For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam దీప భుజంపై తలపెట్టి ఏడ్చిన కార్తీక్.. ప్రేమలో ముంచెత్తిన వంటలక్క!

  |

  కార్తీకదీపం సీరియల్ మరో మైలురాయిని దాటింది. ఈ సీరియల్ 1100 ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకొని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటూ దిగ్విజయంగా ముందుకెళ్తున్నది. తాజా ఎపిసోడ్‌ను మరోసారి ఎమోషనల్, పవర్ ప్యాక్ట్‌ అంశాలతో నింపేశారు. దీప, కార్తీక్, మోనిత మధ్య ఎమోషనల్ సీన్లు మరోసారి కనిపించాయి. తాజా ఎపిసోడ్ 1100లో ఇంకా ఏం జరిగాయంటే...

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar

  మానసికంగా దిగజారిన కార్తీక్

  మానసికంగా దిగజారిన కార్తీక్

  మోనిత ఇచ్చిన షాక్‌తో హాస్పిటల్‌లో చేరిన ఆనందరావుకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంటి సభ్యులంతా అక్కడే ఉండిపోయారు. డాక్టర్ గోవర్ధన్ వచ్చి ఆయనకు గుండెలో స్టంట్ వేయాలని సూచించడంతో కార్తీక్ ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేయమని తన సోదరుడు ఆదిత్యకు కార్తీక్ చెప్పాడు. అయితే తన ముఖం కూడా చూడటానికి ఇష్టపడకపోవడంతో కార్తీక్ మనోవేదనకు గురయ్యాడు. పూర్తిగా మానసికంగా దిగజారిపోయినట్టు కనిపించాడు. దాంతో దీప తనకు ధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దీపతో కార్తీక్ చాలా ఎమోషనల్‌గా తన భావాలను పంచుకొన్నారు.

  నాకు పాపం... శాపం తగిలింది

  నాకు పాపం... శాపం తగిలింది

  ఏం జరిగింది డాక్టర్ బాబూ అని అడిగితే.. తండ్రితో హాస్పిటల్‌లో జరిగిన విషయాన్ని దీపతో చెబుతూ.. నా పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. నా భార్య బిడ్డల్ని దూరం పెట్టినందుకు శాపం తగిలింది. ఆ పాపం ఇలా వెంటాడి వెలివేస్తున్నది. నాన్న ఏమైనా అంటే బాగుండేది. తిడితే, కొడితే ఏం అనిపించకపోయేది. కానీ వెళ్లగొడితేనే నరకంగా ఉంది. పాముతో స్నేహం చేస్తే నేను ఆ పుట్టలో పుట్టిన వాడిని అనుకొంటారు. మోనితతో చేసిన స్నేహం నన్ను ఏ స్థితికి తీసుకొచ్చిందో చూశావా. మోనిత వల్ల ఒక్కో అనర్థం జరగలేదు. అమ్మా, నాన్నలే కాదు సమాజం వెలివేస్తారు అని కార్తీక్ ఆవేదన మాట్లాడితే.. అలాంటిదేమీ జరగదు అంటూ మానసికంగా కార్తీక్‌కు దీప మానసికంగా భరోసాను ఇచ్చే ప్రయత్నం చేసింది.

  నిరాశపడకు కార్తీక్.. న్యాయం నీవైపే

  నిరాశపడకు కార్తీక్.. న్యాయం నీవైపే

  దాంతో నిరాశ పడకు.. న్యాయం నీపై ఉంది.. నేను నీవైపే ఉన్నాను అంటూ నవ్వుతూ దీప అనడంతో ఒక్కసారిగా దీప కళ్లలోకి చూస్తూ ఆమె భుజంపై తలవాల్చాడు. నన్ను ఇంకా దగ్గరికి తీసుకో. ప్రేమతో నన్ను ఇంకా దగ్గరికి తీసుకోని తలను ప్రేమగా నిమిరింది. దాంతో కార్తీక్ ఎమోషనల్ అయ్యారు. దీప కూడా ప్రేమతో భావోద్వేగానికి గురైంది. కార్తీక్‌కు ఊరట కలిగించేలా బయటకు వెళ్లి వద్దాం పదంటూ తీసుకొని బయటకు వెళ్లింది.

  మోనితకు షాకిచ్చిన కార్తీక్

  మోనితకు షాకిచ్చిన కార్తీక్

  దీపతో హాస్పిటల్ బయటకు వచ్చిన కార్తీక్‌పై భుజంపై చేయి వేసి... రా బయటకు వెళ్తాం. నీతో పని ఉంది అంటూ అంటూ మోనిత చేయి పట్టుకొన్నది. అయితే మా నాన్నకు ఇలా ఉంటే నీతో రావాలా? అని కార్తీక్ అంటే.. దీపతో బయటకు వెళ్లేటప్పుడు ఆ విషయం గుర్తుకు రాలేదు అంటూ మోనిత ఎదురు ప్రశ్నవేసింది. దాంతో హద్దు మీరి ప్రశ్నిస్తున్న మోనితను కోపంగా చూసి షటప్ అంటూ కార్తీక్ అరిచారు. దీప నీవు ఒకటేనా అంటూ కార్తీక్ ఆగ్రహంతో ప్రశ్నించాడు.

