For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాకు మోనిత గ్రహణం పట్టింది.. అండగా ఉండకపోతే కార్తీక్ ఏకాకి.. ఆకట్టుకొన్న దీప ఆవేదన!

  |

  తెలుగు బుల్లితెరపై మోస్ట్ టాప్ రేటింగ్ సీరియల్ కార్తీకదీపం భావోద్వేగాలతో ముందుకెళ్తున్నది. తాజా ఎపిసోడ్‌తో కొడుకు కార్తీక్ చేసిన వ్యవహారంపై మనస్తాపం చెందిన తండ్రి ఆనందరావు తనకు కార్తీక్ కొడుకే కాదు.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీప చెప్పిన ఎమోషనల్ మాటలు ఆయనను ఆలోచింపం చేసేలా చేశాయి. తాజా ఎపిసోడ్ 1104లో ఏం ఇంకా ఏం జరిగిందంటే..

  హిమ, శౌర్య అనుమానం

  హిమ, శౌర్య అనుమానం

  తమ తల్లిదండ్రులు హడావిడిగా బయట తిరుగుతుండటంతో పిల్లల హిమ, శౌర్య అనుమానం వ్యక్తం చేశారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పడం లేదంటే... తాత ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అవుతున్నారు. నేను అక్కడికి వెళ్లి తాత ఆరోగ్యం గురించి చూసుకొంటాను అంటే.. మేము వస్తామని మొండిగా వ్యవహారించారు.

  ఒకవేళ ఆ ఇంటికి వస్తే.. మోనిత వ్యవహారం తెలుస్తందనే బెంగతో అబద్దాలు చెప్పడంపై దీప ఆవేదన వ్యక్తం చేసింది. నెక్లెస్ రోడ్డులో ఫ్లవర్ ప్లాంట్ల్స్ ఎగ్జిబిషన్ పెట్టారు. అక్కడికి వెళ్లి పూలమొక్కలు తీసుకురండి. ఆ మొక్కలు పూలు పూసే లోపు మీకు శుభవార్త చెబుతాను అంటూ పిల్లల ఆలోచనలను డైవర్ట్ చేసింది.

  ‘వల్లంకి పిట్ట' పాప ఇప్పుడెలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ ని మించి పోయిందిగా!

  పెద్దరికం తలదించుకొనేలా..

  పెద్దరికం తలదించుకొనేలా..

  ఆరోగ్యం కుదుటపడటంతో ఆనందరావును హాస్పిటల్ డిశ్చార్జి చేసి‌ ఇంటికి తీసుకొచ్చారు. ఆనందరావుకు దీప దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. మంచి నీళ్లు కావాలా అంటూ మర్యాదలు చేస్తున్న దీపతో.. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు. మా పెద్దరికం తలదించుకొనేలా సంఘటనలు జరిగాయి. అందుకు క్షమాపణ చెబుతున్నాను అని ఆనందరావు అంటే.. ఎవరో ఏమో చేస్తే మీరు బాధపడటం ఎందుకు. మీరు క్షమాపణ చెప్పడం ఎందుకు అని దీప అన్నారు.

  Vadinamma : దమయంతి శపధం.. వెన్నుపోటు పెండింగ్, ఎలా జరుగుతుందో చూస్తానంటూ!

  మాకు మోనిత గ్రహణం పట్టింది

  మాకు మోనిత గ్రహణం పట్టింది

  ఆనందరావుకు దీప సర్ది చెప్పుతూ.. మా కుటుంబానికి మోనిత గ్రహణం పట్టింది? త్వరలోనే ఆ గ్రహణం వీడుతుంది అంటే.. మోనిత విషయంలో కార్తీక్ తప్పు లేదంటావా? మా కుటుంబాన్ని రోడ్డున పడేశాడు. మాకు గతంలో ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉండేది. ఇప్పుడు స్వప్ప, దీప నాకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు మాత్రమే ఉన్నారు అంటూ ఆనందరావు ఆవేదన చెందారు.

  నా భర్తకు నేను అండగా నిలబడకపోతే..

  నా భర్తకు నేను అండగా నిలబడకపోతే..

  కార్తీక్‌ ప్రవర్తనను అనుమానిస్తున్న ఆనందరావుతో దీప మాట్లాడుతూ.. నన్ను అనుమానించినప్పుడు మీరంతా నాకు అండగా నిలిచారు. ఎప్పుడు ఆయన తప్పు లేదంటున్నప్పుడు మనమంతా అనుమానిస్తే ఆయన ఏమై పోతారు. నా భర్తకు నేను అండగా నిలవకపోతే భార్య అనే పదానికి అర్దమే లేదు. డాక్టర్ బాబు కళ్లలో స్పష్టత ఉంది. ఆయన ప్రతీ అడుగులో సంస్కారం ఉంది. తెలిసి తప్పు చేయరు అనే నమ్మకం ఉంది. మోనిత వగలు చూసి చెలించే వారే అయితే ఇన్నాళ్లు ఆగి ఉండేవారు కాదు అని ఆనందరావుకు దీప చెప్పింది.

  పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర పూరి బ్యూటీఫుల్ ఫొటోస్.. చాలా రోజుల తరువాత ఇలా కొత్తగా..

  కార్తీక్ ఒంటరైపోతాడని..

  కార్తీక్ ఒంటరైపోతాడని..

  నన్ను, కార్తీక్‌ను విడదీసేందుకు కుట్రలు పన్నింది. మేము ఇద్దరం కలిసిన రోజే ఈ విషయాన్ని బయటపెట్టడం నాకు అనేక అనుమానాలు వచ్చాయి. ఆయన తల్లిదండ్రుల పిల్లలు గర్వంగా చూసే తండ్రిగానే ఉంటారు. మీరు కూడా కార్తీక్‌ను నమ్మి తీరాలి. ఆయనకు కావాల్సింది సానుభూతి కాదు.. ఆయనకు మన అండ కావాలి. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తే ఒంటరి అయిపోతారు. మన కుటుంబంలో ఎవరైనా సమస్యల్లో ఉంటే.. అతడికి కంచె వేసి కాపాడుకోవాలి. అతడిని దూరం చేయకండి.. ఆయన దూరమైతే మీరు తట్టుకొంటారో ఏమో గానీ.. ఆయన తట్టుకోలేరు అంటూ దీప కంటతడి పెట్టింది.

  English summary
  Karthika Deepam 29th July's Episode preview. Latest episode of 1104 goes once again with emotional content.Monita is prepating for marriage with Karthik on 25th...
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X