For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam July 15: మోనిత కుట్రలకు చెక్.. కోటింగ్ ఇస్తా అంటూ ప్రియకు ఏసీపీ వార్నింగ్

  |

  కార్తీకదీపం సీరియల్‌లో మోనిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో మలుపు తిరిగింది. కేసును టేకప్ చేసిన ఏసీపీ రోషిణి తనదైన శైలిలో విచారణ ప్రారంభించింది. ప్రియమణిని విచారణకు పిలిచి మోనిత గుట్టు లాగేందుకు ప్రయత్నించింది. అలాగే కార్తీక్, దీప మధ్య సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మోనిత పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని 1092 ఎపిసోడ్‌లో తెలుసుకొందాం..

  మోనితతో ఏసీపీ ఘాటుగా

  మోనితతో ఏసీపీ ఘాటుగా

  ఏసీపీ రోషిణి నువ్వు సృష్టించిన సమస్యను వారు పట్టించుకోకుండా సంతోషంగా ఉన్నారు. తాను తప్పు చేశాననే భావన కార్తీక్‌లో కనిపించడం లేదు. తన భర్త తప్పు చేశాడని భార్య దీప నమ్మడం లేదు. ఈ కేసు చాలా కాంప్లికేట్‌గా ఉంది. ఏసీపీ డ్యూటీ చేస్తే హండ్రెండ్ పర్సెంట్ చేస్తుంది. ఒక్కసారి కేసు టేకప్ చేస్తే దాని అంతు తేల్చేదాక వదిలిపెట్టదు. అర్ధమైందా అంటూ రోషిణి తీవ్రంగా మందలించింది.

  కంగారు పడిన మోనిత

  కంగారు పడిన మోనిత

  ఏసీపీ ఘాటుగా మాట్లాడటంతో డాక్టర్ మోనిత ముఖంలో కవలికలు మారిపోయాయి. నీ కడుపులో బిడ్డ ఉంది కాబట్టి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. ఎంక్వైరీలో నీవైపు తప్పు ఉంటే నీకు శిక్ష వాళ్ల వైపు తప్పు ఉంటే వాళ్లకు శిక్ష అని ఏసీపీ హెచ్చరించింది. ఏసీపీ గురించి ఈ నావైపు ఉందా? వాళ్లవైపు ఉందా అంటూ మోనిత తికమకపడిపోయింది.

  తింటే పరిష్కారం లభిస్తుందా?

  తింటే పరిష్కారం లభిస్తుందా?

  జనతా హాస్పిటల్‌లో కార్తీక్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. అంతలోనే దీప వచ్చి భోజనానికి పిలిచింది. అయితే నాకు ఆకలి లేదు అంటూ కార్తీక్ చెబితే.. ఆకలిగా లేదా ప్రస్తుత పరిస్థితులను చూసి తినాలని లేదా.. ఇలా అబద్దాలు ఆడకండి అలవాటు అయిపోతుంది. తినడం ఆపితే సమస్యకు పరిష్కారం లభిస్తుందా? అంటూ దీప అంటే తింటే పరిష్కారం లభిస్తుందా అని కార్తీక్ ఎదురు ప్రశ్న వేశాడు. ఇలాంటి స్థితిలో శాంతంగా ఉంటూ.. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి అంటూ దీప సలహా ఇచ్చారు.

  పిల్లలు ఇంటికి వెళ్లండి

  పిల్లలు ఇంటికి వెళ్లండి

  అయితే కార్తీక్ అలానే ఏదో ఆలోచిస్తూ ఉండటంతో...మామ గారు వస్తున్నారనే విషయంతో కంగారు పడుతున్నారా అంటే అవును అన్నారు. అయితే మీరు, పిల్లలు ఇంటికి వెళ్లండి అంటే.. మేము మాత్రమే వెళ్లాలా? నీవు రావా.. నాకు ఇంకో సమస్యను తెచ్చిపెడుతున్నావా? అంటే మీరు చెప్పింది పూర్తిగా వినండి.. వినడం చేస్తే అన్ని అర్ధమవుతాయి. మీరు ఇంటికి వెళ్లండి.. నేను ఒక ముఖ్యమైన పని ఉంది.. అక్కడికి వెళ్లి మామగారు వచ్చే లోపు అక్కడికి వచ్చేస్తాను అంటూ దీప చెప్పడంతో కార్తీక్ భోజనానికి సిద్ధమయ్యారు.

  లాకప్‌లోకి ప్రియమణి విచారణ

  లాకప్‌లోకి ప్రియమణి విచారణ

  మోనిత ఫిర్యాదుతో ఏసీపీ రోషిణి దర్యాప్తు వేగవంతం చేసింది. మోనిత వంట మనిషి ప్రియమణిని విచారించడం ప్రారంభించింది. నోరు విప్పి మాట్లాడితే అసలు విషయం బయటపడుతుంది అంటూ సీరియస్ అయింది. నేను సాధారణంగా కొట్టను. కానీ నోరు విప్పని వాళ్లకు కోటింగ్ ఇవ్వడానికి ఇద్దరు ఉన్నారు అంటూ హెచ్చరించింది. ఈ కేసులో నిజం చెప్పకోపోతే వాళ్లు తమ లాఠీలకు పనిచెబుతారు అంటూ వార్నింగ్ ఇచ్చింది. దాంతో నిజం చెబుతానని ప్రియమణి ఒప్పుకొన్నది. దాంతో ఫోన్ ఆన్ చేయవద్దు.. మోనితకు ఇక్కడ ఉన్నట్టు చెప్పవద్దు అంటూ మరోసారి వార్నింగ్ ఇచ్చింది.

  మోనితకు షాకిచ్చిన దీప, భాగ్యం

  మోనితకు షాకిచ్చిన దీప, భాగ్యం

  ఇక ప్రియమణి కనిపించకపోవడంతో మోనిత కంగారు పడిపోయింది. అదే సమయంలో మోనిత ఇంట్లోకి భాగ్యం, దీప ప్రవేశించారు. ఆ ఇద్దరు మోనిత చేసిన కుట్రలను బయటపెడుతూ గట్టి షాక్ ఇచ్చారు. దాంతో మోనిత గొంతులో వెలక్కాయ పడినట్టు అయింది. మోనితను దీప, భాగ్యం ఓ ఆట ఆడుకొన్నారు. ఇలా తాజా ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

  English summary
  ACP Roshini starts enquiry of Monita complaint in Karthika Deepam 15th July's Episode. Latest episode of 1092 goes once again with emotional content. Deepa, Soundarya talks about present situation abou Monita. Monita is prepating for marriage with Karthik on 25th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X