For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam episode 1105: అక్కా అంటే బాడీలో ముక్క కూడా మిగలదు.. మోనితకు దీప గట్టిగా వార్నింగ్

  |

  కార్తీకదీపం సీరియల్‌లో మోనిత చేస్తున్న కుట్రలకు చెక్ పెట్టేందుకు దీప చేసిన ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అంజి వ్యవహారం, మ్యారేజ్ రిజిస్ట్రార్ దుర్గా ప్రసాద్ ఫోన్, ఏసీపీ రోషిణి ఫోన్ మోనితను ఉక్కిరి బిక్కిరి చేశాయి. అంతలోనే మోనిత ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి మరో షాక్ ఇచ్చింది. ఇలాంటి ట్విస్టులు, ఎమోషనల్ సీన్లతో 1105 ఎపిసోడ్‌లో ఎలా సాగిందంటే..

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   గుంట నక్కలకు అక్కలు ఉండరే..

  గుంట నక్కలకు అక్కలు ఉండరే..

  దీపను చూసి కంగారు పడిన మోనితను చూస్తూ.. భయాన్ని కంగారును బలవంతంగా అణిచిపెట్టుకొని నా ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నావంటే అని దీప అంటే.. అక్క వచ్చి కాఫీ అడుగుతుంటే మాట మాట్లాడకుండా నిలుచుంటావంటి అంటూ ప్రియమణిని మోనిత బెదిరించింది. మోనిత మాటలకు సమాధానం ఇస్తూ అక్క అంటే నీ శరీరంలో ఒక ముక్క కూడా మిగలదనే విషయం నీకు ఇంకా అర్ధం కాలేదా? గుంట నక్కలకు అక్కలు, చెల్లెల్లు ఉండరే పిచ్చి దానా అంటే అని మోనిత తలమీద మొట్టికాయ వేసేందుకు ప్రయత్నించింది. దాంతో మోనిత సోఫాలో కూలపడిపోయింది. దాంతో తల మీద మొట్టికాయ కూడా గట్టిగా తగులుతుందని భయపడ్డావా అంటూ దీప ప్రశ్నించింది. అక్క అన్నంత మాత్రాన నిన్ను నా భర్త పెళ్లి చేసుకొంటారని ఆశపడకు అంటూ దీప షాక్ ఇచ్చింది.

   మోనిత నిన్ను చూస్తే జాలివేస్తుంది..

  మోనిత నిన్ను చూస్తే జాలివేస్తుంది..

  పెళ్లికి రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అంజి అభ్యంతరం తెలిపిన విషయంపై అనేక అనుమానాలు మోనిత మనసులో రన్ అవుతున్నాయి. దుర్గాప్రసాద్‌కు అంజితో దీప ఫిర్యాదు చేయించిందా అంటూ మోనిత మనసులో అనుకోవడం కనిపించింది. దాంతో నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తే నవ్వొస్తుంది అని మోనిత అంటే.. నిన్ను చూస్తే జాలివేస్తుంది అంటూ దీప కౌంటర్ ఇచ్చింది. నీకు ఫోన్ వచ్చిందా అంటే.. దీప అంటే... మోనిత షాక్ తిన్నది. దుర్గా ప్రసాద్ నుంచి వచ్చిన ఫోన్ గురించా? లేదా ఏసీపీ రోషిణి గురించి వచ్చిన ఫోనా అంటూ కంగారు పడిపోయింది.

   ఏసీపీ ఫోన్‌తో మోనితలో కంగారు

  ఏసీపీ ఫోన్‌తో మోనితలో కంగారు

  అంతలోనే ఏసీపీ రోషిణి నుంచి ఫోన్ మోగింది. దాంతో మోనిత కంగారు పడిపోయింది. ఏసీపీ నుంచి ఫోన్ వస్తే అలా గుడ్లప్పగించి చూస్తున్నావేంటే డాక్టర్ పాప అనగానే మోనిత ఫోన్ ఎత్తింది. అటు నుంచి ఏసీపీ మాట్లాడుతూ.. బయలు దేరావా అంటూ సీరియస్ అయింది. మోనిత కంగారు పడుతూ అవును బయలుదేరుతున్నాను అంటూ సమాధానం ఇచ్చింది. నీ కోసం కూడా వెయిట్ చేయాలా? త్వరగా రా అంటూ కోపంతో వార్నింగ్ ఇచ్చినంత పని చేసింది. ఫోన్ పెట్టేసి చిటికెలు వేస్తూ.. ఇప్పుడు నేను ఏసీపీ రోషిణి వద్దకు వెళ్తున్నాను.. నిన్ను, కార్తీక్‌ను, మొత్తం నీ ఫ్యామిలీని అంతు చూస్తాను అంటూ మోనిత ఛాలెంజ్ చేసింది.

