Karthika Deepam 2 October 21st: నోరు జారిన శౌర్య.. దీపకు చెమటలు పట్టించిన జ్యోత్స్న

Photo Courtesy: JioHotstar

సుమిత్ర కళ్లు తెరిచి చూసేసరికి మంచంపై ఉండటంతో అటు ఇటు వెతికి ఇది కాంచన ఇల్లు అని తెలుసుకుంటుంది. ఆ వెంటనే బయటికి వెళ్లిపోతుండటంతో దీప, కాంచనలు ఆపుతారు. ఇక్కడే ఉంటే మీరు మా వాళ్లకి చెప్పేస్తారని సుమిత్ర అనగా.. మేం ఎవ్వరికీ చెప్పమని మీకు పూర్తిగా తగ్గేవరకు ఇక్కడే ఉండమని చెబుతుంది దీప. గతంలో మీ కోసం నా తలకి దెబ్బ తగిలింది... ఇప్పుడు నా కోసం మీరు దెబ్బతిన్నారని గుర్తుచేస్తుంది దీప. కాంచన, దీపలు ఇబ్బంది పెట్టడంతో సుమిత్ర సరేనని అంటుంది.

సుమిత్రను తలచుకుని దశరథ ఉలిక్కిపడి లేస్తాడు. దాంతో శివన్నారాయణ, జ్యోత్స్న, కార్తీక్‌, పారులు పరిగెత్తుకుంటూ వస్తారు. అత్తయ్య ఎక్కడ అని పెద్దాయన నిలదీయగా.. అత్త ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుందని, నేను వెతికి తీసుకొస్తానని అంటాడు కార్తీక్. సుమిత్ర ఎక్కడ ఉందన్న విషయం కార్తీక్‌కి తెలుసని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. టిఫిన్ తినకుండా, టాబ్లెట్స్ వేసుకోకుండా పడుకొన్న సుమిత్రపై దీప, కాంచనలు మండిపడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 21వ తేదీ 494వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 494 October 21st 2025 Here is full story

Photo Courtesy: JioHotstar

సుమిత్రకు దీప టిఫిన్ తినిపించి టాబ్లెట్ వేస్తుంది. ఇప్పటికే కుటుంబానికి నువ్వు సగం దూరమైపోయావ్.. ఏదో ఒకటి మాట్లాడి పూర్తిగా దూరం కావొద్దని జ్యోత్స్నని హెచ్చరిస్తుంది పారిజాతం. మీ అందరికీ బుర్రలు సరిగా పనిచేస్తున్నాయా? ఇంట్లో ఇదంతా జరగడానికి కారణమైన దీపని ఏం చేయాలో అది చేసేవారని మండిపడుతుంది జ్యోత్స్న. మా మమ్మీ ఇంట్లోకి వెళ్లడం నేను చూశా? దాని వల్ల ఉపయోగం ఉంటుందని అనుకున్నావా? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. ఈ ఇంట్లో నేను కోరుకున్న విలువ లేదని, డాడీకి కూడా నా మీద అనుమానం ఉందని చెబుతుంది జ్యోత్స్న.

దాస్‌ని చంపాలనుకున్న విషయం మీద అని చెప్పబోతూ ఆగిపోతుంది. నేను ఈ ఇంటి వారసురాలిని కాదేమోనని డాడీకి అనుమానం అంటుంది. ఆ అనుమానం దశరథకి వచ్చే అవకాశమే లేదని, నువ్వు లేనిపోనివి ఆలోచించి నీలో నువ్వు భయపడొద్దని, ఇప్పటికే నువ్వు చాలా పెద్ద తప్పు చేశావని, నిన్ను నేను సమర్ధిస్తే నీతో పాటు నాకు కూడా తిట్లు పడతాయని అంటుంది పారిజాతం. మీ తాతకి చిర్రెత్తుకొచ్చిందంటే? మీ అమ్మ పోవడం కాదు.. మనిద్దిరినీ బయటికి గెంటేస్తాడని హెచ్చరిస్తుంది. సుమిత్ర రాకపోతే జరిగేది అదేనని పారిజాతం అనగా.. మా మమ్మీ వస్తుందని అంటుంది జ్యోత్స్న. నిన్నటి నుంచి కార్తీక్, దశరథ, దీపలు వెతుకుతుంటేనే దొరకడం లేదని అంటుంది పారిజాతం.

