For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam..నేరాలతోనే మీకు జీవితం.. ఏసీపీ రోషిణికి క్లాస్ పీకిన డాక్టర్ బాబు

  |

  డాక్టర్ మోనిత మర్డర్ కేసులో అరెస్ట్ అయిన కార్తీక్ బాబు జైలులో ఉండగా.. ఏసీపీ రోషిణితో చిన్న డ్రామా జరిగింది. తనను చూసి కార్తీక్‌ అదోలా నవ్వడంతో రోషిణి ఫీల్ అయింది. అయితే వారి మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది. రోషిణికి కొన్ని సలహాలు ఇస్తూ కార్తీక్ క్లాస్ తీసుకోవడం ఫన్‌ను క్రియేట్ చేసింది. తాజాగా 12th ఆగస్టున 1116 ఎపిసోడ్‌లో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉందంటే..

  కార్తీక్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత హడావిడిగా ఏసీపీ రోషిణి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. సీరియస్‌గా నడుచుకొంటూ వెళ్తున్న ఏసీపీని చూసి.. జైలు చువ్వల మధ్య నుంచి కార్తీక్ చిన్నగా చిరునవ్వు నవ్వాడు. అయితే ఆ చిరునవ్వును తట్టుకోలేని ఏసీపీకి ఇగో హర్ట్ అయింది. దాంతో తన రూమ్‌లొకి వెళ్తూ కార్తీక్‌ను నా క్యాబిన్‌లోకి తీసుకురండి అంటూ పోలీసులను ఆదేశించింది. దాంతో పోలీసులు ఎస్ అన్నారు.

  MS Dhoni తో ఇళయదళపతి విజయ్... సోషల్ మీడియాలో కిరాక్ పుట్టిస్తున్న ఫోటోలు

  నా ఇగో హర్ట్ అయితే భరించలేను

  నా ఇగో హర్ట్ అయితే భరించలేను

  కార్తీక్‌ను సెల్‌లో నుంచి ఏసీపీ క్యాబిన్‌లోకి తీసుకెళ్లి నిలబెట్టారు. దాంతో ఎందుకు నవ్వొచ్చింది అంటూ ఏసీపీ అన్నారు. అందుకు కారణం ఏమీ లేదని కార్తీక్ చెప్పారు. దాంతో నేను చాలా ఇగోయిస్టిక్‌ను. నా ఇగో హర్ట్ అయితే భరించలేను. నిజం చెప్పండి అంటూ కార్తీక్‌ను ఏసీపీ నిలదీసింది.

  దాంతో ఎందుకు ఈ ఇగోలు, ఇజాలు. నిజం చెప్పినా అబద్దమని కొట్టిపడేస్తారు. అన్ని వేళలా నిజాలను అబద్దాలుగా మార్చలేరు కార్తీక్ అని ఏసీపీ దబాయించింది. ఈ నిజాలు, ఈ అబద్దాలు, ఇంటరాగేషన్లు తప్ప.. మీకు ఎలాంటి లాభం ఏమీ ఉండదు. తెల్లారిలేస్తే కుట్రలు, హత్యలు, నేరాలతోనే మీకు సరిపోతుంది అని కార్తీక్ క్లాస్ పీకారు.

  Bigg Boss OTT భామ నేహా భాసిన్.. మత్తెక్కించే అందాలతో హంగామా!

  ఏసీపీ గారు యోగా చేసుకోండి

  ఏసీపీ గారు యోగా చేసుకోండి

  ఏసీపీతో కార్తీక్ మాట్లాడుతూ.. కనీసం ఒంటరిగా ఉన్నప్పుడైనా మనసుకు ప్రశాంతం ఉండేలా చర్యలు తీసుకోండి. యోగా, మెడిటేషన్ చేయండి. అప్పుడు ఎవరైనా నవ్వినా.. అది మీకు పరిహాసంగా అనిపించదు, హాయిగా నవ్వండి. ఆరోగ్యంగా ఉండండి. నన్ను చూడండి. నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానో. వస్తాను మేడమ్ అంటూ కార్తీక్ ఏసీపీ క్యాబిన్ నుంచి బయటకు వెళ్లాడు.