  నీ చిలుక పలుకులు అక్కడే..

  నీ చిలుక పలుకులు అక్కడే..

  మోనిత వేసిన చిటికెలకు కౌంటర్‌గా దీప చిటికెలు వేస్తూ.. ఆగు.. వెళ్తున్నాను కాదు.. వెళ్తున్నాను. నేను వస్తున్నాను. మేడం నాకు కూడా కాల్ చేసి నన్ను కూడా రమ్మన్నారు. రామ్మ.. చిలకమ్మ. నీ చిలక పలుకులు అక్కడ వినిపిద్దువు పద.. అక్కడ అంజి నీ పాత కథల గురించి ఏం చెబుతున్నారో... నీవు చెల్లివి అవుతావో... చంచల్‌గూడ జైలు ఖైదీవి అవుతావో చూద్దాం అంటూ మెడపట్టుకొని మోనితను దీప లాక్కెల్లింది.

   మేడం ఎందుకు రమ్మన్నారంటూ...

  మేడం ఎందుకు రమ్మన్నారంటూ...


  తన ఇంటికి వచ్చిన మోనిత, దీపను ఏసీపీ రోషిణి వెల్‌కమ్ చెప్పింది. ఇద్దరు రావడం చూసి కంగారు పడిన ఏసీపీ రోషిణి.. ఈ కాంబినేషన్ ఏమిటి? అంటే.. మీ అపాయింట్‌మెంట్ లేకుండా వచ్చాను. అంటే.. నీకు అపాయింట్‌మెంట్ అవసరం లేదు. కానీ ఇద్దరిలో ఎవరు ఎవరిని తీసుకువచ్చారు? అంటే నేను మోనితను కలువడానికి వచ్చాను.. అంతలోనే మీ ఫోన్ వచ్చింది.. దాంతో ఇద్దరం కలిసి వచ్చాం అని దీప అంటే.. ఇంకా నేను జీర్ణించుకోవడం లేదు అంటూ అంటుండగా.. ఏంటి మేడం మీరు ఎందుకు రమ్మన్నారు అంటే.. అంజి అంటూ ఏసీపీ షాక్ ఇచ్చింది.

   కత్తిలాంటి డ్రైవర్ అంజితో

  కత్తిలాంటి డ్రైవర్ అంజితో


  అంజి కత్తిలాంటి డ్రైవర్. పూర్వాశ్రమంలో డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తాడు. ఎవరినైనా లేపేస్తాడు. అలాంటి అంజి మీకు ఎలా తెలుసు? అని ఏసీపీ రోషిణి అంటే.. నాకు పెద్దగా అతడి పరిచయం లేదు అని మోనిత అంది. అంటే చిన్న పరిచయం ఉందా.. నీకు ఎలా పరిచయం అంటూ ప్రశ్నించింది. కార్తీక్ డ్రైవర్‌గా పనిచేసేవాడు అలా పరిచయం అంటే.. ఆ పరిచయంతోనే రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి కంప్లైయింట్ చేశాడా? అని మోనితను ఏసీపీ ప్రశ్నించగానే ఆమె కంగారు పడిపోయింది.

   డ్రైవర్‌తో పెళ్లి ఏమిటి? అంటూ మోనిత

  డ్రైవర్‌తో పెళ్లి ఏమిటి? అంటూ మోనిత

  అంజి నిన్ను ప్రేమించాడా? పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాడా? అంటే ఛీ ఛీ డ్రైవర్‌తో ప్రేమేంటి? అంటే అతడు పెళ్లి చేసుకోవాలని అనుకొన్నాడా? నీవు అభ్యంతరం చెప్పావా? మరీ నీ పెళ్లిపై ఎందుకు అడ్డుకొంటున్నాడు అంటూ ఏసీపీ ప్రశ్నల వర్షం కురిపించింది. దాంతో మోనిత కంగారు పడిపోతూ డ్రైవర్‌ను పెళ్లి చేసుకోవడం ఏమిటి అంటూ ఒక లాంటి భయంతో కంగారు పడిపోయింది. మోనిత కంగారును, ఏసీపీ రోషిణి ప్రశ్నించడం చూసి దీప ముసి ముసిగా నవ్వుతూ ఉండిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందనే ట్విస్టును సీరియల్‌లో కొనసాగిస్తూ ఎపిసోడ్‌ను ముగించారు.

  Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu

  English summary
  Karthika Deepam 30th July's Episode preview. Latest episode of 1105 goes once again with emotional content.Monita is prepating for marriage with Karthik on 25th...
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X