For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam పాము పగకు.. నా పగకు తేడా ఒక్కటే.. మిగితాదంతా సేమ్ టు సేమ్.. సునామీకి మోనిత రెడీ

  |

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  బుల్లి తెరపై మోస్ట్ పాపులారిటీ సీరియల్ కార్తీకదీపంలో తాజా ఎపిసోడ్ కీలకంగా మారింది. మోనిత ఇచ్చిన డెడ్‌లైన్ దగ్గరపడటంతో సౌందర్య, కార్తీక్, దీపలో టెన్షన్ పెరిగిపోయినట్టు కనిపించింది. అలాగే మోనిత తాను ఏం చేయాలనే ప్లాన్స్ రెడీ చేసుకొన్నది. సీరియల్ మొత్తంలో అత్యంత భావోద్వేగంగా మారిన 1074లో మోనిత ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే..

  గడువు తీరడానికి రెండే రోజులు

  గడువు తీరడానికి రెండే రోజులు

  మోనిత తనలో తాను మాట్లాడుకొంటూ.. నేను కార్తీక్‌కు పెట్టిన గడువు పూర్తవ్వడానికి ఇంకా రెండే రోజులు మిగిలి ఉన్నాయి. మూడో రోజు ఈ సమయానికి అంటూ మోనిత సంతోషంలో మునిగిపోయింది. తలచుకొంటుంటే ఆనందంతో ఒళ్లు పులకరించిపోతుంది. నన్ను నోటికి వచ్చినట్టు తిట్టిన దీప, సౌందర్య నోళ్లు మూతపడుతాయి. ఏం చేయలేక, నాకు పట్టిన అదృష్టాన్ని ఓర్వలేక ఏడ్చి ఏడ్చి చస్తారు అంటూ తనలో తాను మోనిత మాట్లాడుకొంటూ ఆశల పందిరిని నిర్మించుకొన్నట్టు కనిపించింది.

  దీపను నీకెలా దక్కనిస్తాను..

  దీపను నీకెలా దక్కనిస్తాను..

  కార్తీక్ నీకు దీప కావాలా? నో వే.. నేను ఉండగా,, తనను నీకేలా దక్కనిస్తాను అంటూ తనలో తాను నవ్వుకొంటూ.. ప్రియమణి.. ప్రియమణి... అంటూ పనిమనిషిని పిలిచింది. ప్రియమణి రాగానే.. నాకు వేడి నీళ్లు పట్టుకుని రా అంటూ మోనిత చెప్పితే... వేడి నీళ్లు ఎందుకు వేడి వేడి కాఫీ పట్టుకొస్తాను అంటూ ప్రియమణి చెబితే.. అదే నాకు నచ్చదు.. నేను చెప్పింది చేయి.. నీకు ఇష్టం వచ్చిందే చేయాలంటే నాకు నచ్చుదు అంటూ మోనిత కోపగించుకొన్నది.

  దీప గతి ఏమైందో తెలుసా?

  దీప గతి ఏమైందో తెలుసా?

  మోనిత తన ఏంటో ప్రియమణికి వివరిస్తూ.. నాకు నచ్చనందుకే దీప గతి ఏమైందో తెలుసు కదా.. పాము పగకు, మోనిత పగకు తేడా ఏమిటో తెలుసా?... అది చెప్పకుండా కాటేస్తుంది.. నేను చెప్పి కాటేస్తాను. మిగితా వన్నీ సేమ్ టూ సేమ్. అర్ధమైందా అంటూ మోనిత ప్రశ్నిస్తే.. అలాగే అంటూ ప్రియమణి తల ఆడించింది. దాంతో ఒక వెళ్లి వేడి నీళ్లు తీసుకురా అన్నట్టు మోనిత సైగ చేసింది.

  నా ఫోన్ కట్ చేస్తాడా?

  నా ఫోన్ కట్ చేస్తాడా?

