Karthika Deepam 2 October 28th: గుడిలో ఎదురుపడ్డ సుమిత్ర - దశరథ ... దీప ఇంటికి పోలీసులతో వెళ్లిన జ్యోత్స్న
Photo Courtesy: JioHotstar
కార్తీక్‌ను తీసుకుని ఇంటికి వస్తాడు శివన్నారాయణ. ఈరోజు నువ్వు కొత్త తాతని చూస్తావని మనవడితో చెబుతాడు. సుమిత్ర ఫోటో చూస్తూ బాధపడుతున్న దశరథని ఇకపై నీ భార్య గురించి వెతకొద్దని అంటాడు శివన్నారాయణ. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. నీ మీద గౌరవం లేకుండా వెళ్లిపోయిన భార్య గురించి ఆలోచించొద్దని, వెతకొద్దని అంటాడు శివన్నారాయణ. తప్పు చేసింది నేనే, అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందని కుమిలిపోతాడు శివన్నారాయణ. తాతలో వచ్చిన మార్పు చూసి జ్యోత్స్నకి అనుమానం వస్తుంది.
ఆఫీస్‌కి వెళ్లకుండా రోడ్డుపై కబుర్లు చెబుతున్నా అల్లుడి గురించి కాశీ రగిలిపోతాడు. అతను ఇంటికి రాగానే తాను తీసిన ఫోటో చూపించి నిలదీయడంతో కాశీ వణికిపోతాడు. ఇంతలో స్వప్న రావడంతో శ్రీధర్ సైలెంట్ అయిపోతాడు. మావయ్యతో చాలా కఠినంగా మాట్లాడవని కార్తీక్ అనగా.. సుమిత్ర మీదున్న ప్రేమను బయటికి తీసుకురావడానికి అలా అన్నానని చెబుతాడు శివన్నారాయణ. రేపు వాడి పెళ్లి రోజు కాబట్టి దశరథ - సుమిత్రలను కలపడానికి ప్లాన్ ఉందని చెబుతాడు శివన్నారాయణ. ఇదే విషయాన్ని దీపకు చెబుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 28వ తేదీ 500వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మీ అమ్మని వెతకమన్నాను, మీ తాతని సెంటిమెంట్‌తో కొట్టమన్నాను కొట్టావా? నీకు వాళ్ల మీద ప్రేమ లేదని జ్యోత్స్నపై మండిపడుతుంది పారు. ఈ ఆస్తి మీద, కార్తీక్ గాడి మీద తప్పించి నీకు ఎవరి మీద ప్రేమ లేదని అంటుంది. మమ్మీ ఎక్కడుందో బావకి తెలుసని నాకు అనుమానంగా ఉందని, తాత ప్రవర్తన కూడా తేడాగా ఉందని చెబుతుంది పారిజాతం. ఈ రోజు దశరథతో మీ తాత చాలా కొత్తగా మాట్లాడాడని అంటుంది పారిజాతం. కార్తీక్, దీపలు సుమిత్ర గురించి తెలిస్తే ఖచ్చితంగా చెబుతారని, దాచి ఏం సాధిస్తారని ప్రశ్నిస్తుంది. నీ జీవితం బాగుండాలన్నా? నీ కోరిక నెరవేరాలన్నా సుమిత్ర, దశరథలు కలిసుండాలని అంటుంది పారిజాతం. కార్తీక్ గాడు, దీపలు కలుపుతారని చెబుతుంది. అప్పుడు కార్తీక్ సీఈవో అవుతాడు, దీప ఈ ఇంటికి దేవత అవుతుందని చెబుతుంది జ్యోత్స్న. ఆ క్రెడిట్ ఎవరికీ దక్కడానికి వీల్లేదని, నా మీదున్న చెడ్డ పేరు పోవాలంటే నువ్వు చెప్పినట్లు మమ్మీని నేనే తీసుకురావాలని అంటుంది.
టిఫిన్ చేయడానికి శివన్నారాయణని పిలుస్తుంది పారిజాతం. కార్తీక్ వస్తేనే తింటానని పెద్దాయన చెప్పడంతో ఈ ఇంట్లో పనివాళ్లకు, డ్రైవర్లకు ఉన్న విలువ మనకు లేదని అంటుంది పారిజాతం. దీప ఎందుకు రావడం లేదని జ్యోత్స్న అడగ్గా.. నేనే రావొద్దని చెబుతాడు కార్తీక్. ఇంతలో దశరథ వచ్చి బయటికి వెళ్తానని అంటాడు. ఆఫీస్‌కా? రెస్టారెంట్‌కా? అని అడుగుతాడు శివన్నారాయణ. చాలా టైం పడుతుందని, నా కోసం ఎదురుచూడొద్దని అంటాడు దశరథ. నువ్వు కూడా సుమిత్ర లాగా బయటికి వెళ్లిపోతున్నావా? ఏంటీ అని ప్రశ్నిస్తుంది పారిజాతం. దాంతో శివన్నారాయణ రగిలిపోతాడు. భార్య మీద బెంగతో మూడు రోజుల నుంచి సరిగా తిండి తినడం లేదని, ఆ బెంగతోనే వెతుక్కుంటూ పోతున్నాడేమోనని అంటుంది పారిజాతం. పోయినవాళ్ల కోసం మనం వెళ్లాల్సిన అవసరం లేదని అంటాడు శివన్నారాయణ.
