For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కౌశల్ సినిమా అనౌన్స్మెంట్.. శంకర్ డైరెక్షన్, జీతూ జోసెఫ్ కధ, కాంబో మామూలుగా లేదుగా!

  |

  బిగ్ బాస్ రెండో సీజన్ విజేత కౌశల్ సోషల్ మీడియాలో ఎంతగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోను, ఆడే ఆటను మొత్తం మార్చేశాడు కౌశల్. ఎట్టకేలకు ఆయన నుంచి సినిమా ప్రకటన వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  కెరీర్ అంతంతమాత్రమే

  కెరీర్ అంతంతమాత్రమే

  బిగ్ బాస్ హౌస్ లో కౌశల్ ఆడిన ఆటకు ఎంతో మంది అభిమానులున్నారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడూ ట్రోలింగ్ జరిగింది. బయటకు వచ్చాక కూడా ఆయన మీద భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ కౌశల్‌కు బిగ్ బాస్ వల్ల ఒరిగిందేమీ లేదు. సినిమా అవకాశాలు కూడా అంతగా రాలేదు. కెరీర్ కూడా అంతగా ఊపందుకోలేదు.

  వివాదాలకు కేరాఫ్

  వివాదాలకు కేరాఫ్

  నిజానికి బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచే కౌశల్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్, దాని ఫండ్స్, డాక్టరేట్ విషయం, ప్రధాని ఆఫీస్ నుంచి ఫోన్ ఇలా ప్రతీ ఒక్క అంశంలో కౌశల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇలా అన్నింట్లోనూ కౌశల్ పరువుదీసుకున్నాడు.

  Raj Kundra : క్రైం బ్రాంచ్ కి లంచం.. శిల్పా శెట్టితో సంబంధం గురించి ఏం చెప్పారంటే?

  సత్తా చాటుకోలేక

  సత్తా చాటుకోలేక

  అయితే కౌశల్‌కు ఒకానొక సమయంలో విపరీతమైన ఆఫర్లు వచ్చాయని రూమర్లు జోరందుకున్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా కౌశల్ వెండితెరపై తన సత్తా చాటుకోలేకపోయాడు. ఈ మధ్యే ఆది సాయి కుమార్ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఆయన లీడ్ గా సినిమా అంటే గగనమే అని భావిస్తున్న సమయంలో ఒకఆసక్తికర ప్రకటన చేశారు.

  మంగ్లీ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన కరాటే కళ్యాణి.. సిరివెన్నల, తనికెళ్ళ భరణిని లాగుతూ సంచలన వ్యాఖ్యలు!

  జీతూ జోసెఫ్ కధ

  జీతూ జోసెఫ్ కధ

  '' The wait is over & happy to announce my dream project.గత మూడు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తూ నన్ను "పీపుల్ స్టార్" గా పిలుచుకుంటూ ఆనందిస్తూ, అన్నా నిన్ను బిగ్ స్క్రీన్ మీద హీరో గా చూడాలను వుంది ఆ అవకాశం మాకు ఎప్పుడు వస్తుంది అంటూ ప్రతీ రోజు అడుగుతూ వారి కోరిక తీర్చటమే నా కలగా మార్చిన నా అభిమానులందరి కోసం ఈ రోజు మీ అందరి రోజు గా చేస్తూ నేను హీరో గా నటిస్తున్న "రైట్" మూవీ ముహూర్తం షాట్ మీతో పంచుకోవాలనిఅనుకుంటున్నా.ఎప్పటి లాగే మీ ప్రేమ , అభిమానం నా మీద, మా మూవీ యూనిట్ మొత్తం మీద చూపిస్తారని నాకు తెలుసు love you all, అంటూ ఆయన తన సోషల్ మీడియా వేదికగా సినిమాని ప్రకటించారు.

  Kaushal Manda Breaks His Mobile Gifted By Bigg Boss
  జీతూ జోసెఫ్ కధ

  జీతూ జోసెఫ్ కధ

  ఈ సినిమాకి శంకర్ అనే ఆయన దర్శకత్వం వహించనుండగా లుకాలపు మధు, మహంకాళి దివాకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక విజయ్ కూరాకుల సంగీతం అందించనున్న ఈ సినిమాకి ఈవీవీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. అన్నట్టు ఈ సినిమాకు దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ కధ అందిస్తున్నారు.

  English summary
  Actor-Bigg Boss Telugu season 2 winner Kaushal Manda has announces his new movie right
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X