For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam Episode 1109: మోనిత.. నీ బతుకు కుక్కలు చింపిన విస్తరే.. దీప వార్నింగ్

  |

  కార్తీకదీపం సీరియల్‌లో దీప, మోనిత అంజిని తమ చేతికి చిక్కించుకొనేందుకు ఎవరికి వారు తమ ప్లాన్స్‌లో బిజీగా ఉన్నారు. మోనిత కారు చెడిపోవడంతో ఇద్దరు ఒకే కారులో ప్రయాణిస్తుండటంతో సన్నివేశాలు ఆసక్తికరంగా మారాయి. సూర్యాపేటలోని 8 రెస్టారెంట్‌లో ఉన్న అంజిని బంధించేందుకు మోనిత వేసే కుట్రలను దీప జాగ్రత్తగా తెలుసుకొంటూ ముసుగులో పడుకొన్నట్టు నటించింది. సూర్యాపేట సమీస్తుండగా దీప ముసుగు తీసి షాకిచ్చింది. ఇంకా 1109 ఎపిసోడ్‌లో దీప, మోనిత మధ్య ఏం జరిగిందంటే.

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  అంజిని ఫామ్‌హౌస్‌కు తరలించే ప్లాన్‌లో

  అంజిని ఫామ్‌హౌస్‌కు తరలించే ప్లాన్‌లో

  మోనిత ఫోన్ తీసి ద్రాక్షారామం అనే వ్యక్తికి ఫోన్ చేసి.. సూర్యాపేట హోటల్ నుంచి :ఒక కారు బుక్ చేయి. మా ఇంటికి కాదు. వరంగల్ హైవేలో యాదగిరి గుట్టలో మా ఫామ్‌హౌస్ ఉంది కదా.. అక్కడికి కారు బుక్ చేయి. నా విల్లను కూడా బుక్ చేయమని చెప్పు అని మోనిత చెప్పింది. అయితే మోనిత మాటల విన్న దీప.. అంజిని యాదగిరి గుట్టలోని ఫామ్‌హౌస్‌లో ఉంచబోతుందన్నమాట. ఒసే మోనిత.. నీ గొయ్యి నీవే తవ్వుకోవడానికి సిద్దమయ్యావే అంటూ దీప మనసులో అనుకొంటే... దీపమ్మ.. ఒక కనుబొమ్మ పైకెత్తి.. కాలు మీద కాలు వేసుకొని.. అదేదో వజ్రాలహారం చూపించినట్టు తాళిని చూపిస్తూ.. తెగ రెచ్చిపోతావు కదా.. నీ డాక్టర్ బాబు.. నా కార్తీక్ కాబోయే సమయం దగ్గరకు వచ్చింది. రేపు ఉదయం 11.30కు నా మెడలో తాళి కడుతాడు అని మోనిత అంది.

  మోనితకు షాకిచ్చిన దీప

  మోనితకు షాకిచ్చిన దీప

  ఇక మోనితకు ఒక షాక్ ఇద్దామని దీప డిసైడ్ అయింది. కారు డ్రైవర్‌ లైట్ వేయి.. వాటర్ బాటిల్ కనిపించడం లేదు అని దీప అనగానే.. మోనిత షాక్ గురైంది. దీప కారులోనే ప్రయాణిస్తున్నానా అంటూ బెదిరిపోయినట్టు కనిపించినా వెంటనే సర్దుకొన్నది. కాకి మెడ కరెక్ట్‌గా తిరిగింది అంటూ తనదైన శైలిలో ఫోజిస్తూ.. మోనిత బాగున్నావా? ఎక్కడికో బయలు దేరినట్టు ఉన్నావు అని అనగానే... బాబు కారు ఆపు.. దీప నీకు ఎప్పటి నుంచో అక్క.. రేపటి నుంచి నాకు అక్క. ఎప్పటి నుంచి కారులో ఒక్కదాన్నే ఖాళీగా కూర్చొన్నాను అంటూ మోనిత కారు దిగి దీప పక్కన కూర్చొంది. దీప పక్కన కూర్చొని.. అక్కా ఇంకేమి విషయాలు అని మోనిత అంటే.. చాలా విషయాలు ఉన్నాయి. రేపు తీరిగ్గా తెలుసుకొంటావు అంటూ దీప సమాధానం ఇచ్చింది.

