్ల ఆలోచనలు అర్ధమయ్యాయని చెబుతాడు.
వాళ్ల ఆశలు మనం తీర్చకపోతే ఎవరు తీరుస్తారని దీప అనడంతో ఇప్పుడు నాకు సిగ్గేస్తుందని అంటాడు కార్తీక్. సిగ్గుపడింది చాలు? ముందు సలహా చెప్పమని అంటుంది దీప. అమ్మనాన్నలు మాట్లాడటం మానేసి నెలరోజులు అవుతోందని, కలిపేద్దామని అనుకోవడమే కానీ ప్రయత్నం చేశావా? అని నిలదీస్తుంది దీప. నేను ట్రై చేసిన తర్వాత వాళ్లిద్దరి మధ్య ఇంత దూరం పెరిగిందని అంటుంది. ఆ దూరాన్ని జ్యోత్స్న మరింత పెంచిందని, ఆ దూరాన్ని నా తల్లి భరించగలుగుతుందేమో కానీ, నేను భరించలేనని చెబుతుంది దీప. నిన్న గొడవ జరగడంతో అత్తయ్య, మావయ్యల ముఖాలు చూడాలంటే గిల్టిగా ఉందని అంటాడు కార్తీక్. ఈసారి అత్తయ్యని, మావయ్యని కాకుండా తాతని టార్గెట్ చేద్దామని, ఆయనతో మాట్లాడదామని అంటాడు. మన ముగ్గురం కలిసి మీ అమ్మనాన్నలని కలుపుదామని చెబుతాడు.
ఉదయాన్నే చెప్పకుండా ఇంటర్వ్యూకి వెళ్తాడు కాశీ. దాంతో అల్లుడు గురించి శ్రీధర్ టెన్షన్ పడతాడు. నీకు ఈరోజు ఈవెనింగ్ వరకు టైం ఉందని, అప్పటికీ నేను ఆశించినట్లు జరగకపోతే నేను నిన్ను ఆఫీసుకి తీసుకెళ్తానని అంటాడు శ్రీధర్. దాంతో అపాయింట్‌మెంట్ లెటర్ తీసి చూపిస్తాడు కాశీ. ఆ మాటలతో షాకైన శ్రీధర్, స్వప్నలు... అదరగొట్టేశావని మెచ్చుకుంటారు. అల్లుడుగారు ఇంత టాలెంట్ అని నాకు తెలుసు కాబట్టే ఆయనని బిజినెస్ గురించి ఇబ్బంది పెట్టొద్దని చెప్పానని కావేరి అంటుంది. నా అల్లుడు జేమ్ అని నాక్కూడా తెలుసనని, మరోసారి ప్రూవ్ చేసుకున్నాడని అంటాడు శ్రీధర్. జాబ్ సంపాదించకపోతే ఇష్టానికి విలువ ఉండదన్న మాట అంటూ కాశీ సీరియస్ అవుతాడు.
నా కెపాసిటి, నా కెపాబులిటీ నాలో ఎప్పుడూ ఉన్నాయి... ఇప్పుడు జాబ్ వచ్చింది కాబట్టి మీకు ఇప్పుడు గుర్తొచ్చాయని అంటాడు కాశీ. మార్నింగ్ వెళ్లెటప్పుడు కూడా జీడిపప్పు ఉప్మా టేబుల్ మీదే ఉందని కానీ స్వప్నకి ఇప్పుడే పెట్టాలనిపించిందని చెబుతాడు. ఇప్పుడు మీ ముగ్గురిలో కనిపించిన ప్రేమ ఇంతకుముందు కనిపించలేదని అంటాడు కాశీ. నా మాటలకు ఎవరైనా బాధపడితే క్షమించాలని, అయినా నేను టిఫిన్ బయటే చేసొచ్చానని అంటాడు. మన ఆనందాన్ని పంచుకోవడానికి వంద మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు.. కానీ మన బాధను పంచుకోవడానికి మనవాళ్లు మాత్రమే ఉంటారని అల్లుడు తన బాధను చెప్పుకున్నాడని చెబుతాడు శ్రీధర్. నువ్వెళ్లి అల్లుడికి కాఫీ ఇచ్చి మాట్లాడు, మామూలుగా మాట్లాడతాడని స్వప్నతో అంటాడు. అల్లుడు ప్రాబ్లమ్ క్లియర్ అయ్యింది.. ఇక కొడుకు ప్రాబ్లమే ఉందని అనుకుంటాడు శ్రీధర్.
