twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam శౌర్య చెంప చెళ్లుమనిపించిన అత్త.. బావ నిరుపమ్ రావడంతో తప్పిన గొడవ

    |

    తన పెళ్లి ప్రస్తావన తీసుకు రావడంతో హిమ కోపంతో ఊగిపోయింది. పెళ్లి పెళ్లి అని ప్రాణం తీయకండి అని మీ ఇద్దరికి చెబుతున్నాను. మంచి మొగుడి కోసం కాదు గానీ.. మీ మంచి కోసం గుడికి వెళ్తున్నాను అంటూ ఆనందరావు, సౌందర్యకు వార్నింగ్ ఇచ్చినంత పనిచేసి హిమ వెళ్లిపోయింది. హిమ చెప్పిన అభిప్రాయాన్ని విన్న తర్వాత ఆనందరావు, సౌందర్య ఆవేదన చెందారు. సౌందర్యతో ఆనందరావు మాట్లాడుతూ.. ఏంటీ సౌందర్య.. హిమ ఏమో పెళ్లి వద్దంటుంది. శౌర్య దొరికితేనే పెళ్లి అంటున్నది అని అంటే.. శౌర్య కోసం వెతుకుతూనే ఉన్నాం. హిమ పెళ్లి కోసం ఆలోచిస్తున్నాం. కానీ కూతురు స్వప్న నన్ను చూస్తే కళ్లలో నిప్పులు పోసుకొంటున్నది. శౌర్య ఎక్కడున్నదో.. త్వరగా దొరికేలా చూడండి స్వామి అంటూ భగవంతుడిని వేడుకొన్నది. కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1317లో ఇంకా ఏమి జరిగిందంటే..

    హిమను కనిపించేలా చూడు

    హిమను కనిపించేలా చూడు

    ఇక శౌర్య అలియాస్ జ్వాలా గుడిలోకి అడుగుపెట్టి భగవంతుడిని ప్రార్థించింది. దేవుడా ఈ రోజు మంచి రోజు. ఈ రోజు కోరుకొంటే మంచి మొగుడు వస్తాడని చెబుతుంటారు. కానీ నేను అదేమీ కోరుకోవడం లేదు. ఇన్నాళ్లు అదే అడుగున్నాను. ఇప్పుడు అదే అడుగుతున్నాను. హిమ కనిపించేలా చూడు. నాకు అంతే చాలూ. ఆ ఆ తర్వాత అంతా నేను చూసుకొంటాను. నా ఆవేశం ఏమిటో నీకు తెలుసు. నా గుండె మంటలు చల్లారడం లేదు. నేను పడుతున్న వేదన వంద రెట్లు పడేలా చేస్తాను. ఆ బాధ ఏమిటో హిమకు తెలియజేస్తాను. అమ్మా, నాన్నను దూరం చేసిన హిమను వదిలిపెట్టను అని శౌర్య మొక్కుకున్నది. శౌర్య మొక్కుకొన్న తీరు చూసి చాలా పెద్ద కోరికే కోరుకొన్నట్టు ఉన్నావు. ఈ కొబ్బరికాయ కొట్టిరా అంటూ పూజారి చెప్పడంతో అందుకు సిద్ధమైంది.

    కొబ్బరికాయ ముక్క తగిలితే..

    కొబ్బరికాయ ముక్క తగిలితే..


    ఆలయం బయట కొబ్బరికాయ కొట్టడానికి వస్తుంటే.. తన మేనత్త స్వప్న గుడిలోకి అడుగుపెట్టింది. దేవుడికి నమస్కరించి.. నా హిమ కనిపించాలి. ఇన్నాళ్లు ఏమీ కోరుకోలేదు అని కొబ్బరి కాయ కొట్టగానే వెళ్లి అందులో నుంచి ముక్క ఎగిరి స్వప్ప ముఖానికి తగలింది. తన తలకు కొబ్బరికాయ ముక్క వచ్చి తలకు తగలడంతో.. కోపంగా కళ్లు కనిపించడం లేదా అంటే.. నాకు బాగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడే దైవ దర్శనం చేసుకొని వచ్చాను అని శౌర్య అంటే.. కొబ్బరికాయ ముక్క వచ్చి నా తలకు తగిలింది తెలుసా? అని స్వప్న అంటే.. నేను కొబ్బరి కాయ కొట్టాను. అందులో ఓ ముక్క తలకు తగిలింది. మీరు ఇక వెళ్లండి అని శౌర్య అంటే.. తప్ప చేసి కూడా అలా మాట్లాడుతున్నావా? నన్ను వెళ్లమంటావా? అని స్వప్ప కోపంగా బదులిచ్చింది. అయితే మీరు కొబ్బరికాయ కొట్టండి. నేను ఇక్కడే ఉంటాను. ఓ ముక్క తగలేలా కొబ్బరికాయ కొట్టాలి అని శౌర్య అంటే.. అదేలా సాధ్యం అంటూ స్వప్న అదే.. కావాలని ఎవరు కొట్టరు అని శౌర్య అంటే.. ఇంతకు నీవు ఏం చేస్తావు అని స్వప్ప అడిగింది. దాంతో నేను ఆటో డ్రైవర్ అని చెప్పి కాసేపు గొడవ పడి శౌర్య చెప్పేసి అక్కడి నుంచి వెళ్లింది.