  ఆ తర్వాత కార్తీక్‌కు మోనిత ఫోన్ కాల్ చేస్తే అతడు కట్ చేస్తుండటంతో ఆమె కోపంతో ఊగిపోయింది. నేనంటే కార్తీక్ అంత చులకనా? నేను ఫోన్ చేస్తే కట్ చేస్తాడా? నన్ను పట్టించుకోవద్దని అనుకొంటున్నారా అంటూ తనలో తాను ఊగిపోయింది. నేను ఉన్న స్థితిని పట్టించుకోకుండా.. దీప స్థితిని చూసి జాలి పడుతున్నాడా?? అంటే.. కార్తీక్‌కు ఎంత చెప్పినా చెవికి ఎక్కించుకోవడం లేదనుకొంటా.. చెప్తా.. తనే నా చుట్టు తిరిగేలా చేస్తా.. అంటూ క్యాలెండర్ వద్దకు వెళ్లి.. 25వ తేదీ వేలుపెట్టి.. అదే తగిన ముహుర్తమని ఫిక్స్ అయినట్టు కనిపించింది. మార్కర్‌తో దానిని రౌండప్ చేసింది. కార్తీక్... ఈ డేటే నీకు డెడ్ లైన్.. బీ రెడీ అంటూ వార్నింగ్ ఇచ్చింది.

  సున్నా కాదే.. సునామీ అంటూ మోనిత

  సున్నా కాదే.. సునామీ అంటూ మోనిత

  మోనిత 25వ తేదీని రౌండప్ చేయడాన్ని చూసిన ప్రియమణి.. తన అనుమానం తీర్చుకోవడానికి అమ్మా... క్యాలెండర్‌లో అన్ని తేదీలు ఉన్నాయి కదా.. పనిగట్టుకొనే ఆ తేదీని సున్నా చుట్టడానికి కారణమేమిటి? అని ప్రియమణి అడిగింది. అయితే అది సున్నా కాదే వెర్రిదానా.. సునామీ అంటూ తన మార్కు విలనిజాన్ని మోనిత ప్రదర్శించింది. ఆ రోజు నేను సృష్టించబోయే సునామీతో నీ కార్తీక్ అయ్యా.. నా కాళ్ల దగ్గరకు రాక తప్పదు. నా మెడలో తాళి కట్టకతప్పదు.. నీవు వెళ్లి స్ట్రాంగ్ కాఫీ పట్టుకొని రా.. అది తాగుతూ.. నేను సృష్టించబోయే సునామీకి ప్లాన్స్ వేసుకోవాలి అంటూ మోనిత చెప్పింది.

  ఏందో ఈ డాక్టరమ్మ.. అంటూ ప్రియమణి

  ఏందో ఈ డాక్టరమ్మ.. అంటూ ప్రియమణి

  దాంతో మోనిత పరిస్థితిని అంచనా వేయలేకపోయిన ప్రియమణి.. తనలో తాను గొణుక్కొంటూ... నేను అర్ధం చేసుకొందామని అనుకొనే లోపే.. ఏదో ఒక పని చెబుతుంది. ఏంటో ఈ డాక్టరమ్మ.. అంటూ విసుక్కొన్నది. దాంతో కాఫీ తెస్తున్నావా లేవా అంటూ మోనిత అరిచింది. ఆ తర్వాత కార్తీక్ నీ పని అయిపోయిందంటూ.. చేతిని పిస్టల్‌గా చేసి క్యాలెండర్‌లోని 25వ తేదీకి గురిపెట్టి కాల్చినట్టు ఫోజు పెట్టింది. ఇలా మోనిత తన ప్లాన్స్ సిద్దం చేసుకొన్నట్టు కనిపించింది.

  25 తేదీన నా పెళ్లి అంటూ షాక్

  25 తేదీన నా పెళ్లి అంటూ షాక్

  ఇక సౌందర్య ఇంటికి వెళ్లి ఆమెకు కూడా మోనిత వార్నింగ్ ఇచ్చినంత పనిచేసింది. 25వ తేదీ కార్తీక్‌తో నా పెళ్లి అంటూ షాకిచ్చింది. సౌందర్య కాళ్లపై పాదాభివందనం చేసి నన్ను ఆశీర్వదించండి అంటే.. సౌందర్య టెన్షన్ గురై పట్టించుకోలేదు. ఇలా మోనిత కార్తీక్‌ను తన వాడిగా చేసుకొనేందుకు రకరకాల వ్యూహాలతో ముందుకెళ్తున్నది.

  English summary
  Karthika Deepam 24th June's Episode of 1074 goes with emotional content.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X