మా మమ్మీని వెతకారా? అని జ్యోత్స్న ప్రశ్నించగా.. అందరూ అదే పనిలో ఉన్నారని, సుమిత్ర కోసం వెతుకుతున్నారని చెబుతాడు శివన్నారాయణ. ఆచూకీ తెలియకుండా పోయిన మనిషిని దశరథ ఎక్కడని వెతుకుతాడని ప్రశ్నిస్తాడు. వాడి భార్య వాడిని వదిలేసుకుని వెళ్లిపోయిందీ కానీ, నేను వాడిని వదులుకోలేనని చెబుతాడు శివన్నారాయణ. సుమిత్ర వచ్చాక నువ్వు ఏం అనవు కదా అని ప్రశ్నిస్తాడు. ఏమీ అనను, కేవలం క్షమించమని మాత్రమే అడుగుతానని అంటాడు దశరథ. కార్తీక్‌ను తోడు వెళ్లమని పెద్దయన చెప్పగా.. వద్దు అంటాడు దశరథ. డ్రైవర్ తోడుంటే మంచిదని, ఇన్ని ఆలోచనలు మనుసులో పెట్టుకుని కారు నడపొద్దని చెబుతాడు .. దాంతో దశరథ సరేనని అంటాడు.
తన ప్లాన్ వర్కవుట్ అయినందుకు తాత మనవళ్లు సంతోషంతో సైగలు చేసుకోగా పారిజాతం అవాక్కవుతుంది. నువ్వు నాకు గుర్తుచేస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని సెటైర్లు వేస్తాడు శివన్నారాయణ. బాల్కనీలో నుంచి వెళ్లిన సుమిత్ర కనిపించలేదు కానీ.. నేను కార్తీక్‌కి చేసిన సైగ కనిపించిందా? అని శివన్నారాయణ ప్రశ్నించడంతో పారు షాక్ అవుతుంది. తాతకి కార్తీక్ సైగ చేయడం నిజంగా నువ్వు చూశావా? అని పారును జ్యోత్స్న అడుగుతుంది. బావ మీద నాకు అనుమానం రెట్టింపు అయ్యిందని అంటుంది. సుమిత్రను ఎలాగైనా వెతికి తీసుకొస్తానని జ్యోత్స్న ఆవేశంగా వెళ్లడంతో పారు టెన్షన్ పడుతుంది. కార్తీక్ దశరథను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ముసలోడికి ఎందుకు సైగ చేశాడని ఆలోచిస్తుంది పారిజాతం.
జాబ్ వచ్చిందని రోడ్డు పక్కన మేనేజ్ చేస్తున్నావు, మరి శాలరీ సంగతి ఏం చేశావని కాశీని ప్రశ్నిస్తాడు శ్రీధర్. నాకు జాబ్ లేకపోతే అందరూ సలహాలు ఇచ్చారని అందుకే జాబ్ వచ్చిందని చెప్పానని, అప్పటి నుంచి ఇంట్లో వాళ్లలో మార్పు వచ్చిందని చెబుతాడు కాశీ. స్వప్నకి మోసం చేసేవాళ్లని చీరాకని అంటుండగా నిజం చెప్పొద్దని శ్రీధర్ కాళ్లు పట్టుకుంటాడు. అది చూసిన స్వప్న ఏం జరిగిందోనని టెన్షన్ పడుతుంది. నీ కాపురం బాగుపడాలంటే కొన్ని దాయాల్సిందేనని సరేనని చెబుతాడు శ్రీధర్. మరోవైపు.. దశరథ, కార్తీక్‌లు గుడికి వస్తారు, నిన్నటి నుంచి నాన్నకి, నీకు ఏమైందని కార్తీక్‌ను ప్రశ్నిస్తాడు దశరథ. మీ నాన్నని తీసుకుని గుడికి వచ్చానని దీపకు ఫోన్ చేసి చెబుతాడు కార్తీక్. దాంతో దీప కూడా సుమిత్రను తీసుకుని గుడికి వెళ్లాలని అనుకుంటుంది.
సుమిత్ర కనిపించకపోవడంతో ఇళ్లంతా వెతుకుతుంది దీప. ఇంతలో జ్యోత్స్న వచ్చి.. మా మమ్మీ ఈ ఇంట్లోనే ఉందని, మీరే దాచిపెట్టారని మండిపడుతుంది. పోలీసులను పిలిపించడంతో దీప, కాంచనలు షాక్ అవుతారు. దీప మా మమ్మీని కిడ్నాప్ చేసిందని, నేను వచ్చేలోగా మా మమ్మీని మాయం చేసిందని చెబుతుంది జ్యోత్స్న. పెళ్లి రోజు కావడంతో గుడికి వెళ్లిన సుమిత్రకు దశరథ, కార్తీక్ కనిపించడంతో షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications









