Karthika Deepam June 14th Episode: మోనితకు నమ్మక ద్రోహమా.. నమ్మకం నిలబెడుతావా.. కార్తీక్‌కు దీప కౌంటర్

కార్తీకదీపం సీరియల్‌లో మోనిత పెట్టిన చిచ్చు తాలుకు ప్రభావం ఇంకా కార్తీక్ ఇంటి సభ్యుల్లో కొనసాగుతున్నది. తాను చేసిన తప్పును దీపకు వివరించేందుకు కార్తీక్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ దీప మౌనంగా ఉండటం అనేక ప్రశ్నలకు దారి తీసింది. ఇక కార్తీక్ ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య కార్తీక్ ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు లేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 1065 ఎపిసోడ్‌లో జరిగిన కోన్ని ముఖ్యమైన విషయాలు మీ కోసం..

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
భరించలేకపోతున్నాను దీప..

భరించలేకపోతున్నాను దీప..

దీప ఇంటికి పిల్లలతో కలిసి వచ్చిన కార్తీక్ తన మనసులోని మాటను వ్యక్తం చేస్తూ... నాకు నువ్వు కావాలి... పిల్లలు కావాలి.. అంతకంటే ఎక్కువగా ఏమీ వద్దు దీప.. నా మాటలు నమ్మనట్టు అలా చూడకు. ఆ చూపులను నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ దీప.. నేను భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి మాట్లాడు. నన్ను నమ్ము దీప. నీవు నమ్మకపోయినా పర్వాలేదు. కానీ తిట్టు అంటూ దీపను కార్తీక్ బతిమలాడాడు. దాంతో నేను ఒక మాట అడుగుతాను.. ఒకటి చేసి పెడుతాను అంటూ దీప నోరు తెరిచింది.

 వేరే దేశం వెళ్లి సెటిల్ అవుదాం

వేరే దేశం వెళ్లి సెటిల్ అవుదాం

దీప మౌనం వీడటంతో హమ్మయ్య... మాట్లాడావు. నీవు ఏది అడిగితే అది చేసిపెడుతాను. ఈ ఊరు వదలి వేరే ఏదో ఒక ఊరు వెళ్తామా? లేక దేశం వదిలి మరో దేశం వెళ్దామా? ఏ దేశం అంటే ఇష్టమో చెప్పు. అక్కడికి వెళ్లి సెటిల్ అవుదాం. అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, ఇటలీ.. ఇలా ఏ దేశం అంటే ఆ దేశానికి వెళ్లిపోదాం. పిల్లలతో మనమిద్దరం. మనకిద్దరం అని బతుకుదాం అని కార్తీక్ మాట్లాడుతూనే ఉన్నాడు.

 నా నమ్మకం నిలబెడుతారా?

నా నమ్మకం నిలబెడుతారా?

దీప స్పందిస్తూ.. అప్పుడు మోనితకు ద్రోహం చేసినట్టు అవుతుంది కదా.. నేను మన సంగతి మాట్లాడటం లేదు. మాట్లాడను కూడా. కానీ సరోజ అక్క భర్త లక్ష్మణ్ ఉన్నాడు కదా.. ఒకసారి హార్ట్ ఆపరేషన్ చేశారు కదా.. మీతో చెప్పి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తారా అని అడిగారు. అతడికి ట్రీట్‌మెంట్ చేయిస్తారా? మీ మనసు, చేయి మంచిదని నమ్ముతున్నారు. ఆ నమ్మకం పోకూడదని నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు నమ్మకాన్ని నిలబెడతారా? అని దీప అడిగింది.

మౌనంగా లేచిపోయిన కార్తీక్

మౌనంగా లేచిపోయిన కార్తీక్

లక్ష్మణ్ వైద్యం గురించి దీప మాట్లాడుతూ. మిమ్మల్ని దేవుడు అన్నాడు. మీలాంటి వ్యక్తి భర్త అయినందుకు నన్ను అదృష్టవంతురాలివి అన్నాడు. అంత నమ్మకం పెట్టుకొన్న వాడిని అప్‌సెట్ చేయకూడదని నేను రికమెండ్ చేస్తున్నాను. అతడికి వైద్యం చేస్తారా? మీ వద్దకు అతడిని పంపించమంటారా? అని ఎమోషనల్‌గా మాట్లాడారు. దాంతో డైనింగ్ టేబుల్ మీద నుంచి కార్తీక్ లేచి మౌనంగా వెళ్లిపోయాడు.

 తల్లిదండ్రుల గురించి శౌర్య, హిమ

తల్లిదండ్రుల గురించి శౌర్య, హిమ

ఇద్దరి సంభాషణను చూస్తున్న హిమ, శౌర్య ఇద్దరు.. ఎందుకు మమ్మీ నాన్నతో అంత బతిమిలాడించుకొంటున్నది. నాన్న అన్ని మాటలు మాట్లాడితే.. అమ్మ ఒక్క మాట మాట్లాడటం లేదు అని ఇద్దరు మాట్లాడుకొంటూ కనిపించారు. అయితే వాళ్లిద్దరు ఎంత వాదులాడుకొన్నా గానీ.. మళ్లీ ఫ్రెండ్స్ అయిపోతారు. మనకెందుకు అదంతా.. పెద్దల విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు అంటూ నిద్రపోయేంందుకు వెళ్లిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X