twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam మీరు లేకుండానే చనిపోతామేమో.. తల్లి మాటలతో కార్తీక్, దీప కన్నీళ్లు

    |

    కార్తీకదీపం సీరియల్‌లో మరోసారి భావోద్వేగమైన సన్నివేశాలు కనిపించాయి. ఇంటి నుంచి చెప్పపెట్టకుండా వెళ్లి వచ్చిన కార్తీక్, దీపను తల్లి సౌందర్య నిలదీసింది. చిన్నారి ఆనందరావు కనిపించకపోతేనే మీరు ఎంత కంగారు పడ్డారో.. అలాంటిది నీ తల్లి ఎంత బాధపడిందో మీరు కనీసం ఆలోచించారా? అని సౌందర్య ప్రశ్నించింది. ఇక హైదరాబాద్‌కు వెళ్లిపోదాం అంటూ సౌందర్య పట్టుపట్టింది. తాజా ఎపిసోడ్ 1272లో ఇంకా ఎలాంటి ఎమోషనల్ కంటెంట్ ఉందంటే..

    పట్టుదల నీకే ఉందా కార్తీక్ అంటూ

    పట్టుదల నీకే ఉందా కార్తీక్ అంటూ

    హిమను ఎవరో తీసుకెళ్తే ఎంత కంగారు పడ్డారో.. ఎన్ని కన్నీళ్లు పెట్టుకొన్నారో తెలుసా? మీరు ఇంటి నుంచి వెళ్లిపోతే నేను ఎంత బాధపడ్డామో.. ఎన్ని సార్లు కన్నీళ్లు పెట్టుకొన్నామో తెలుసా? మీరు మాట్లాడకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతామని అనుకొంటున్నారా? మీకే అంత పట్టుదల మొండితనం ఉంటే.. ఒరేయ్ పెద్దోడా.. నీ అమ్మను రా.. నాకు ఎంత పట్టుదల ఉంటుందో తెలుసా? ఇంటి నుంచి వెళ్లిపోవడం, సెల్‌ఫోన్ పడేయడం నీ ఒక్కడికే తెలుసా అంటూ కార్తీక్‌ను సౌందర్య నిలదీస్తూనే తన గుండెలోని ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ పని నేను, మీ డాడీ కూడా చేయగలం అంటూ సౌందర్య బెదిరించింది.

    హైదరాబాద్‌కు రాకపోతే అంటూ..

    హైదరాబాద్‌కు రాకపోతే అంటూ..

    తల్లి సౌందర్య మాటలకు కార్తీక్ అడ్డుపడుతూ ఏంటి మమ్మీ.. అని కార్తీక్ కంగారు పడ్డాడు. దాంతో మీరు హైదరాబాద్‌కు రాకపోతే నేను, మీ నాన్న ఎక్కడికైనా వెళ్లిపోతాం. అవసరమైతే ఇద్దరం కలిసి అంటూ ఏదో అనబోతుంటే.. మమ్నీ అంటూ సౌందర్య నోరు మూశాడు. ఇంకోసారి నీవు అలా మాట్లాడవద్దు అంటూ కార్తీక్ అన్నాడు. దాంతో మనం హైదరాబాద్‌కు వెళ్తున్నామా? లేదా అంటే.. నీ ఇష్టం మమ్నీ అంటూ కార్తీక్ చెప్పడంతో సౌందర్య ఆనందంలో మునిగిపోయింది.

    నానమ్మ మాటలే విందాం అంటూ హిమ, శౌర్య

    నానమ్మ మాటలే విందాం అంటూ హిమ, శౌర్య

    రుద్రాణి మనుషులు తనను ఎత్తుకెళ్లిన సంఘటనను గుర్తు చేసుకొని హిమ కన్నీళ్లు పెట్టుకొన్నది. నానమ్మ రాకపోతే నన్ను రుద్రాణి వదిలిపెట్టకపోయేది అని హిమ అంటే.. నాన్నమ్మ వచ్చింది కదా.. ఇక ఎందుకు ఏడవడం.. ఎలాగు మనం హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నాం కదా.. ఇక నుంచి మనకు ఎలాంటి కష్టాలు ఉండవు అని శౌర్య అంటే.. అవును మనకు పెద్ద ఇల్లు.. ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. మనం హ్యాపీగా ఉంటాం. ఇక నుంచి నాన్నమ్మ మాటలే విందాం అని హిమ అంటే.. మమ్మీ, డాడీ మాటలు వినవద్దా అని శౌర్య ప్రశ్నించింది. అయితే అమ్మ, నాన్న మాటలు విందాం కానీ నాన్నమ్మను అడిగి తెలుసుకొందాం. నాన్నమ్మ చెప్పిన మాటలే పాటిద్దాం అంటూ హిమ చెప్పింది.

