For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam శోభ బండారం బయటపెట్టిన శౌర్య.. నిరుపమ్ పెళ్లి క్యాన్సిల్.. చివరి క్షణంలో ఏం జరిగిందంటే?

  |

  పెళ్లి కొడుకుగా ముస్తాబైన నిరుపమ్‌ను చూసి తల్లి స్వప్న మురిసిపోయింది. పెళ్లికొడుకుగా నిరుపమ్‌ ముద్దొస్తున్నాడు అంటూ స్వప్న ఆనందంలో మునిగిపోయింది. ప్రేమ్ ఎక్కడా కనిపించకపోవడంతో భర్తను అడిగింది. అయితే అత్తమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నాడు అంటూ సత్యం చెప్పగానే.. స్వప్న కాస్త నిరుత్సాహ పడిపోయింది. అయితే మీ ఫ్రెండ్స్ ఎక్కడా అంటూ తానే మాట్లాడుతుండటం.. ఆ ప్రశ్నలకు తానే సమాధానం చెప్పుకొంటూ స్వప్న కంగారుపడిపోయింది. అయితే పెళ్లికొడుకు గెటప్‌లో అందంగా ఉన్న కొడుకుతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించింది. ఫోటో దిగుతుంటే కాస్త నవ్వు అంటూ భర్త, కొడుకుతో స్వప్న సెల్ఫీ దిగింది. కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1427లో ఏం జరిగిందంటే?

  డాక్టర్ సాబ్ పెళ్లి మహానటితోనే

  డాక్టర్ సాబ్ పెళ్లి మహానటితోనే

  ఇంట్లో పెళ్లి సందడి కనిపించడంతో హిమ కన్నీటి పర్యంతమైంది. హిమ ఏడుస్తుంటే.. సౌందర్య చూసి.. శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఏడుపు ఎందుకు అని సౌందర్య, ఆనందరావు ప్రశ్నిస్తే... తన మొబైల్‌లో ఉన్న ఫోటోను చూపించింది. ఆ ఫోటోను చూసి ఎవరు పంపారు అంటే.. స్వప్న అత్త అంటూ హిమ సమాధానం చెప్పింది.

  అత్త అన్నంత పనిచేస్తుందని అనుకొన్నా. ఏదో మాయ చేసి బావను శోభతో పెళ్లికి ఒప్పించింది అని ఏడుస్తూ ఉంటే.. శౌర్య వచ్చి.. ఏంటి ఈ నాటకాలు అని అడిగింది. అయితే మీ స్వప్న అత్త ఎంత పనిచేసేందో చూశావా? అని అంటే.. ఫోటో చూసి కంగారు పడటం ఎందుకు? ఆ పెళ్లి జరగదు. డాక్టర్ సాబ్ పెళ్లి ఈ మహానటితోనే జరుగుతుంది అని శౌర్య హామీ ఇచ్చింది.

  నీ మాటలు ఎప్పటికీ నమ్మను

  నీ మాటలు ఎప్పటికీ నమ్మను

  శౌర్య మాటలు విన్న హిమ మాట్లాడుతూ.. నేను ఏడ్చేది నీ కోసం. నా కోసం కాదు. నా బాధ అంతా నీ కోసమే అని చెప్పింది. దాంతో చాలూ నీ డ్రామాలు. నీ మాటలు ఎప్పటికీ నమ్మను అంటూ శౌర్య సమాధానం ఇచ్చింది. అయితే చాలూ మీ గొడవలు. మా బాధలు, కష్టాలు, సమస్యలు పట్టించుకోరా. మమ్మల్ని ఎప్పుడు అర్ధం చేసుకొంటారు అంటూ సౌందర్య ఇద్దరిని నిలదీసింది.

  కొడుకులు కోడళ్లు దూరమయ్యారు. కూతురు ద్వేషం పెంచుకొన్నది. వీళ్లేమో ఇలా గొడవపడుతున్నారు. స్వప్న తన పని తాను చేసుకొంటూ వెళ్తున్నది అని సౌందర్య అంటే.. ఆ పెళ్లి జరగదు. నాతో మీరు రండి అంటూ శౌర్య వారిని తీసుకొని బయలుదేరింది.

  ఆస్తి అంతా నా చేతికి వస్తుందని శోభ

  ఆస్తి అంతా నా చేతికి వస్తుందని శోభ

  ఇదిలా ఉండగా, పెళ్లి కూతురు గెటప్‌లో తనను తాను చూసుకొని ఆనందంలో మునిగిపోయింది. ఇన్నాళ్లకు నీ కల నెరవేరబోతున్నది. నీ హాస్పిటల్ అప్పు తీరబోతున్నది. పెళ్లి తర్వాత అత్త, మామ నా మాటే వింటారు. నిరుపమ్ నా కొంగు పట్టుకొని తిరుగుతాడు. ఆస్తి మొత్తం నా చేతికి వస్తుంది. ఇంటి కోడలుగా చక్రం తిప్పుతా.

