For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam తప్పు తప్పుతో కలిస్తే తప్పు.. నీవు నిప్పువా? మోనితను కడిగి పడేసిన సౌందర్య

  |

  కార్తీక దీపం సీరియల్‌లో మోనిత ఎత్తులకు సౌందర్య పై ఎత్తు వేసే ప్రయత్నం చేసింది. తన ఇంటికి వచ్చిన మోనితను నా కుమారుడు కార్తీక్ నాకు అంతా చెప్పాడు అంటూ బాంబు పేల్చింది. దాంతో మోనిత షాక్ అయింది. ఏం చెప్పాడంటూ అడిగితే.. ముందు జ్యూస్ తాగితే చెబుతాను అంటూ సౌందర్య బదులు ఇచ్చింది. తాజాగా 1075 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

  తప్పు చేశానంటే నమ్మలేకపోతున్నా

  తప్పు చేశానంటే నమ్మలేకపోతున్నా

  జ్యూస్ తాగిన మోనిత.. కార్తీక్ ఏం చెప్పాడు అంటూ సౌందర్యను అడిగింది. అందుకు సమాధానంగా నీకు తెలిసినా కూడా తెలియనట్టు నటించకు. నీకు వాడు చెప్పిన నిజం నీకు తెలుసు అని సౌందర్య అంటే.. ఏ నిజం అంటూ మోనిత ప్రశ్నించింది. కార్తీక్ నాతో మాట్లాడుతూ.. నేను ఈ తప్పు చేసినంటే నమ్మలేకపోతున్నాను మమ్మీ.. ఇదేలా జరిగిందో నాకు తెలియదు అని అన్నాడు అని సౌందర్య సమాధానం చెప్పడంతో మోనిత షాక్ అయింది. Photo Courtesy: Star మా and Disney+Hotstar

  నీవు కన్నెపిల్లవు కాదుని..

  నీవు కన్నెపిల్లవు కాదుని..

  మోనిత నువ్వే చెప్పు.. నేను ఇంకా లోతుగా వివరంగా డిస్కస్ చేయగలను. కాకపోతే నువ్వే ఒక గైనకాలజిస్టువు కాబట్టి నీకే ఎక్కువ తెలుసు. నీవు చంటి పిల్లవు కాదు.. నేను చిన్న పిల్లను కాదు. ఇక నీవు కన్నెపిల్లవు అసలే కాదని అంటే... దానికి కారణం కాదని కార్తీక్ నేనంటే.. అందుకు కారణం కాదని నేనంటే.. ఇప్పుడు ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది అంటూ సౌందర్య నిలదీసింది. Photo Courtesy: Star మా and Disney+Hotstar

  కార్తీక్‌కు పొంచి ఉన్న ముప్పువా?

  కార్తీక్‌కు పొంచి ఉన్న ముప్పువా?

  తప్పు గురించి తప్పుడు సమాచారం సృష్టించావా? తప్పుటడుగు వెనుక తప్పు అని సరైన కారణమని కనిపెట్టావా? తప్పు తప్పుతో కలిస్తేనే తప్పు. ఇది తప్పా? నీవు నిప్పా? వాడికి నీవు పొంచి ఉన్న ముప్పా? వాడు అలా ఎందుకు అనాల్సి వచ్చింది మోనితా? ఈ విషయం వ్రతం జరుగుతుండగా వచ్చి.. వాడి భార్య ముందు చెప్పగానే వాడు దోషిలా తలదించుకోలేదు సరికదా.. నీకే చివాట్లు పెట్టాడు. ఆ నిజాయితీ వాడి కళ్లలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూశాను. ఎందుకు వాడు ఏమీ తెలియదని అంటున్నాడు అంటూ సౌందర్య నిలదీసింది. Photo Courtesy: Star మా and Disney+Hotstar

  సౌందర్యపై మోనిత ఎదురుదాడి

  సౌందర్యపై మోనిత ఎదురుదాడి

  సౌందర్య ప్రశ్నల నుంచి మోనిత తేరుకొని.. ఎదురుదాడి చేయడం ప్రారంభించింది. భేష్ అంటీ.. నిదానంగా ఒక్కో ఇటుక పేర్చి.. ఎవరు కూల్చలేని గొడను నాకు కార్తీక్‌కు మధ్య కడుతున్నారు. ఏ పరిస్థితుల్లో ఇది జరిగిందో తెలిసి కూడా తప్పుడు సమాచారం సృష్టించావా అని ప్రశ్నిస్తున్నావు. సృష్టించడానికి పురాణ కాలం నాటి స్త్రీని కాదు. ఈ నిజాన్ని రుజువు చేసుకోవాలంటే ఏ వేదికను కావాలంటే ఆ వేదికను ఆశ్రయించవచ్చు అంటూ సౌందర్యకు కౌంటర్ ఇచ్చింది. Photo Courtesy: Star మా and Disney+Hotstar

  దీపను అనుమానించినప్పుడు..

  దీపను అనుమానించినప్పుడు..

  నా కడుపులో పెరుగుతున నిజాన్ని దాచడం సాధ్యమా? మీరు కూడా ముగ్గుర్ని కన్నారు కదా?? మీ అబ్బాయి దీపను అనుమానించినప్పడు ఇది నిజమని నమ్మారా? అప్పుడు మీ కొడుకు నమ్మని మాటను.. నా విషయంలో నమ్ముతున్నారా? ఇంతకాలం పర్‌ఫెక్ట్ అనుకొన్నాను. స్త్రీల పట్ల అభిమానం చూపిస్తారని అనుకొన్నాను. ఈ విషయం చెబితే నన్ను సపోర్ట్ చేస్తారని నమ్మాను. కానీ మీరు సగటు తల్లిగా మారిపోయారు అని మోనిత గట్టిగా సమాధానం ఇచ్చింది. Photo Courtesy: Star మా and Disney+Hotstar

  25వ తేదీన కార్తీక్‌తో నా పెళ్లి

  25వ తేదీన కార్తీక్‌తో నా పెళ్లి

  కార్తీక్‌తో చేతులు కలిపి నాకు అన్యాయం చేయదల్చుకొన్నారు. ఇక ఈ విషయంలో నిజం నా కడుపులో ఉంది కాబట్టి.. నేను ఎవరినీ న్యాయం కోసం సలహాలు అడగదలచుకోలేను అని మోనిత అంటే.. ఏం చేయదలుచుకొన్నావు అని సౌందర్య ప్రశ్నించింది. దాంతో రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్లున్నాను. 25వ తేదీన కార్తీక్‌తో నా పెళ్లి. కార్తీక్‌తోపాటు నేను అక్షింతలతో వస్తాం. మమల్ని దీవించడానికి రెడీగా ఉండండి.. నన్ను ఆశీర్వదించండి అంటూ సౌందర్య కాళ్లపై మోనిత పడింది. Photo Courtesy: Star మా and Disney+Hotstar

  English summary
  Karthika Deepam 25th June's Episode of 1075 goes with emotional content.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X