    శౌర్యను కొట్టిన అత్త

    శౌర్యను కొట్టిన అత్త


    కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకొంటుంటే.. ప్రేమ్ కెమెరాతో గుడిలోకి ప్రవేశించాడు. మంచి ఫ్రేమ్ ఉందని కెమెరా ఫోకస్ పెట్టగానే... అందులో నుంచి శౌర్య కనిపించింది. దాంతో నీవు ఇక్కడ అంటే.. ఏయ్ ఎక్స్‌ట్రా నీవేంటి ఇక్కడ అని శౌర్య బదులిచ్చింది. నీ మాదిరిగానే ఓ ఆవిడ కనిపించింది. నీలాగే ఎక్స్‌ట్రా మాట్లాడింది. నీకు తల్లిలా ఉంది అని అనగానే.. పక్క నుంచి శౌర్య చెంపపై లాగి కొట్టింది. నా కొడుకును ఎక్స్‌ట్రా అంటావా అని స్వప్న అంటే.. ఈ ఎక్స్‌ట్రా మమ్మీవా? అని శౌర్య అంటే.. ఆటో నడుపుకొనేది అలా అంటుంటే నిలబడిపోయావేంటిరా? అంటే.. ఎక్స్‌టా నేను ఫ్రెండ్స్.. ఏమైనా అనుకొంటాం. నీవు మధ్యలో రాకు అని శౌర్య అని గట్గిగా సమాధానం ఇచ్చింది.

    ఆటోదానితో ఫ్రెండ్‌షిప్ ఏమిటి?

    ఆటోదానితో ఫ్రెండ్‌షిప్ ఏమిటి?

    నిరుపమ్‌తో స్వప్న మాట్లాడుతూ.. ఆటో నడుపుకొనేదానితో నీకు ఫ్రెండ్ షిప్ ఏంటిరా అని అంటే.. ఆటో నడిపితే అంత చీప్ అయ్యానా? ఎక్స్‌ట్రా మమ్మీ అని ఊరుకొంటున్నాను అని అనగానే స్వప్న కొట్టడానికి చేయి ఎత్తింది. దాంతో చేయి పట్టుకొని నీవు మా సత్యం సార్ భార్యవని నేను వదిలేస్తున్నాను అని శౌర్య అనగానే.. స్వప్న కంగారు పడిపోయింది. నీకు మా ఆయన కూడా తెలుసా? అని స్వప్న అంటే.. సత్యం సార్‌కు ప్రేమ్‌కు వంట చేసేది నేనే అంటే..నిజమేనా అని స్వప్న ప్రశ్నించింది. దాంతో అవును అని ప్రేమ్ సమాధానం ఇచ్చాడు.

    ఆ డిస్కౌంట్ ఇవ్వను అంటూ శౌర్య

    ఆ డిస్కౌంట్ ఇవ్వను అంటూ శౌర్య


    శౌర్య వంట చేస్తుందని తెలియడంతో.. ఛీ ఛీ అంటూ స్వప్న ఎద్దేవా చేసింది. ఈ అలగా జనం చేత వంట చేయించుకొంటున్నారా? అని అనగానే.. అలగా ఇలగా అనకండి.. మాటలు మంచిగా రానివ్వండి అని శౌర్య అంటే.. ఏం చేస్తావని స్వప్న ప్రశ్నించింది. దాంతో ఇక ముందు సత్యం సార్ భార్య అని డిస్కౌంట్ కూడా ఇవ్వను. డైరెక్ట్‌గా ఫోర్త్ గేర్ పడుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం అని శౌర్య వార్నింగ్ ఇచ్చింది. దాంతో నీవు కాస్త ఆగు అని ప్రేమ అంటే.. ఏం చేస్తావే అంటూ స్వప్న మరోసారి చేయి ఎత్తగానే.. శౌర్య చేయిని గాల్లోనే ఆపింది.

    ఏం తింగరి అంటూ హిమను

    ఏం తింగరి అంటూ హిమను

    స్వప్నను ఉద్దేశించి నిన్ను అంటూ శౌర్య కొట్టడానికి చేయి లేపింది. వెనుక నుంచి నిరుపమ్ వచ్చి ఆపాడు. దాంతో శౌర్య చూసి ఆనందానికి గురి అయ్యింది. ఏంటి రౌడీ బేబీ. ఈ గొడవ అంటూ అనగానే.. ఇది నీకు కూడా తెలుసా? అని స్వప్న అడిగితే.. అవును అని సమాధానం చెప్పాడు. డాక్టర్ సాబ్ మీరు ఎక్కడేంటి? హిమను చూసి ఏం తింగరి ఏంటి ఇక్కడ అని అడిగింది. అంతలోనే ఏంటిరా దీనితో ఫ్రెండ్ షిప్ అని స్వప్ప అంటే.. మీరు గొడవ ఆపండి అని నిరుపమ్ చెప్పారు. దాంతో డాక్టర్‌కు ఆటో నడిపే దానితో ఫ్రెండ్‌షిప్ ఏంటి అంటే.. దోస్తానా ముందు అందరూ ఒక్కటే అని చెప్పింది.

    మనమంటే అత్తకు ఎందుకు కోపం?

    మనమంటే అత్తకు ఎందుకు కోపం?

    ఇక నిరుపమ్ పక్కన హిమ ఉండటంతో దీనిని తీసుకొని గుడికి రావడం ఏమిటి? నేను రమ్మంటే.. రానని చెప్పావు. దీనిని తీసుకొని గుడికి వస్తావా? అని స్వప్న అంటే.. గుడికి రావడం తప్పా అని శౌర్య అడిగింది. అయితే మా ఫ్యామిలీ విషయాల్లో దూరకు అని చెప్పి.. హిమను చూస్తూ.. నీకు చాలా ప్లాన్స్ ఉన్నాయనిపిస్తుంది. అలాంటి పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకోకు అని స్వప్న అంటే.. నీవు రా అమ్మా అని స్వప్నను చేయి పట్టుకొని ప్రేమ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే స్వప్న తనను ఉద్దేశించి అన్న మాటలను గుర్తు చేసుకొని హిమ బాధపడింది. అంతలోనే సౌందర్య, ఆనందరావు వచ్చి ఊరడించారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? అని అడిగితే.. స్వప్న అత్తమ్మకు మనమంటే ఎందుకు కోపం అంటే.. ఎప్పుడో ఒకసారి ఏదో అంటే.. అప్పటి నుంచి అలాగే బిహేవ్ చేస్తున్నది అని సౌందర్య చెప్పింది. ఒక మాట అంటే ఇంతలా తల్లిని ద్వేషిస్తుందా? అని అంటే.. స్వప్న విషయంలో నేను తప్పు చేశాను అని అంటే.. తప్పు చేస్తే ఇలా ద్వేషించాలా? అని హిమ అని అంటుంటే.. స్వప్ప అరుచుకొంటూ ఇంట్లోకి వచ్చింది. దాంతో సౌందర్యను అక్కడే ఉంచి ఆనందరావు కిందకు వెళ్లిపోయాడు.

    నాకు అమ్మ లేదు.. నాన్నే ఉన్నాడు అంటూ

    నాకు అమ్మ లేదు.. నాన్నే ఉన్నాడు అంటూ


    ఇంటికి వచ్చిన స్వప్నతో ఆనందరావు మాట్లాడుతుండగా.. ఏంటీ గేమ్స్ అని స్వప్న నిలదీసింది. అంతలోనే సౌందర్య వచ్చి.. ఏంటీ గేమ్స్ అంటున్నావు అని నిలదీసింది. అయితే నీతో మాట్లాడటం లేదు అని కోపంగా అరిచింది. పక్కనే హిమను చూసి.. నువ్వేంటి నా ఎదురుగా నిలబడ్డావు.. నిన్ను చూస్తుంటే.. నా తమ్ముడు గుర్తుకు వస్తున్నాడు.. వెళ్లిపో అనగానే.. అత్త మాటలకు నొచ్చుకొన్న హిమ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దాంతో స్వప్నపై కోపగించుకొంటూ.. నోటికి ఎంత వస్తే అంతనే అని సౌందర్య ఫైర్ అయింది. దాంతో డాడీ.. మీ ఆవిడను మాట్లాడవద్దని చెప్పు అంటే.. ఏం మాట్లాడుతున్నావు.. మా ఆవిడ. మా ఆవిడ అంటున్నావు. తను నీకు అమ్మ కాదా? అని నిలదీశాడు. దాంతో నాకు అమ్మలేదు. మీరు ఒక్కరే ఉన్నారు అంటూ స్వప్న తనదైన శైలిలో అరిచింది.

    English summary
    Most popular Karthika Deepam April 4th Episode number 1317.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X