    దీపను నిలదీసిన సౌందర్య

    దీపను నిలదీసిన సౌందర్య

    ఇక కార్తీక్, దీప, పిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తాము ఎలాంటి బాధలుపడ్డామనే విషయాన్ని సౌందర్య తన కొడుకు, కోడలితో చెప్పుకొని ఆవేదన చెందింది. మీరు లేకపోతే మేము మీ వస్తువులను చూసుకొంటూ బతికాం. నేను ప్రకృతి వైద్యశాలకు వస్తుంటే.. నీ వస్తువులను వెంట తెచ్చుకొన్నాను అని చెప్పారు. అయితే దీప.. కనీసం నీవు అయినా కార్తీక్‌కు నచ్చ చెప్పాలి కదా.. అత్తయ్య, మామలు ఎలా ఉన్నారో ఆలోచించావా? ఒక్కసారైనా ఎవరి ఫోన్‌ నుంచైనా మేము బాగున్నామని ఒక్కమాట చెప్పి ఉంటే బాగుండేది కదా అని నిలదీసింది.

    మీరు లేకుండానే చనిపోతామేమో అంటూ సౌందర్య

    మీరు లేకుండానే చనిపోతామేమో అంటూ సౌందర్య

    కార్తీక్ పర్సు తీసుకొని ఎమోషనల్ సౌందర్య అయింది. మీ నాన్న పర్సు తీసుకొని అందులో మీ అమ్మా, నాన్నల ఫోటోను చూసి ఆనందపడే వాళ్లం అని సౌందర్య చెప్పారు. నీ పర్సులో ఉన్న డబ్బును తీసుకొని వెళ్లి.. దీప తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకురా.. అని చెబితే.. ఆ డబ్బు తీసుకొని వెళ్లి బంగారం విడిపించుకు రావాలంటే సిగ్గుగా ఉంది. డబ్బు ఉన్నా లేకున్నా అందరం కలిసి హ్యాపీగా ఉందాం. ఆశ్రమంలో ఉన్నప్పుడు మీరు లేకుండానే చనిపోతామేమో అనుకొన్నాం అని సౌందర్య అంటే.. అలా అనకు మమ్మీ అంటూ కార్తీక్ అన్నాడు.

    తాకట్టు పెట్టిన దీప బంగారాన్ని

    తాకట్టు పెట్టిన దీప బంగారాన్ని

    తల్లి సౌందర్య సూచనతో తాకట్టు పెట్టిన బంగారాన్ని కార్తీక్ విడిపించుకువచ్చాడు. దాంతో నీ సంపాదించిన డబ్బుతోనే బంగారాన్ని విడిపించుకొచ్చావు అని దీప అంటే.. నా వాళ్ల నీవు చాలా కష్టాలు పడ్డావు. మీరు, అత్తయ్య ఎంత మంచివాళ్లు అంటే.. నా వల్లే చాలా కష్టపడ్డావు. నీవే మంచిదానివి. నాకు మంచి భార్యవు అంటూ కార్తీక్ అన్నాడు. అయితే ఆనంద్ రావు‌ను శ్రీవల్లి, కోటేశ్ ఎక్కడి నుంచి తెచ్చుకొన్నారో చెప్పారా? అంటే లేదు అంటూ కార్తీక్ అన్నాడు.

    రుద్రాణి మళ్లీ ఓ ట్విస్టు

    రుద్రాణి మళ్లీ ఓ ట్విస్టు

    హైదరాబాద్‌కు కార్తీక్ తన కుటుంబంతో బయలుదేరే సమయంలో రుద్రాణి ఇంట్లోకి అడుగు పెట్టింది. చెక్ ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు వెళ్లిపోతే.. ఎలా.. మీ చెక్ నాకు వద్దు... అమ్మా నన్ను క్షమించండి. డాక్టర్ బాబు నన్ను మీరు క్షమించాలి. దీపమ్మ నన్ను మన్నించమ్మా? డబ్బు, అధికారం అంటే పిచ్చి. అహంకారంతో మిమ్మల్ని ఎన్నో కష్టాలు పెట్టాను. ఈ మేడం మీ గురించి చెబుతుంటే.. నా బుర్ర తిరిగిపోయింది అంటూ రుద్రాణి బాధపడింది.

    Recommended Video

    Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
    ఇంటిలో సౌందర్య పార్టీ

    ఇంటిలో సౌందర్య పార్టీ

    ఇక తాజా ప్రోమోలో కార్తీక్ ఫ్యామిలీ హైదరాబాద్‌లోని సొంత ఇంటికి చేరుకొన్నారు. ఇంటిలో ఆనందంగా సమయాన్ని గడుపుతూ కనిపించారు. నాన్నమ్మ ఎక్కడికైనా వెళ్దాం అంటూ అడిగితే.. ఎక్కడికి వెళ్లేది లేదు. మనం పార్టీ చేసుకొంటున్నాం అంటే.. పార్టీనా అంటే.. అవును అని సమాధానం చెప్పింది. పార్టీ గురించి నీకు తెలుసా దీప అంటే.. లేదు అని చెప్పింది. ఏ తల్లి కన్న బిడ్డో.. మన ఇంటికి వచ్చింది అంటూ పిల్లాడు ఆనందరావును చూసి సౌందర్య ముచ్చటపడిపోయింది. అయితే బాబు అచ్చం నాన్నలా ఉంటాడు అంటూ శౌర్య అనడం ప్రోమోలో కనిపించింది. దాంతో మరో ట్విస్టుకు కార్తీకదీపం సీరియల్ సిద్దమైందనే విషయం స్పష్టమైంది.

    English summary
    Karthika Deepam February 10th Episode number 1272
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X