  నా పెళ్లిని పెటాకులు చేస్తావా?

  నా పెళ్లిని పెటాకులు చేస్తావా?

  ఇక డ్రైవర్ టీ తాగడానికి కారు ఆపడంతో దీపతో మాటలు కలిపిన మోనిత.. మనం ఓపెన్‌గా మాట్లాడుకొందామా? అంటే.. లేదు చాలా క్లోజ్‌గా మాట్లాడుకొందాం అంటూ మోనితకు దీప ఝలక్ ఇచ్చింది. దాంతో నా పెళ్లి పెటాకులు చేయాలనుకొన్నావు. కానీ నేను నా పెళ్లికి ఏర్పాట్లు చేసుకొంటున్నాను. ఈ హైవేలో కారులో నీ పక్కన కూర్చొని ప్రయాణించాను అని మోనిత అంది. అయితే 25వ తేదీన పెళ్లా? జైలా అనే వార్నింగ్ ఇచ్చినా.. ఇంత టెన్షన్ లేకుండా ఉన్నదంటే అంజి ఆచూకీ తెలవడం వల్లే అనుకొంటా అని దీప మనసులో అనుకొన్నది. ఎక్కడికైనా వెళ్లు కానీ.. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని మోనిత అంటే.. విజయవాడలోని దుర్గ దగ్గరికి వెళ్తున్నాను అని అనగానే మోనిత షాక్ తిన్నది.

  కార్తీక్‌తో నా పెళ్లి ఖాయం..

  కార్తీక్‌తో నా పెళ్లి ఖాయం..

  దుర్గ అంటే ఎవరో అనుకొనేవు.. అమ్మవారు దుర్గ వద్దకు వెళ్తున్నా. చాలా చికాకుల్లో ఉన్నాను. అమ్మ వారికి కష్టాలు తీరాలని మొక్కుకొనేందుకు వెళ్తున్నాను అని దీప అంటే.. వెళ్లు వెళ్లు.. నీవు విజయవాడ నుంచి వచ్చే వరకు కార్తీక్‌తో నా పెళ్లి అయిపోతుంది అని మోనిత అంది. సూర్యాపేట 8 రెస్టారెంట్‌కు ఎందుకు వెళ్తున్నావు అని దీప అడిగితే.. నా పెళ్లి కదా.. వంటలు బాగా చేయించడానికి వంటవాళ్ల కోసం వెళ్తున్నాను అని మోనిత సమాధానం చెప్పింది. దాంతో వంటలు బాగా చేయించుకో.. దోసకాయ పచ్చడి కూడా చేయించు.. పెళ్లిలో దోసకాయ పచ్చడి.. శ్మశానంలో నీ తలకాయ పచ్చడి.. నీ తలకాయ పచ్చడిని కుక్కలు, నక్కలు కూడా ముట్టయి అంటూ దీప దారుణంగా వ్యాఖ్యానించింది.

  నేను పిచ్చిదానిని కాదంటూ...

  నేను పిచ్చిదానిని కాదంటూ...


