For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కౌశల్ కాళ్లకు దండం పెట్టిన సుమ.. ఫ్యాషన్ షోలో తిప్పాల్సింది అది అంటూ క్లాసులు

  |

  బుల్లి తెరను తరతరాలుగా ఏలేస్తున్న మకుటం లేని మహారాణి సుమ.. ఏ షో చేసిన అది హిట్టే. స్టార్ మహిళ అంటూ ఎన్నో రికార్డులను సృష్టించిన సుమ.. బుల్లి తెర ప్రేక్షకులను దత్తత తీసుకున్నట్లు కనిపిస్తోంది. నిరంతరం వారిని నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. స్టార్ మహిళా అంటూ కొన్నేళ్లుగా మహిళా లోకాన్ని ఏలేసిన సుమ.. కొత్త కొత్త ప్రోగ్రామ్స్‌తో ప్రేక్షకులను నవ్వించేందుకు ప్రయత్నిస్తూ ఉంటోంది.

   ఎఫ్3తో సందడి..

  ఎఫ్3తో సందడి..

  తాజాగా స్టార్ మా చానెల్‌లో ఎఫ్3 అనే షో ప్రసారం అవుతోన్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీల ఫ్యామిలను తీసుకువచ్చి వారితో సరదగా ఆటలు ఆడించి అందర్నీ ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పటికే ఈ షోలో జబర్దస్త్ ఫేమ్ గెటప్ శీను, వేణు లాంటి వారు పాల్గొనగా..బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ఫుల్ ఫన్ క్రియేట్ చేసింది.

  బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో ఆటలు..

  బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో ఆటలు..

  బిగ్‌బాస్ హౌస్‌లోంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఎఫ్3లోకి తీసుకొచ్చి అక్కడి విశేషాలను ప్రేక్షకులకు తెలిసేలా చేసేంది. రవికృష్ణ, అతని మామ వేసిన పంచ్‌లు, మహేష్ విట్టా చేసిన కామెడీ, ఆ షోలో తన ఫ్రస్ట్రేషన్‌ను తీర్చుకున్న హిమజ, పునర్నవిని ఇరకాటంలోకి నెట్టే ప్రశ్నలతో సుమ అడిగిన ప్రశ్నలు వైరల్‌గా మారాయి.

  తాజాగా ఎంట్రీ ఇచ్చిన కౌశల్..

  బిగ్‌బాస్ రెండో సీజన్ లాంటిది మరొకటి రాదని అందరూ ఏకాభిప్రాయంతో చెప్పే మాట అది. అందులోని కంటెస్టెంట్లు, కౌశల్ ఆట తీరు, అతనికి పెరిగిన ఫాలోయింగ్, ర్యాలీలు చేపట్టడం లాంటి వాటితో బిగ్‌బాస్ షో క్రేజ్ ఎక్కడికో పోయింది. బిగ్‌బాస్ విన్నర్‌గా గెలిచాక కౌశల్ చేష్టలు కూడా ఎంతగానో వైరల్ అయ్యాయి. డాక్టరేట్ పట్టా, పీఎంఓ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పడం లాంటి వాటితో కౌశల్‌పై నెగెటివ్ ట్రోలింగ్ పెరిగిపోయింది. తాజాగా కౌశల్ సుమ నిర్వహించే ఎఫ్3లో పాల్గొన్నాడు.

  కౌశల్‌కు కాళ్లకు దండం పెట్టిన సుమ

  కౌశల్‌కు కాళ్లకు దండం పెట్టిన సుమ

  ఈ షోలో భాగంగా కౌశల్ గురించి చెబుతూ.. ఆయన దగ్గర సలహాలు తీసుకుంటే టాప్ మోడల్ అయిపోవచ్చు అని చెబుతూ.. పెద్ద మోడల్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి అంటూ ఫన్నీగా కౌశల్ కాళ్లకు దండం పెట్టింది. అనంతరం క్యాట్ వాక్ చేసిన సుమకు కౌశల్ గట్టి పంచ్ వేశాడు. తిప్పాల్సింది నోరు, చేతులు కాదంటూ కౌంటర్ వేయగా.. సుమ కూడా రివర్స్ కౌంటర్ వేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి.

  #CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
   కొత్త సీరియల్‌తో బిజీ

  కొత్త సీరియల్‌తో బిజీ

  ఈ మేరకు ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయ్యే సీరియల్‌కు సంబంధించిన వీడియో ప్రోను షేర్ చేస్తూ.. ‘ఆది శంకర వస్తున్నాడు. నన్ను ప్రతి రోజూ పది గంటలకు మిస్ అవకండి' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో టీవీ సీరియల్స్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపాడు. ఇక తమ అభిమాన కంటెస్టెంట్ కౌశల్ బుల్లితెరపై కనబడతాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

  English summary
  Bigg Boss 2 Telugu Winner Kaushal Manda, Is Participated In Suma F3 praogram. Kaushal Gave Counter To Suma, Immediately She Given Reveres Counter. Kaushal Shared A Promo That.. Catch me today in F3 show for FAMILY,FUN & FRUSTRATION starmaa 12 noon. lot more to come...stay Tuned.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X