Karthika Deepam today episode: ఏదో చేయని తప్పు చేశావా? తప్పు చేశావని తెలిస్తే... మోనితకు ప్రియమణి వార్నింగ్

దీప, కార్తీక్ ఎదురుదాడితో మోనిత సందిగ్దంలో పడింది. అంజిని తీసుకొస్తే.. దీని శాడిజం, పొగరును అణిచి వేయవచ్చు అంటూ దీప చెప్పిన మాటలతో మోనిత కంగారులో పడింది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నాననే భావన మోనితలో స్పష్టంగా కనిపించింది. మోనిత పరిస్థితిని చూసి అనుమానంతో కనిపించిన వంట మనిషి ప్రియమణి అని అంజి ఎవరు అంటూ ప్రశ్నించింది? తాజా ఎపిసోడ్‌ 1107లో ఇంకా ఏం జరిగిందంటే...

అంజి ఎవరు? అంటూ ప్రియమణి

అంజి ఎవరు? అంటూ ప్రియమణి

అంజి ఎవరు అని ప్రియమణి అడిగిన ప్రశ్నతో మోనిత మరింత కంగారు పడింది. ఆదే కంగారు ఇందాక అంజి పేరు దీప ఎత్తగానే మీలో కనిపించింది. చెప్పమ్మా.. ఎవరా అంజి. ఆ పేరు వినగానే ఎందుకు కంగారు పడతున్నారు. అనుమానించాల్సిన భర్తను దీప అభిమానిస్తుంటే నాకు ఏదో అనుమానం కలుగుతున్నది. అంజి ఎవరో చెప్పమ్మా అంటూ ప్రియమణి ప్రశ్నించింది. దాంతో సమాధానం చెప్పలేక... టేబుల్ పైన వస్తువులను సర్దు అంటూ మోనిత అంటే.. టేబుల్ పైన ఉన్న వాటిని నేను సర్దుతాను. కానీ ఈ విషయంలో నేను సర్దుకుపోలేను అంటూ ప్రియమణి అనుమానంగా చూసింది.

ఏదో చేయకూడని తప్పు చేశారని...

ఏదో చేయకూడని తప్పు చేశారని...

మోనితను పదే పదే అంజి ఎవరు అంటూ ప్రియమణి అడిగింది. మీకు కడుపు చేసి కార్తీక్ అన్యాయం, మోసం చేశారనే విషయాన్ని నేను నమ్ముతున్నాను. కానీ మీ వాలకం, మౌనం చూస్తే మీరే ఏదో చేయకూడని తప్పు చేశారని అనిపిస్తుంది అని ప్రియమణి అనగానే ప్రియమణి మోనిత ఆమెను చెయ్యెత్తి కొట్టబోయింది.

ఆగిపోయారేందుకమ్మా.. కొట్టకుండా ఎందుకు ఆగిపోయారు. కానీ నాకు అంజి ఎవరో నా ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇన్నాళ్లు మీకు వెట్టి చాకిరి చేస్తూ ఉంటున్నాను. మీకు చెల్లిగా, తల్లిగా అడుగుతున్నాను. చెప్పండి అమ్మా.. ఆ అంజి ఎవరు అంటూ దీప ప్రశ్నల వర్షం కురిపించింది.

నీ కడుపులో రహస్యం ఏమిటి?

నీ కడుపులో రహస్యం ఏమిటి?

మోనితను నిలదీస్తూ అంజి ఎవరో చెప్పండి అంటూ ప్రశ్నిస్తూ.. మీరు దీపమ్మ కాపురాన్ని ఎందుకు కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. మీ కడుపులో ఉంచుకొన్న రహస్యం ఏమిటి? అంటూ ప్రియమణి ప్రశ్నిస్తుంటే.. కోపంతో ఊగిపోయిన మోనిత.. నోర్మూయ్ అంటూ గట్టిగా అరిచింది.

ఇంకొక మాట మాట్లాడావంటే.. నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. వెళ్లు ఇక్కడి నుంచి అంటూ వార్నింగ్ ఇచ్చింది. దాంతో ప్రియమణి ఎమోషనల్ అవుతూ.. ఇప్పటి వరకు మిమ్మల్నే నమ్ముతున్నాను. ఐ లవ్ యూ అమ్మా.. కానీ.. మీరు తప్పు చేశారని నమ్మితే.. నేను మీకు దూరం అవుతాను. అప్పు డు మిమ్మల్ని చూసే దిక్కు కూడా ఉండదు. అది గుర్తు పెట్టుకొండి అమ్మా అంటూ ప్రియమణి ఘాటుగా స్పందించింది.

కార్తీక్‌తో దీప అబద్దం ఆడి

కార్తీక్‌తో దీప అబద్దం ఆడి

ఇదిలా ఉండగా, అంజి ఆచూకీ తెలిసిందని దీపకు ఏసీపీ రోషిణి ఫోన్ చేసింది. అంజి సూర్యాపేటలో ఉన్నాడు. కార్తీక్‌కు చెప్పకుండా మీరు సూర్యాపేటకు వెళ్లి రండి. మీరు సూర్యాపేటకు వెళ్లే విషయం కార్తీక్‌కు ఎలాంటి పరిస్థితుల్లో చెప్పకూడదు అని ఫోన్ సూచనలు ఇచ్చింది. దాంతో రాను మూడు గంటలు.. పోను మూడు గంటలు... ఉదయం కల్లా వచ్చేయాలి. పిన్ని వాళ్ల ఇంటికి వెళ్తున్నట్టు చెప్పి వెళ్లి వస్తాను అంటూ దీప క్యాబ్ బుక్ చేసుకొన్నది.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
డబ్బు చేస్తానని మోనిత సంతోషంలో

డబ్బు చేస్తానని మోనిత సంతోషంలో

దీప సూర్యాపేటకు వెళ్లే క్రమంలోనే... మోనితకు ఓ ఇన్ఫార్మర్ నుంచి ఫోన్ వచ్చింది. అంజి సూర్యాపేటలోని లాడ్జీలో ఉన్నారు అంటూ ఫోన్‌లో చెప్పాడు. ఆ మాటలు విన్న మోనిత సంతోషంలో మునిగిపోయింది. ఎంత డబ్బు వెంటనే ట్రాన్స్‌ఫర్ చేస్తాను. ఇక డాక్టర్ కార్తీక్‌తో పెళ్లి ఖాయం అంటూ సంతోషంలో మునిగిపోయింది. ప్రియమణితో మాట్లాడుతూ.. నేను అర్జెంట్‌గా బయటకు వెళ్తున్నాను. వచ్చేసరికి తెల్లారుతుంది. నీవు పడుకో... నేను ఎవరిని మోసం చేయడం లేదు. కార్తీక్‌ను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ మోనిత చెప్పేసి బయటకు వెళ్లింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X