For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam సోది చెప్పే వేషంలో మోనిత కొత్త డ్రామా.. పిస్టల్ చేతబట్టి మరో కుట్రకు రెడీ

  |

  కార్తీకదీపం సిరీయల్‌లో మరోసారి భావోద్వేగాలు హై రేంజ్‌లో కనిపించాయి. కార్తీక్‌ను చూడటానికి పిల్లలు పోలీస్ స్టేషన్‌కు రావడం, కార్తీక్ కుటుంబ సభ్యులతో దీప ఎమోషనల్‌గా చర్చించడం, అలాగే సౌందర్య దంపతులు కార్తీక్ బెయిల్ గురించి మాట్లాడుకోవడం తాజా ఎపిసోడ్‌లో ఆసక్తిగా మారితే.. మోనిత కుట్రలకు మరోసారి తెర లేపింది. సోది చెప్పే అమ్మగా వేషంలో తుపాకి చేతపట్టుకొని బయలుదేరిన ఆమె ఏం చేసింది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే 1122 ఎపిసోడ్‌లోని ముఖ్య అంశాలు మీ కోసం..

  లాకప్‌లో ఉన్న తండ్రిని చూసి...

  లాకప్‌లో ఉన్న తండ్రిని చూసి...


  లాకప్‌లో ఉన్న తండ్రిని చూడటానికి శౌర్య, హిమలు వచ్చి ఎమోషనల్ అయ్యారు. పిల్లల్ని చూసిన కార్తీక్ ఎలా ఉన్నారంటూ పలకరించారు. తండ్రిని చూస్తూ.. నేలపై పడుకొంటున్నావా? ఏసీ లేదా? దోమలు కుట్టడం లేదా? నిద్ర ఎలా పడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటున్నావు డాడీ.. నిన్ను ఎందుకు ఇలా జైల్లో పెట్టారు. నీవేమైనా దొంగవా? నీవు పెద్ద డాక్టర్ అని చెప్పలేదా? అందరికి ఉచితంగా వైద్యం చేస్తావని వాళ్లకు తెలియదా? నిన్ను ఈ గదిలో పెట్టి ఎందుకు తాళం వేశారు అని హిమ, శౌర్య కంటతడి పెట్టుకొన్నారు.

  కన్నీరు మున్నీరైన శౌర్య, హిమ

  కన్నీరు మున్నీరైన శౌర్య, హిమ

  అయితే పిల్లల బాధను చూసి కార్తీక్ ఆవేదనకు గురయ్యాడు. నన్ను ఈ పరిస్థితిలో చూస్తే తట్టుకోలేరనే విషయం నీకు తెలియదా దీప అంటూ కార్తీక్ బాధపడ్డాడు. దాంతో ఒట్టు పెట్టుకొన్నారు డాక్టర్ బాబు అంటూ దీప సమాధానం చెప్పింది. తల్లి మాటలకు అడ్డుపడుతూ నిన్ను చూడలేకుండా ఉండలేకపోతున్నాం డాడీ అంటూ హిమ కన్నీరుమున్నీరైంది. అసలు బాగలేం. నీ మీద బెంగగా ఉన్నాం. నీవు ఎప్పుడెస్తావో తెలియక నిద్ర పట్టడం లేదు. ఈ గది తాళం తీసి బయటకు పంపించరా అంటే వద్దు వాళ్లు ఒప్పుకోరు అంటూ కార్తీక్ చెబితే.. నేను అడుగుతాను అంటూ శౌర్య వెళ్లి పోలీసును అడిగితే రూల్స్ ఒప్పుకోరు అంటే.. కానిస్టేబుల్ రత్నసీత పోనీలే.. పిల్లలు బాధపడుతున్నారు.. అంటే నీ ఇష్టం అంటూ పోలీస్ చెప్పాడు. దాంతో రత్నసీత లాకప్ తాళాలు తీసి కార్తీక్‌ను బయటకు పంపించింది.

  పోలీసులపై మండిపడ్డ ఏసీపీ రోషిణి

  పోలీసులపై మండిపడ్డ ఏసీపీ రోషిణి

  కార్తీక్‌ను బయటకు పంపడంతో పిల్లలు తెచ్చిన టిఫిన్‌ తెచ్చిన తింటూ కనిపించారు. పిల్లలతో టిఫిన్ చేస్తుండగా.. శౌర్య లేచి.. మా నాన్నను ఇంటికి తీసుకెళ్లి రేపు తీసుకొస్తామని అంటే.. రత్న సీత రూల్స్ ఒప్పుకోవని గొడవ చేశారు. దాంతో మా నాన్న ఏం తప్పు చేశారు అంటూ శౌర్య నిలదీసింది. నాన్న ఏం తప్పు చేశాడనే విషయాన్ని నీవు చెప్పవు.. పోలీసులను చెప్పనివ్వవు అంటూ తల్లిపై కోపగించుకొన్నది. ఆ సమయంలోనే ఏసీపీ రోషిణి ఎంట్రీ ఇచ్చి కార్తీక్‌ను బయట ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రత్నసీత అంటూ కోపగించుకొని.. ఎంటిదీ ఇది.. స్టేషన్ అనుకొంటున్నారా? క్యాంటిన్ అనుకొంటున్నారా? అందర్ని అనుమతించి పోలీస్ స్టేషన్‌ను పిక్నిక్ స్పాట్ చేశారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