మమ్మీ దొరికిందని జ్యోత్స్న చెప్పగా.. పారిజాతం షాక్ అవుతుంది. మమ్మీ దొరికిందని బావ చెప్పాడని, కనిపించడం లేదంటూనే క్లూ ఇచ్చాడని అంటుంది. మా మమ్మీ కనిపించకపోతే దీప, కార్తీక్‌లు కూల్‌గా ఉండరని... కానీ బావ చాలా కాన్ఫిడెంట్‌గా అత్తయ్య క్షేమంగా ఉందని చెప్పాడంటే మమ్మీ వివరాలు బావకి తెలుసని చెబుతుంది జ్యోత్స్న. ఆ దీప కూడా ఇంటి దగ్గరే ఉండి టిఫిన్లు చేసి పార్శిల్ పంపించేంత తిరుబడిగా ఉండదని అంటుంది జ్యోత్స్న. మీ అమ్మ మీద దానికెందుకు అంత ప్రేమ అని పారు అడగ్గా.. ఆ దీప అసలైన కూతురు కాబట్టి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. అది కూల్‌గా టిఫిన్లు పంపిస్తుందంటే మా మమ్మీ వాళ్ల దగ్గరే ఉండి ఉంటుందని అనుకుంటుంది.

నేను వెళ్లి మమ్మీ ఎక్కడ ఉన్నా తీసుకొస్తానని పారుకు చెప్పి బయల్దేరుతుంది. మరోవైపు.. ఎన్నిరోజులు మా వదినని మనింట్లో ఉంచుకుంటామని దీపతో అంటుంది కాంచన. గాయం తగిలినంత త్వరగా మానదు.. భర్త అస్తమానం తిడుతుంటే భార్య పట్టించుకోదు కానీ, ఎప్పుడూ సుమిత్ర గారిని కోప్పడని దశరథ గారు అనకూడని మాట అనేసరికి సుమిత్ర గారు తట్టుకోలేకపోయారని అంటుంది దీప. ఇక్కడ వదిన టాబ్లెట్ వేసుకుని పడుకుంది కానీ, అక్కడ మా అన్నయ్య పరిస్ధితి ఎలా ఉందో ఏంటో? అని కంగారు పడుతుంది. ఇంతలో దీప ఇంటి ముందు పెద్ద కారు వచ్చి ఆగడంతో ఆ ఇంటి నుంచి ఎవరైనా వచ్చారా? అని కాంచన, దీపలు టెన్షన్ పడతారు.

కారులో నుంచి జ్యోత్స్న బయటికి రావడంతో ఇద్దరూ షాక్ అవుతారు. శౌర్య దగ్గరి నుంచి వివరాలు రాబట్టాలని అనుకున్న జ్యోత్స్నకి మీరు మా ఇంటికి ఎందుకొచ్చారని ప్రశ్నిస్తుంది దీప. డ్యూటీకి ఎందుకు రాలేదని జ్యోత్స్న అడగ్గా.. మా బావ చెప్పే ఉంటాడు కదా అని ఆన్సర్ ఇస్తుంది దీప. నేను చాలా విషయాలు తెలుసుకోవడానికి వచ్చానని మండిపడుతుంది. ఇలా మాట్లాడే మా అన్నయ్యకి, వదినని దూరం చేశావని కాంచన ఫైర్ అవుతుంది. నువ్వు, దీప, మా బావ అందరూ కలిసి మా మమ్మీని నాకు దూరం చేశారని అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, ఎన్నాళ్లు నడుస్తుందో నడవని అని చెబుతుంది. నేను మా మమ్మీ కోసం వెతుకుతున్నానని జ్యోత్స్న చెప్పగా.. నన్ను కూడా సాయం రమ్మంటావా అని అడుగుతుంది దీప.

నీలో ఉన్న ఆ నిజాయితీ అంటే నాకు చాలా ఇష్టమని అంటుంది. కానీ శౌర్యని నేను అడుగుతానని జ్యోత్స్న చెప్పడంతో.. సుమిత్ర గురించి ఎక్కడ నోరు జారుతుందోనని దీప, కాంచన, అనసూయలు షాక్ అవుతారు. వెంటనే మీ అమ్మమ్మ మీ ఇంట్లో ఉంది కదా అని అడగ్గా.. ఉంది అని జ్యోత్స్న ఆన్సర్ ఇస్తుంది. అమ్మమ్మ రెండ్రోజుల నుంచి మా ఇంట్లోనే ఉందని అంటుంది శౌర్య, నాకు చూపిస్తావా? అని జ్యోత్స్న అడగ్గా.. సరేనని లోపలికి తీసుకెళ్తుంది జ్యోత్స్న. వెంటనే దీపను పెంచిన ఆమె ఫోటోని చూపించి ఆమె మా అమ్మమ్మ అని చెబుతుంది శౌర్య. నేను చెప్పింది ఈ అమ్మమ్మ గురించేనని అంటుంది. ముందుగానే శౌర్యకి ట్రైనింగ్ ఇచ్చిన విషయం గుర్తొచ్చి దీప సంతోషిస్తుంది.

