For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam..మోనిత కుట్రను బట్టబయలు చేసిన సౌందర్య... శిక్ష తప్పదు అంటూ ఏసీపీ

  |

  మోనితను కార్తీక్ హత్య చేయలేదు. నేనే హత్య చేశాను అంటూ డాక్టర్ బాబు తల్లి సౌందర్య చెప్పడంతో ఏసీపీ రోషిణి వెటకారంగా నవ్వింది. సౌందర్యతో ఏసీపీ మాట్లాడుతూ.. మీ కొడుకు మీద ప్రేమ ఉన్నట్టే.. నా డ్యూటీ మీద నాకు ప్రేమ ఉంటుంది. అది గుడ్డి ప్రేమ కాదు. మీరు రెండు గంటల క్రితం ఎయిర్‌పోర్టులో దిగారు. నేరుగా దీప ఇంటికి వెళ్లారు. దీపను పలకరించకుండానే మీరు కారులో ఉన్న రివాల్వర్‌ను తీసుకొని ఇక్కడికి వచ్చారు. మోనిత మర్డర్ జరిగింది నిన్న. నిన్న జరిగిన మర్డర్‌ను ఈ రోజు అమెరికా నుంచి వచ్చిన మీరు ఎలా చేశారో మీ తల్లి ప్రేమకే తెలియాలి అంటూ సౌందర్యకు ఏసీపీ షాకిచ్చింది. ఇలా రకరకాల ఎమోషన్స్‌తో ముందుకెళ్తున్న కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1117లో ఏం జరిగిందంటే..

  Sonakshi Sinha మెగాస్టార్ చిరంజీవితో రొమాంటిక్‌గా.. దబాంగ్ బ్యూటీ ఫోటోలు వైరల్

  మా లెక్కలు మాకుంటాయి అంటూ ఏసీపీ

  మా లెక్కలు మాకుంటాయి అంటూ ఏసీపీ

  ఎవరంటే.. ఎవరికి ప్రేమ అనేది దర్యాప్తులో తేలుతాయి. అప్పటి వరకు నీ కన్నతల్లి ప్రేమను కడుపులో ఉంచుకోండి అని ఏసీపీ అంటే.. మీరు చాలా తెలివైన వారు. ఈ హత్య నేను చేయలేనని చెప్పిన మీరు.. మోనిత హత్యను కార్తీక్ చేయలేదని ఎందుకు కనిపెట్టలేకపోయారు. కార్తీక్ ఈ హత్యను చేసినట్టు ఎవరైనా చూశారా? అని ఏసీపీ ప్రశ్నిస్తే.. అవును.. మీ వియ్యపురాలు భాగ్యం సాక్ష్యం చెప్పింది అంటూ ఏసీపీ అన్నారు.

  భాగ్యం అక్కడే ఉంది అంటే.. కనులారా చూసిందా? చెవులారా విన్నదా అంటే.. ఇది కోర్టు కాదు కదా.. మీ వాదనలు అక్కడే వినిపించండి. మా లెక్కలు మాకు ఉంటాయి అంటూ ఏసీపీ అంటే.. మీ లెక్కలు ఎక్కడో తప్పి ఉంటాయి కదా.. అని సౌందర్య ప్రశ్నించింది.

  Samantha Akkineni శాకుంతలం సెట్లో ఎమోషనల్.. చివరి రోజున ఘనంగా వీడ్కోలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

  సౌందర్య.. మీరు ఉత్తమ మహిళవు అంటూ

  సౌందర్య.. మీరు ఉత్తమ మహిళవు అంటూ

  ఏసీపీ రోషిణి వాదనను అడ్డుకొంటూ.. కార్తీక్ ఈ నేరం చేయలేదని గట్టిగా చెప్పగలను అని సౌందర్య అంటే.. మరేం చేసి ఉంటారు. స్నేహంతో ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటే మీరు ఏం చేశారు. కోడలి కోసం కొడుకుపై పోరాటం చేసిన ఉత్తమ మహిళవు. పెళ్లైన తర్వాత మరో స్త్రీతో తిరుగుతుంటే ఎందుకు మందలించలేదు. ఎందుకు వారిద్దరి హద్దుల్లేని స్నేహాన్ని మొగ్గలోనే తుంచలేదు. ఎందుకంటే నీ కొడుకంటే మీకు అంతులేని ప్రేమ కాబట్టి. అదే నమ్మకంతో మీ కోడలు ఉంది కాబట్టి.. మీ నమ్మకాన్ని అడ్డుపెట్టుకొని దీపకు కడుపు చేశాడు. పెళ్లి చేసుకోమంటే హత్య చేశాడు. పైగా లాకప్‌లో కూర్చొని మెట్ట వేదాంతం చెబుతున్నాడు అంటూ ఏసీపీ అని ఘాటుగా స్పందించింది.

  మోనిత కుట్రను బయటపెట్టిన సౌందర్య

  మోనిత కుట్రను బయటపెట్టిన సౌందర్య

  ఏసీపీ చేస్తున్న ఆరోపణలను సౌందర్య ఖండిస్తూ.. ఎక్స్‌క్యూజ్‌ మీ.. నా కొడుకు వల్ల మోనిత గర్బవతి కాలేదు అని సౌందర్య అంటే.. ఎవరి వల్ల అయింది అంటూ ఏసీపీ వెటకారంగా ప్రశ్నించింది. మోనిత ఎవరి వల్ల గర్బవతి కాలేదు అంటే.. ఆకాశం నుంచి దేవతలు దిగివచ్చి వరం ఇచ్చారా అని ఏసీపీ అంటే.. కృత్రిమ గర్బధారణ వల్ల ఆమె గర్బవతి అయింది. కావాలంటే సంతాన సాఫల్య కేంద్రంలోని టెక్నిషియన్‌ను అడగండి. అప్పుడు నిజాలు తెలుస్తాయి. మీ దర్యాప్తును అక్కడి నుంచే ప్రారంభించండి అంటూ సౌందర్య షాకిచ్చింది. మీకు తల్లి కొడుకుల ప్రేమ కంటే డ్యూటీ గొప్పది కదా.. ఆ ప్రేమ పదికాలాలపాటు గొప్పగా ఉండాలని కోరుకొంటున్నాను అంటూ సౌందర్య పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లింది. దాంతో ఏసీపీ షాక్ తిన్నది. లాకప్‌లో ఉన్న కార్తీక్‌ బుగ్గలపై నిమురుతూ ప్రేమను కురిపించింది.

  తప్పు చేయని వాళ్లు కూడా లాకప్‌లో

  తప్పు చేయని వాళ్లు కూడా లాకప్‌లో

  లాకప్‌లో ఉన్న కార్తీక్‌కు పోలీసులు ప్రేమగా చూసుకొన్నారు. మహిళా కానిస్టేబుల్ వచ్చి టీ ఇచ్చి.. మా ఏసీపీకి కోపం ఎక్కువ. ఆమె ఎవరినీ కేర్ చేయ్యదు. కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోకండి. ఒక్కోసారి తప్పు చేయని వారు కూడా లాకప్‌లో ఉంటారు. మీకు ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. మధ్యాహ్నం బిర్యానీ కావాలంటే చెప్పండి.. తెప్పిస్తాను అంటే వద్దు అని కార్తీక్ అన్నాడు. ఏదైనా కావాలంటే నన్ను అడగండి అంటూ కానిస్టేబుల్ చెప్పారు. కానిస్టేబుల్ ఆదరణకు కార్తీక్ ఇంప్రెస్ అయ్యారు.

  15 Songs That Helps To Overcome Depression | Best Sufi Songs | Filmibeat Telugu
  కార్తీక్‌కు శిక్షపడేలా చేస్తానంటూ ఏసీపీ

  కార్తీక్‌కు శిక్షపడేలా చేస్తానంటూ ఏసీపీ

  ఇక లాకప్‌లో ఉంటూ ప్రవచనలు వల్లించారనే కోపంతో ఏసీపీ రోషిణి సీరియస్ అయింది. ముందే మంచితనం ముసుగేసుకొన్నాడు. ఆ ముసుగులో ఎన్ని లొసుగులు ఉన్నాయో నాకు తెలుసు. భార్యను నమ్మించాడు. తల్లిని మోనితను వంచించాడు. చివరకి చంపేశాడు. దీప కళ్లకు గంతలు కట్టి ఆకాశానికి ఎదిగినట్టు బిల్డప్ ఇచ్చారు. మోనితకు కలల రాకుమారుడిగా కనిపించాడు.

  కడుపు సంగతి బయటపడ్డాక.. కనుమరుగైపోయాడు. మోనిత పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తే.. పథకం ప్రకారం చంపేశాడు. శవం మాయం చేసి అందర్నీ మాయ చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు శ్మశాన వైరాగ్యంతో ప్రశాంతంగా ఉండాలని ప్రవచనాలు వల్లిస్తున్నాడు. మోనిత శవం ఆచూకీ కనిపెడుతా. కార్తీక్ ఎలాంటి శిక్ష పడాలో దానిని వేయిస్తా అంటూ ఏసీపీ రోషిణి తనలో తాను కోపంగా అనుకొంటూ ఓ నిర్ణయానికి వచ్చింది.

  English summary
  Karthika Deepam August 13th August's Episode preview. Latest episode of 1117 goes once again with emotional content. Monita is prepating for marriage with Karthik on 25th...In this occasion, Karthik arrested in Monita murder case.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X