  దీపను అడ్డు తొలగిస్తాను అంటూ

  దీపను అడ్డు తొలగిస్తాను అంటూ

  ఇదిలా ఉండగా, కార్తీక్‌పై మోనిత అదే పిచ్చి వ్యామోహాన్ని మళ్లీ కనబరిచింది. కార్తీక్ ఫోటోను పట్టుకొని.. ఎలా ఉంది నా ప్లాన్. నీకు మతిపోయింది కదా.. అరే.. నేను చంపకుండా మోనిత ఎలా చనిపోయిందని తల బద్దలు కొట్టుకొని ఉంటావు. నన్ను చంపి శవాన్ని మాయం చేసిన నేరానికి నీకు జైలుశిక్ష తప్పదు. ఇదంతా నీ మీద తీర్చుకొనే ప్రతీకారం అనుకొంటున్నావా? కాదు.. కాదు.. ఇందంతా నీ భార్య దీప మీద కోపంతోనే. నిన్ను చంపి జైలుకు వెళ్లి నా భార్యను ఒంటరిదాన్ని చేయలేను అని నీవు అన్నావుగా. నీ భార్యను ఒంటరిదాన్ని చేయడానికే నేను ఈ నాటకం ఆడుతున్నా. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నవ్వు జైలు నుంచి తిరిగి వచ్చే లోపు నీ భార్యను అడ్డు తొలగిస్తాను. నీవు ఎప్పటికీ నీ భార్యతో కాపురం చేయలేవు. ఇక నుంచి నీ భార్యను అడ్డు తొలగించే ప్రయత్నాల్లో ఉంటాను బాస్. సారీ నిన్ను కష్టపెట్టక తప్పడం లేదు అంటూ కార్తీక్ ఫోటోను గుండెలకు హత్తుకొని మోనిత సంతోషంలో మునిగిపోయింది.

  తుపాకీ చేతపట్టి సోది బుట్టతో

  తుపాకీ చేతపట్టి సోది బుట్టతో

  ఇదిలా ఉండగా, మోనిత మారువేషంలో మరో నాటకానికి తెర తీసింది. సోది చెప్పే మహిళలగా వేషం వేసుకొన్నది. ముఖానికి నిండుగా, ఫుల్లుగా పసుపు పూసుకొని ముసి ముసిగా నవ్వుతూ బయలుదేరింది. తనతోపాటు బుట్టలో తుపాకీతో సిద్దమైంది. ఓసారి తుపాకీని తీసి ప్రేమగా చూసుకొని మళ్లీ బుట్టలో పెట్టుకొన్నది. తన ప్లాన్‌లో భాగంగా సోది చెప్పే యువతిగా బుట్టతో క్యాబ్‌లో బయలుదేరింది. క్యాబ్‌లో తనను తాను చూసుకొంటూ మురిసిపోయింది.

  Karthika Deepam Vantalakka Live Video || కార్తీక దీపం సీరియల్‌ నుంచి తప్పుకోవడం పై దీప క్లారిటీ !
  ఒక దీపం ఆరిపోయిందంటూ...

  ఒక దీపం ఆరిపోయిందంటూ...

  క్యాబ్‌లో వెళ్తూ డ్రైవర్‌తో మాట్లాడుతూ.. ఎక్స్‌క్యూజ్ మీ.. నా వద్ద క్యాష్ లేదు. కావాలంటే నా ఫోన్ నుంచి నీ అకౌంట్‌కు క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేస్తాను. ఒకేనా అంటే.. క్యాబ్ డ్రైవర్ ఓకే అంటూ.. సోది చెప్పే వాళ్లు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని మనసులో అనుకొంటూ. మేడమ్ మీరు ఆర్టిస్టా? అంటే అవును అని మోనిత అన్నారు. అయితే మిమ్మల్ని సినిమాల్లో, సీరియల్స్‌లో ఎప్పుడు చూడలేదని డ్రైవర్ అంటే... నేను డ్రామా ఆర్టిస్టును. నాటకాలు బాగా వేస్తాను అంటూ మోనిత సమాధానం చెప్పింది. అయితే ఈ వేషం ఏ డ్రామాలోనిది అంటే.. ఒక దీపం ఆరిపోయింది అంటూ మోనిత ముసిముసిగా నవ్వుతూ సమాధానం చెప్పింది.

  English summary
  Karthika Deepam August 19th August's Episode preview. Latest episode of 1122 goes once again with emotional content.Karthik arrested in Monita murder case.In this occasion, emotional scenes took place between Karthik, Hima, Shourya and Deepa.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X