  కష్టపడ్డవాళ్లు సుఖ: పడుతారని ఎవరన్నారో కానీ.. అది అక్షరాల నిజం అంటూ ఆనందపడిపోతుంటే.. సడెన్‌గా ఒక రౌడీ తన పడేసరికి.. కంగారుపడిపోయింది. నువ్వేంటిరా ఇక్కడ అంటూ పక్కకు చూడగానే..శౌర్య, హిమ, సౌందర్య, ఆనందరావు కనిపించారు. దాంతో శోభ షాక్ తిన్నది.

  కిడ్నాప్ వ్యవహారం బట్టబయలు

  కిడ్నాప్ వ్యవహారం బట్టబయలు

  ఇక శోభ బండారం బయటపెట్టడానికి సిద్దమైన శౌర్య.. స్వప్న అత్తా.. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావా అంటూ పిలిచింది. ఒక్కసారి వచ్చిపో అంటూ శౌర్య పిలువగానే.. స్వప్న వచ్చి అక్కడి పరిస్థితి చూసి కంగారుపడిపోయింది. మీ అందరికి ఇక్కడేం పని? పిలువని పేరంటానికి ఎందుకు వచ్చారు? అని స్వప్న ప్రశ్నించింది.

  దాంతో సౌందర్య వచ్చి స్వప్న‌ను చెంపపై లాగి కొట్టింది. నా కోడలు అంటూ నెత్తిన పెట్టుకొన్నావు కదా.. నీ కోడలు బండారం బయటపెట్టడానికి వచ్చాను. శౌర్య చూస్తావేంటి? చెప్ప అంటూ సౌందర్య అంటే.. అంతలోనే ప్రేమ్ వచ్చి.. వీడు శౌర్యను కిడ్నాప్ చేశాడు అంటూ అసలు విషయం బయటపెట్టాడు. కిడ్నాపర్‌ను చూసిన స్వప్న.. నీవు ఇక్కడి నుంచి వెళ్లిపోరా అనగానే.. అక్కడి నుంచి అతడు పారిపోయాడు. పరిస్థితి అంతా కంగారుగా ఉండటంతో.. స్వప్న జోక్యం చేసుకొంటూ.. ఈ ఆటో దాని బాధ భరించలేక.. శోభ కిడ్నాప్ చేయించిందనుకొండి.. దానికే ఏమైంది.

  అందుకే పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తున్నారా? మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి ఆపను. ఇలాంటి వాటికి భయపడను. నిరుపమ్‌ను కాపాడుకోవడానికి శోభ కిడ్నాప్ చేయించి ఉండవచ్చు. అందులో తప్పేమీ లేదు. నిరుపమ్‌పై శోభ ప్రేమ కనిపించింది అని స్వప్న అంది.

  Recommended Video

  NASA అంతరిక్షంలోకి Athira Preeta Rani... ఎవరీమె? *Trending | Telugu OneIndia
  శోభ కుట్రలు బట్టబయలు

  శోభ కుట్రలు బట్టబయలు

  స్వప్న సపోర్ట్ ఇవ్వడంతో శోభ చెలరేగిపోయింది. నన్ను మా కాబోయే అత్త అర్ధం చేసుకొన్నది. మీరు ఎలాగు వచ్చారు కాబట్టి.. పెళ్లి భోజనం తిని వెళ్లండి. మా ఇంట్లో నలుగురు చేయి కడిగినట్టు ఉంటుంది అని శోభ అనగానే.. ఇంకా ఏమైనా ఉందా? అని శౌర్య చప్పట్లు కొట్టంది. అంతలోనే బ్యాంక్ ఆఫీసర్లు వచ్చి.. శోభ బండారం బయటపెట్టారు. లక్షలాది అప్పు చేసి తప్పించుకు తిరుగుతుంది.

  డబ్బు గురించి అడిగితే.. డబ్బున్న వ్యక్తిని బుట్టలో వేసుకొన్నా. పెళ్లి తర్వాత ఆస్తి అంతా నా పేరు మీదకు వస్తుంది. అప్పుడు హాస్పిటల్ అప్పులన్నీ కట్టేస్తానని చెప్పిందని ఆఫీసర్లు చెప్పారు. అయితే ఆ మాటలు నమ్మకండి అత్తయ్య.. అన్నీ అబద్దం అని శోభ అంది. అయితే ఊహించని విధంగా శోభ వద్దకు వచ్చి.. స్వప్న లాగి కొట్టింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు గెంటింది.

  ఆ తర్వాత శౌర్య వద్దకు వచ్చి ప్రేమగా భుజంపై స్వప్న చేయివేసింది. దాంతో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీలయ్యారు. అయితే తన కుటుంబం, భర్త, పిల్లలతో చెడుగా వ్యవహరించిన తీరుపై స్వప్న మదనపడింది. తన మనసు మార్చుకొని భర్తతో తన ఆవేదనను పంచుకొన్నది. చేసిన పనికి క్షమించమని అడిగింది.

  English summary
  Karthika Deepam 10th August Episode number 1427.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X