శివన్నారాయణ గారింటికి దీప, కార్తీక్‌లు వచ్చేసరికి దశరథ మీద పారిజాతం అరుస్తుంది. మాట తూలేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అంటుంది. ఏమైంది అని కార్తీక్ అడగ్గా.. మీరెందుకు వచ్చారురా? పోండి? అని కసురుకుంటుంది పారు. ఈరోజు మీకు ఇంట్లో పనిలేదని, రేపటి నుంచి కూడా పని లేకపోవచ్చిన అంటుంది. నిన్న దగ్గరుండి మరి గొడవ పెట్టావుగా, వెళ్లిపోయిన వాడివి మళ్లీ వెనక్కి ఎందుకొచ్చావని నిలదీస్తుంది పారు. సుమిత్ర ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.. ఇదంతా నీ వల్లే జరిగిందని మండిపడుతుంది. రాత్రి గదిలో పడుకుంది, తెల్లారైనా రాకపోయేసరికి అనుమానం వచ్చి చూస్తే గదిలో సుమిత్ర లేదని అంటుంది పారు. ఎక్కడికి వెళ్లిపోయిందో తెలియదు, ఎక్కడ వెతకాలో తెలియడం లేదని అంటుంది. మమ్మీ కనిపించడం లేదని పోలీస్ కంప్లయింట్ ఇద్దామని చెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో శివన్నారాయణ, దశరథ సీరియస్ అవుతారు.
శివన్నారాయణ గారి కోడలు కనిపించడం లేదంటే జనం ఏమనుకుంటారు? మన పరువు మిగులుతుందా? అని మండిపడతారు. పెద్ద మేడం గారు ఇవన్నీ ఆలోచించరని, ఆవిడకేం అనిపిస్తే అదే మాట్లాడతారని అంటాడు కార్తీక్. అంత బాధలో బయటికి వెళ్లిన ఆడది.. ఏ నుయ్యే గొయ్యో చూసుకుని ఉంటుందని పారు అనడంతో దీప, శివన్నారాయణ, దశరథలు సీరియస్ అవుతారు. అంత గొడవ జరిగినప్పుడు మీరు సుమిత్రమ్మ గారి పక్కనే ఉండాలి కదా అని అంటుంది దీప. మీరేం చేస్తారో తెలియదు నా కోడలు నా ఇంట్లో ఉండాలని కార్తీక్, దీపలకి శివన్నారాయణ చెబుతాడు. ఇప్పుడు అందరూ మనల్నే అంటున్నారు... అదే రాత్రి మీ అమ్మ వెళ్లకుండా ఆపుంటే ఈ గొడవ జరిగేది కాదని పారు అనడంతో అంతా షాక్ అవుతారు.
రాత్రి ఎవరో బయటికి వెళ్లినట్లుగా ఉందని జ్యోత్స్న అనడంతో తెల్లారి లేచాక సుమిత్ర అని అర్ధమైందని పారు అనడంతో ఆమెను కొట్టడానికి శివన్నారాయణ చెయ్యి ఎత్తుతాడు. చీకటిలో నాకు సరిగా కనిపించలేదని జ్యోత్స్న అనడంతో అప్పుడు మీ అమ్మ గదిలో ఉందో లేదో చెప్పాలి కదా కార్తీక్ సీరియస్ అవుతాడు. కన్నతల్లి నీడ కనిపించినా బిడ్డ పోల్చుకోగలదని, ఎవరో ఇంట్లో నుంచి ఎందుకు వెళ్తారని సీరియస్ అవుతుంది దీప. నువ్వు, మీ మావయ్య సుమిత్రలు వెతికి తీసుకురమ్మని చెబుతాడు శివన్నారాయణ. కాంచన దగ్గరికి శ్రీధర్ వచ్చి.. టెస్ట్‌ల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తానని అంటాడు. నా కొడుకు తీసుకెళ్తాడని అంటుంది. ఇంతలో శ్రీధర్‌కి కార్తీక్ ఫోన్ చేసి సుమిత్ర అత్త మీ ఇంటికి ఏమైనా వచ్చిందా? అని అడుగుతాడు. అత్త ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని నీకు కనిపిస్తే చెప్పమని అంటాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications









