For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam ఈ జన్మలో నిరుపమ్‌తో నీ పెళ్లి కాదు.. శౌర్య మాస్టర్‌ ప్లాన్‌కు చిత్తు!

  |

  నిరుపమ్‌తో పెళ్లికి ఏర్పాట్లు వేగం అందుకోవడం, స్వప్న తన ప్లాన్స్‌తో ముందుకెళ్తుండటంతో హిమ మనస్తాపానికి గురైంది. హిమ మూడ్‌ను క్లియర్ చేయడానికి సౌందర్య గోరింటాకు పెడుతూ మాటలు కలిపింది. అయితే మౌనంగానే ఉండటంతో.. హిమ.. నీవు పెషెంట్లు వచ్చి ఏదైనా చెబితే.. మాట్లాడకుండా ఉంటావా అంటూ సౌందర్య ప్రశ్నించింది. అంతలోనే ఒక్కరే పెట్టుకొంటావా.. శౌర్యకు కూడా గోరింటాకు పెడితే బాగుంటుంది కదా అని ఆనందరావు అంటే... ఇప్పటికే వారిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. మళ్లీ కొత్త గొడవ పెట్టకండి అని సౌందర్య అంది. దాంతో శౌర్య చూసిందంటే.. హిమ అంటేనే ప్రేమ.. నేనంటే ప్రేమ ఉండదని శౌర్య అంటుంది అని సౌందర్య చెప్పింది. కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1426లో ఏం జరిగిందంటే..

  నిరుపమ్‌తో శౌర్య పెళ్లి చేస్తా

  నిరుపమ్‌తో శౌర్య పెళ్లి చేస్తా

  గోరింటాకు పెడుతుంటే హిమ కంటతడి పెట్టింది. అయితే పెద్దవాళ్లం మీకు ఏం చేయాలో తెలుసు అని ఆనందరావు అంటే.. అవును తాత చెప్పేది విను. శౌర్య నిరుపమ్‌ను కోరుకొన్నది. కానీ నిరుపమ్‌కు శౌర్య అంటే ఇష్టం లేదు. ఇందులో సమస్య ఏమున్నది. నీకు లాజిక్ అర్ధం కావడం లేదు. పెళ్లైన తర్వాత ఆలోచిస్తే.. నిరుపమ్‌ను శౌర్యకు ఇచ్చి పెళ్లి చేయాలని.. నేను పిచ్చిగా ఆలోచించానని అనుకొంటావు అని సౌందర్య అంటే.. పెళ్లిళ్లు దేవుడు ఎప్పుడో రాసిపెట్టి ఉంటాడు. నీవు నిరుపమ్‌ను పెళ్లి చేసుకో. మీ జోడి బాగా ఉంటుంది అని ఆనందరావు అన్నాడు. దాంతో హిమ లేచిపోతూ.. నిరుపమ్, శౌర్యకు పెళ్లి చేసి తీరుతాను అంది. అయితే పెళ్లి రోజు ఏదైనా చేయాలని అనుకొంటున్నావా.. అలాంటి ఆలోచనలు మనసు నుంచి తీసి వేయి అని సౌందర్య చెప్పింది.

  వీడియో తీసి ప్రపంచానికి చూపిస్తా అంటూ

  వీడియో తీసి ప్రపంచానికి చూపిస్తా అంటూ

  స్వప్నను డాక్టర్ శోభ పొగడ్తల్లో ముంచేసింది. అంటీ మీరేంత మంచి వారు. ఇలా పెళ్లికి ముందే నన్ను బాగా చూసుకొంటున్నారు అని శోభ అంటే.. జీవితాంతం ఇలా కలిసి ఉండాలి అని స్వప్న అంటే.. ఇంత మంచి అత్తగారు దొరకడం చాలా అదృష్టం అని శోభ అంటే.. నీలాంటి కోడలు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను అని స్వప్న అంటుండగా.. శౌర్య అక్కడికి వచ్చి చప్పట్లు కొట్టింది. అబ్బబ్బా.. ఏ జన్మలో పుణ్యం చేసుకొన్నానో తెలియదు కానీ, అత్తా కోడళ్లను ఇలా చూడటం ఆనందంగా ఉంది. కాబోయే కోడలికి అత్త అన్నం తినిపిస్తున్నది. ఆహా క్యా సీన్ హై. అత్త కూడా అమ్మలాంటిది అనే మాట విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను. దీనిని వీడియో తీసి ప్రపంచానికి చూపించాలని అనుకొంటున్నాను. అంతలోనే సత్యం రావడంతో.. మీరు ఖాళీగా ఉన్నారు.. మీరు కూడా కాబోయే కోడలి సేవలో తరించండి అంటూ శౌర్య సెటైర్ వేసింది.

  కలర్‌ఫుల్‌గా కలలు కంటున్నావా?

  కలర్‌ఫుల్‌గా కలలు కంటున్నావా?

  డాక్టర్ శోభకు స్వప్న అన్నం తినిపిస్తుంటే.. ప్లేట్ తీసుకొని శౌర్య అన్నం తినిపించింది. డాక్టర్ శోభకు బలవంతంగా అన్నం తినిపిస్తూ.. జీవితం అన్నాక ఎన్నో అనుకొంటాం. అన్నీ అవుతాయా? ఏం అంటున్నావు నీవు అని స్వప్న ప్రశ్నిస్తే.. శోభ నీవు ఎన్నో కలలు కన్నావు కానీ.. అన్నీ కావు. నీవు ఎప్పటికీ ఈ ఇంటి కోడలివి కాలేవు అని శౌర్య అంటే.. దాంతో ఏయ్.. ఎక్కువ మాట్లాడుతున్నావు.. శోభనే నా ఇంటి కోడలు అవుతుంది అని స్వప్న అంటే.. మీ ఇద్దరికి ఓవర్ కాన్ఫిడెన్స్. శోభ కలర్‌ఫుల్‌గా కలలు కంటుంది. ఈమె ఉస్కో అంటే డిస్కో అంటున్నావు. నేను మర్యాదగా చెబుతున్నా వినండి అని శౌర్య అంటే.. నీ బెదిరింపులకు నేను బెదరను అని స్వప్న అంది. అయితే నేను బెదిరించడం లేదు. వాస్తవం చెబుతున్నాను అని శౌర్య చెప్పింది.

  నిరుపమ్ పెళ్లి మాత్రమే అవుతుంది

  నిరుపమ్ పెళ్లి మాత్రమే అవుతుంది

  శోభ ఎక్కిళ్లు పడినట్టు నాటకం ఆడటంతో స్వప్న వాటర్ తీసుకు రావడానికి ఇంట్లోకి వెళ్లింది. దాంతో ఇది మా మధ్య ఉన్న అనుబంధం. మా పెళ్లిని ఎవరు ఆపలేరు అని శోభ అంటే.. చాలా ఆశలు పెట్టుకొన్నట్టున్నావు. శౌర్య రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు అని శౌర్య అంది. అయితే మళ్లీ ఎక్కిళ్లు పడినట్టు నటించి.. ఇలా ఎక్కిళ్లు పడితే.. ఎవరో తలచుకొంటారని అంటారు. నాకు ఎక్కిళ్లు పడ్డాయంటే. నిరుపమ్ తలుచుకొన్నట్టే.. అని శోభ అంటే.. ఆశపడకు.. నీ పెళ్లి కాదు. డాక్టర్ నిరుపమ్ పెళ్లి మాత్రమే అవుతుంది అని శౌర్య వార్నింగ్ ఇచ్చి.. శోభ ముఖానికి పెరుగు అన్నం రాసి వెళ్లిపోయింది.

  లెటర్ చదివిన నిరుపమ్..

  లెటర్ చదివిన నిరుపమ్..

  హిమ పెళ్లి పనులు, వేడుకలు సౌందర్య ఇంటిలో మొదలయ్యాయి. ఆనందరావు, సౌందర్య ఇద్దరూ చాలా హ్యాపీగా కనిపించారు. అయితే తన ఇంటిలో నిరుపమ్ నిరుత్సాహంగా ఉంటే.. తల్లి స్వప్న ఓ లెటర్ తీసుకొచ్చి నిరుపమ్‌కు ఇచ్చింది. ఈ లెటర్ చదివిన తర్వాత కూడా నీవు హిమనే పెళ్లి చేసుకొంటానంటే.. ఇక నీ ఇష్టం అని స్వప్న చెప్పింది. లెటర్ చూసిన నిరుపమ్ మమ్మీ అంటూ కంగారు పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి కొడుకులా ముస్తాబయ్యాడు. కొడుకును చూసి నీ మనసు బంగారం నాన్న. అమ్మ మాట కాదనవని తెలుసు. అమ్మ కోసం ఏదైనా చేస్తావని తెలుసు అని స్వప్న మురిసిపోయింది. ఇదిలా ఉంటే.. శౌర్య ఓ చోటికి వెళ్లి తలుపుకొట్టి.. ఆ ఇంటిలో వ్యక్తిని చూసి నవ్వింది.

  Recommended Video

  NASA అంతరిక్షంలోకి Athira Preeta Rani... ఎవరీమె? *Trending | Telugu OneIndia
  శౌర్య మాస్టర్ ప్లాన్ ఏంటో?

  శౌర్య మాస్టర్ ప్లాన్ ఏంటో?

  కార్తీకదీపం తాజా ప్రోమోలో చాలా ట్విస్టులు కనిపించాయి. పెళ్లికొడుకుగా ముస్తాబైన నిరుపమ్‌తో శోభ పెళ్లికూతురిలా తయారై ఫోటో దిగింది. ఆ ఫోటోను చూసిన హిమ కంటతడి పెట్టుకొన్నది. దాంతో శౌర్య వచ్చి.. ఏం జరిగింది అని అడిగితే.. మొబైల్‌లో ఆ ఫోటోను చూపించారు. అయితే ఆపండి.. శోభ పెళ్లి జరగదు అని శౌర్య అంటే.. ఏంటి నీ కాన్ఫిడెన్స్ అని అంటే.. నాతో రండి అంటూ శౌర్య తీసుకెళ్లింది. ఆ తర్వాత సౌందర్య కుటుంబ సభ్యుల ముందు శోభను స్వప్న చెంపదెబ్బ కొట్టడం ట్విస్టుగా మారింది.

  English summary
  Karthika Deepam 9th August Episode number 1426.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X