  Adah Sharma బికినీ అందాలన్నీ ఒక్క చోట.. చిన్నప్పటి నుంచీ ఇప్పటిదాకా!

  తల్లిని పలకరిస్తూ ఉద్వేగంగా

  తల్లిని పలకరిస్తూ ఉద్వేగంగా

  ఏసీపీ క్యాబిన్ నుంచి బయటకు వచ్చిన కార్తీక్‌కు షాక్ తగిలింది. తన ఎదుట తల్లి కనిపించడం మమ్మీ అంటూ కంగారు పడ్డారు. కొడుకును చూసి తల్లి ఆవేదనకు గురైంది. తల్లిని పలకరిస్తూ అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు? స్వప్న బాగుందా? అంటూ కార్తీక్ పలకరిస్తుండగా.. ఏసీపీ వచ్చి.. అతను ఉండాల్సింది బయట కాదు.. లాకప్‌లో అంటూ వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఒక్క నిమిషం అంటూ.. దీప, పిల్లల్ని మీరే చూసుకోవాలి. నాన్నను సమయానికి మాత్రలు వేసుకోమని చెప్పు అంటూ లాకప్‌లోకి వెళ్లిపోయాడు.

  సౌందర్య ప్లాన్ పారకపోవడంతో..

  సౌందర్య ప్లాన్ పారకపోవడంతో..

  కార్తీక్ వద్ద నుంచి నేరుగా సౌందర్య ఏసీపీ క్యాబిన్‌లోకి వెళ్లింది. దాంతో మీరెందుకు వచ్చారు అని ఏసీపీ ప్రశ్నిస్తే.. ఇది రివాల్వర్. హత్యకు ఉపయోగించినది. నా కొడుకుకు ఈ నేరంతో ఎలాంటి సంబంధం లేదు. నేనంటే వాడికి చాలా ప్రేమ. నేను చేసిన నేరాన్ని వాడు తన మీద వేసుకొన్నాడు. కాబట్టి నన్ను అరెస్ట్ చేసి వాడిని రిలీజ్ చేయండి అంటూ సౌందర్య అంటే.. ఏసీపీ పకపకా నవ్వింది. మీరు నా సీట్లోకి వచ్చి కూర్చోండి అంటూ వెటకారంగా మాట్లాడింది. మీ మీద నీ కొడుకు కంటే.. నీ కొడుకు మీద మీకు ప్రేమ ఎక్కువ ఉన్నట్టుంది. అందుకే అతడు చేసిన నేరాన్ని మీ మీద వేసుకొంటున్నారు అని ఏసీపీ అన్నారు.

  సౌందర్యకు షాకిచ్చిన ఏసీపీ రోషిణి

  సౌందర్యకు షాకిచ్చిన ఏసీపీ రోషిణి

  సౌందర్య మాటలకు అడ్డుపడుతూ... మీ కొడుకు మీద ప్రేమ ఉన్నట్టే.. నా డ్యూటీ మీద నాకు ప్రేమ ఉంటుంది. అది గుడ్డి ప్రేమ కాదు. మీరు రెండు గంటల క్రితం ఎయిర్‌పోర్టులో దిగారు. నేరుగా దీప ఇంటికి వెళ్లారు. దీపను పలకరించకుండానే మీరు కారులో ఉన్న రివాల్వర్‌ను తీసుకొని ఇక్కడికి వచ్చారు. మోనిత మర్డర్ జరిగింది నిన్న. నిన్న జరిగిన మర్డర్‌ను ఈ రోజు అమెరికా నుంచి వచ్చిన మీరు ఎలా చేశారో నీ తల్లి ప్రేమకే తెలియాలి అంటూ సౌందర్యకు ఏసీపీ షాకిచ్చింది.

  English summary
  Karthika Deepam August 12th August's Episode preview. Latest episode of 1116 goes once again with emotional content.Monita is prepating for marriage with Karthik on 25th...In this occasion, Karthik arrested in Monita murder case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X