Don't Miss!
- Finance
Holidays in February: ఫిబ్రవరిలో 10 రోజులు బ్యాంక్స్ క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..?
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Karthika Deepam సౌందర్య గుండెలో మోనిత ఫైల్ బాంబు.. దీప మరణం గురించి లీక్!
కార్తీక్‌ను వశపరుచుకొనేందుకు మోనిత మరోసారి భారీ ప్లాన్ వేసింది. తాను చనిపోయి దీపకు గుండెను ఇస్తాను. కానీ చనిపోవడానికి ముందు నాకు తాళికడితే నీ భార్యగా కన్నుమూస్తాను అని వేడుకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మోనిత చేసే కుట్రల గురించి దీప ఆలోచనల్లో పడింది. నేనే కాదు ఎవరు కూడా మోనితతో సంతోషంగా లేరు. నేను పోయిన తర్వాత కూడా కార్తీక్‌ను పెళ్లి చేసుకొనేందుకు ఎంతకైనా తెగిస్తుంది. కాబట్టి నేను పోయేలోపే కార్తీక్‌కు పెళ్లి చేయాలి? లేదా నాతోపాటే మోనితను కూడా తీసుకెళ్లాలి అని దీప మనసులో అనుకొన్నది. అంతలోనే కూతురు హిమ వచ్చి.. ఎప్పుడు దిగాలుగా ఎందుకు ఉంటున్నావు అంటే.. అదేమీ లేదు అంటూ దీప సమాధానం చెప్పింది. అయితే నీ వాలకం చూస్తే ఎవరైనా అలానే అనుకొంటారు అని అత్త సౌందర్య అన్నారు. ఇంకా కార్తీకదీపం సీరియల్ 1563 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే...
చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులు కలిసిపోవడంతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. గత సంక్రాంతి తర్వాత పోయిన సంతోషం మళ్లీ ఈ సంక్రాంతికి తిరిగి వచ్చింది. ఎప్పుడూ ఈ సంతోషం ఎప్పుడూ ఉండాలని అని సౌందర్య అన్నారు. సూర్య భగవాడిని పూజించే పండుగను మకర సంక్రాంతిని జరుపుకొంటారు. పంటలు చేతికి వస్తాయి. కొత్త జీవితం ప్రారంభమవుతుంది అని సౌందర్య చెప్పింది.
సౌందర్య ఆనందం చూసి కార్తీక్, దీప హ్యాపీగా ఫీలయ్యారు. నేను పోయిన తర్వాత నీ జీవితంలోకి ఒకరు వస్తే మరింత ఆనందంగా ఉంటుందని చెబితే.. నా జీవితంలో మరొకరు రారు.. నీవు లేకపోతే.. నేను కూడా ఉండను అని కార్తీక్ తెగేసి చెప్పాడు. సంక్రాంతి పండుగ సంబరాల్లో దీపతోపాటు ఉండగా.. మోనిత చూస్తూ నవ్వుకొన్నది. ఎన్నాళ్లు ఇలా ఉంటావో.. ఎప్పుడు రాలిపోతావో అని మనసులో అనుకొన్నది. అంతలోనే తన ఇంటిపై ఉన్న మోనితను చూసి.. డాక్టర్ హేమచంద్ర అడిగితే.. మీ పర్మిషన్ లేకుండా వచ్చాను. నేను మోనితను.. కార్తీక్ రెండో భార్యను అని అంది. అయితే కార్తీక్‌కు ఒకరే భార్య.. రెండో భార్య లేదు అని హేమచంద్ర అన్నారు. అంతలోనే హేమచంద్రతో ఉన్న మోనితను చూసి దీప కిందపడిపోయింది. ఆ తర్వాత కాసేపటికి తేరుకోవడంతో పండుగ రోజు హైదరాబాద్‌లో ఉన్న తన తల్లిదండ్రులు భాగ్యం వద్దకు వెళ్లారు.

బతికి వచ్చిన కార్తీక్, దీప, హిమ, శౌర్యను చూసిన ఆనందంలో పిన్ని భాగ్యం మూర్చపోయింది. ఆ తర్వాత లేపడంతో భాగ్యం లేచింది. ఆ తర్వాత అందరూ కలిసి ఆనందంగా సమయాన్ని గడిపారు. అయితే కార్తీక్, దీప కుటుంబంతోనే మోనిత హైదరాబాద్‌కు వచ్చి సౌందర్యను కలిసింది. దెయ్యంలా ఎందుకు వెంటపడుతుతావు అని సౌందర్య అంటే.. దెయ్యాన్ని కాదు.. నేను చెప్పే మాట వింటే దేవతగా భావిస్తావు. నేను చెప్పేది 10 నిమిషాలు విను. నేను కనుక్కోమని చెప్పిన సీక్రెట్ తెలుసుకొన్నావా? అంటే.. వాళ్లు నా వద్దకు ఎందుకు రాలేదు అంటే.. అది మేము తేల్చుకొంటాం. నా కొడుకు, కోడలు ప్రాణాలతో వచ్చారు.. అని సౌందర్య అంటారు. దాంతో వచ్చిన ప్రాణాలు పోతే ఎలా అని అనగానే మోనితపై సౌందర్య ఫైర్ అయింది.
అయితే ఈ ఫైల్ చూస్తే.. మీ కొడుకు, కోడలు ఎందుకు దూరంగా ఉన్నారో తెలుస్తుంది అని మోనిత ఫైల్ చేతిలో పెట్టింది. ఫైల్ చూసిన సౌందర్య షాక్‌లోకి వెళ్లిపోయింది. ప్రశాంతంగా ఉన్న సౌందర్య మనసులో మోనిత ఫైల్ బాంబు పేల్చింది.