  దీపను దెప్పి పొడుస్తూ.. మొక్కు తీర్చుకోవడానికి దిక్కులేని దానిలా ఒంటరిగా వెళ్తున్నావు. కార్తీక్‌ను, పిల్లల్ని తీసుకెళ్లడం లేదు అని మోనిత అంటే.. కార్తీక్‌ను తీసుకెళ్తే పిరికివాడిలా పారిపోయావని అనుకొంటావు. అందుకే రేపు జరిగే రచ్చకు కాస్త ఎనర్జీ కావాలి కదా.. అందుకే నేనే ఒంటరిగా బయలుదేరాను అంటూ దీప చెబితే.. ఏమిటీ దీపలో ఇంత కాన్ఫిడెన్స్ అంటూ మోనిత ఆశ్చర్యపోయింది. దాంతో నోరు పెగలడం లేదు. మాట పడిపోయిందా? అని దీప అంటే.. అయ్యో.. నేను అంత పిచ్చిదానిని. పనికి మాలిన దానిని కాదు.. పవర్‌ఫుల్ లేడిని. ఉత్త మాటలకే పడిపోయే వీక్ మైండ్ నాది కాదు మోనిత కాన్ఫిడెన్స్‌ను ప్రదర్శించింది.

   చీరెలు, జాకెట్లుకు డిజైన్లు అంటూ మోనిత చులకనగా

  చీరెలు, జాకెట్లుకు డిజైన్లు అంటూ మోనిత చులకనగా

  ఇక దీపను మోనిత మాటలతో ఎటాక్ చేస్తూ.. పిచ్చి దీప.. నీవు ఇంత కాలం నీ లైఫ్‌ను డిజైన్ చేసుకొంటూ జాకెట్లు, చీరలకు డిజైన్లు చేసుకొంటూ బతికావు. కానీ నేను అలా కాదు. చాలా ప్రాక్టికల్‌గా.. మెటీరియలిస్ట్‌గా నా లైఫ్‌ను డిజైన్ చేసుకొన్నాను. నేను చాలా ప్రాక్టికల్.. నాకు సెంటిమెంట్స్ ఉండవు. నేను ఎంతకైనా తెగిస్తాను. కాబట్టి కాంప్రమైజ్ అయి కార్తీక్‌ను పెళ్లి కొడుకును చేయించి పంపించు. మొగుడు లేకుండా పదేళ్లు బతికావు కాబట్టి.. శ్రీనగర్ బస్తీలో శేష జీవితం గడుపు. ఇలా నాతో చచ్చు ఛాలెంజ్‌లు చేయకు అంటూ మోనిత ఘాటుగా స్పందించింది.

  Megastar Chiranjeevi, Vijayashanti బ్లాక్ బస్టర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ || Filmibeat Telugu
  నా పేరు దీపనే కాదు అంటూ...

  నా పేరు దీపనే కాదు అంటూ...

  మోనిత మాటలకు తనలో పెద్దగా నవ్వుకొన్న దీప.. చచ్చు లేదు.. పుచ్చు లేదు. పుచ్చు ముఖమా? రేపు అంటే ఉదయం 11.30 గంటలకు నీ బతుకు ఏమైపోతుందో చూడవే. కుక్కలు చింపిని విస్తరి కాకపోతే.. నా పేరు దీపనే కాదు. పోవే.. అంటూ వార్నింగ్ ఇచ్చింది. అప్పుడే అక్కడికి డ్రైవర్ వచ్చి.. ఏంటీ మేడం బొమ్మాలా నిలబడింది అంటే.. మోనితను కదిపి.. నీకు ఏమై పోయిందని డ్రైవర్ తమ్ముడు కంగారు పడుతున్నాడు. నీవు ముందు డ్రైవర్ తమ్ముడు పక్కన కూర్చొంటావా? లేక వెనుక అక్క పక్కన కూర్చొంటావా అంటూ దీప షాకిచ్చింది. దాంతో మోనిత డ్రైవర్ పక్కన కూర్చొని ముందుకు వెళ్లింది.

  English summary
  Karthika Deepam August 4th August's Episode preview. Latest episode of 1109 goes once again with emotional content.Monita is prepating for marriage with Karthik on 25th...In this occasion, High drama between Monita and Deepa while Suryapet Journey.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X