ఈ ఫోటోలో ఉన్నది ఎవరని జ్యోత్స్న అడగ్గా.. ఆమె మా అమ్మ అని అంటుంది దీప. దీప చంటిబిడ్డగానే ఉన్నప్పుడు ఆవిడ చనిపోయిందని అనసూయ చెబుతుంది. అసలు మా మీద నీ అనుమానం ఏంటీ? అని కాంచన రగిలిపోతుంది. మా మమ్మీ ఎక్కడుందో తెలియదు, మీ ఇంటికి వచ్చిందేమోనని అంటుంది జ్యోత్స్న. మా మమ్మీ ఇక్కడే ఉండి ఉంటే అప్పుడు మీ సంగతి చెప్పే దానిని అంటుంది. జ్యోత్స్న వెళ్లిపోతుండగా ఎవరో దగ్గిన శబ్ధం వినిపిస్తుంది. ఎవరు దగ్గారో నేను చూడాల్సిందేనని జ్యోత్స్న లోపలికి వెళ్లగా అక్కడ సుమిత్ర కనిపించదు. మా మమ్మీ గురించి తెలిస్తే నాకు ఫోన్ చేయమని చెబుతుంది.

మా నాన్నకి ఎలా ఉందని జ్యోత్స్నని అడుగుతుంది కాంచన. ఎవరు బాగుండాలన్నా ముందు మా మమ్మీ తిరిగి రావాలని, మా మమ్మీ తిరిగి రాకపోతే మాత్రం అందుకు కారణమైన వాళ్లని వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది జ్యోత్స్న. వదిన ఆ గదిలోనే ఉండాలి కదా? లేదని జ్యోత్స్న చెప్పడంతో కాంచన టెన్షన్ పడుతుంది. దాంతో అందరూ ఆ గదిలో వెతగ్గా.. బెడ్ ఖాళీగా ఉండటంతో కాంచన, దీప, అనసూయలు షాక్ అవుతారు. ఇంతలో సుమిత్ర కిందపడిపోయి కనిపించడంతో అందరూ ఉలిక్కిపడతారు. వదినకి ఏమైంది? ఎందుకిలా పడిపోతుందని అడుగుతుంది కాంచన. టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుందని దీప చెప్పగా.. వదిన ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తోందని, ఇప్పుడు తను కొత్తగా ఉందని అంటుంది కాంచన. బావ వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెబుతుంది దీప.

దీపకు మన మీద అనుమానం వచ్చి ఇంటి దాకా వచ్చిందని, మళ్లీ తిరిగి రాదని గ్యారంటీ ఏంటీ? అని దీపని ప్రశ్నిస్తుంది అనసూయ. సుమిత్రమ్మ గారిని ఎవరి కంటా కనిపించకుండా ఎన్నాళ్లు దాస్తామని అడుగుతుంది. బావ వచ్చాక ఒక నిర్ణయం తీసుకుందామని చెబుతుంది దీప. డైనింగ్ టేబుల్ దగ్గర దశరథకు సుమిత్ర గుర్తురావడంతో నా భార్యని నేనే వెతుక్కుంటానని , తిరిగి ఆమెతోనే ఇంట్లో అడుగుపెడతానని శివన్నారాయణతో అంటాడు. సుమిత్ర లేని ఈ ఇంట్లో ఉండలేకపోతున్నానని, నేను కూడా వెతుకుతానని చెబుతాడు. నువ్వెంత వెతికినా అత్త దొరకదని కార్తీక్ చెబుతాడు. ఇంతలో జ్యోత్స్న వచ్చి ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుందని నువ్వే చెప్పావ్ కదా అని అంటుంది. అంటే సుమిత్ర మీద ఆశలు వదిలేసుకోమని చెబున్నావా అని పారిజాతం నిలదీస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X