  ఈ పాపం నీదే అంటూ కార్తీక్

  ఈ పాపం నీదే అంటూ కార్తీక్

  కార్తీక్ మాటలకు మోనిత జవాబిస్తూ... దీప తన బిడ్డలను కడుపులో పెంచేసింది. నేను నీ బిడ్డను కడుపులో పెంచింది. కానీ తాళి లేకపోవడమే ఒకటే తేడా. అది కూడా 25 తేదీన నా మెడలో పడితే.. నేను దీప ఒక్కటైపోతాం అంటూ కార్తీక్‌ను చేయిపట్టి లాగింది. అయితే తాను రాను అంటూ కార్తీక్ ఈసడించుకొన్నాడు. వారి మధ్య జరుగుతున్న సంభాషణలో దీప జోక్యం చేసుకొంటూ.. మా మామయ్య ఆరోగ్యం ఇలా కావడానికి కారణం నువ్వే. ఏ విషయం చెబితే ఇలా అవుతుందోనని మేము ఆ విషయాన్ని దాచాం. కానీ నీవు ఆ విషయం చెప్పి తనను అలా హాస్పిటల్‌లో చేరేలా చేశావు అంటూ దీప కోపంతో ఊగిపోయింది. ఈ పాపం నీదే అంటూ కార్తీక్ కోపగించుకొన్నారు.

  ఏం ముఖం పెట్టుకొని అంటూ కార్తీక్ ఫైర్

  ఏం ముఖం పెట్టుకొని అంటూ కార్తీక్ ఫైర్

  దాంతో అలా అనకు కార్తీక్.. గుండెలో ఉన్న సమస్యకు కడుపులో ఉన్న బిడ్డకు సంబంధం అంటగట్టకు. నా కడుపులో ఉన్న బిడ్డ గురించి చెబితే ఆయన గుండెలో ఉన్న జబ్బు బయటపడుతుందని కలగంటానా? అని మోనిత ఏదో చెప్పబోతుంటే.. ఏయ్ ఇక మాటలు లేవు.. నాకు భగభగ మండిపోతుంది. ఇంత చేసి నువ్వు ఏమీ ముఖం పెట్టుకొని వచ్చావు. మామయ్య ప్రాణాలు రిస్క్‌లో పెట్టి.. నీవు ఏం లబ్ది పొందాలని చూస్తున్నావు అంటూ దీప రగలిపోయింది.

  అంజి ఉంటే బాగుండు.. అంటూ

  అంజి ఉంటే బాగుండు.. అంటూ

  అయినా కార్తీక్‌ను బయటకు తీసుకెళ్లడానికి మోనిత ప్రయత్నించగా.. నేను రాను అంటూ మోనిత చేయిని విసిరికొట్టాడు. కార్తీక్ అలా ఎలా మాట్లాడుతావు.. అంటే.. కార్తీక్ నీవు వెళ్లు.. ఆమె పెళ్లి పనులకు నిన్ను తీసుకెళ్తుంది. నేను దాని పెళ్లి పెటాకులు చేయడానికి నిన్ను తీసుకెళ్దామనుకొన్నాను. ఈ టైమ్‌లో కారు డ్రైవర్ అంజి ఉంటే బాగుండు. కారులో వెళ్లేదాన్ని. దీని పెటాలకు విషయంలో సహాయపడి ఉండేవాడు అని దీప అని అనగానే మోనిత ముఖంలో రంగులు మారాయి. ఏంటీ.. దీప కాన్ఫిడెన్స్.. అంటూ మోనిత ఆందోళన పడిపోయింది.

  Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
  మోనితను హడలెత్తించిన దీప

  మోనితను హడలెత్తించిన దీప

  కార్తీక, దీప కౌంటర్లకు మోనిత బెదిరిపోయింది. కానీ తనను తాను తమాయించుకొని.. మామయ్యకు ఆపరేషన్‌లో స్టంట్ వేసినా.. మీరు ఎన్ని స్టంటులు వేసినా నా పెళ్లిని ఆపలేరు అంటూ మోనిత అంటే.. దీప నవ్వుతూ తనపైపు చూసింది. ఆ చూపులకు భయపడిపోయిన మోనిత.. ప్రతీసారి అంజి విషయాన్ని బయటకు తెస్తుంది అంటూ కంగారు పడిపోయింది. ఆ తర్వాత ముగ్గురు తలోవైపు వెళ్లిపోయారు.

  English summary
  Karthika Deepam 24th July's Episode preview. Latest episode of 1098 goes once again with emotional content.Monita is prepating for marriage with Karthik on 25th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X