KBC 13 Registration Question No.4: అమితాబ్ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పగలరా?

కరోనావైరస్ సమయంలో తల్లడిల్లిపోతున్న ప్రజలకు వినోదంతోపాటు విజానం అందించే విధంగా సోని ఎంటర్‌టైన్‌మెంట్ కౌన్ బనేగా కరోడ్‌పతి రియాలిటీ షోను సిద్ధం చేస్తున్నది. ఈ రియాలిటీ గేమ్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక కోసం సోనీ ఛానెల్‌తోపాటు సోని లివ్ యాప్‌లో ఔత్సాహిక కంటెస్టెంట్లకు ప్రశ్నలను సంధిస్తున్నది.

కేబీసీ 13 షో కోసం కంటెస్టెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మే 13 తేదీన నాలుగో ప్రశ్నను వేసింది. ఈ షో కోసం వేసిన నాలుగో ప్రశ్న ఏమిటంటే...

ఈ కింద పేర్కొన్న ఏ రెండు సముద్రాలు సూయజ్ కెనాల్‌తో అనుసంధానం అయింది (Which two seas are connected by the Suez Canal?)

A) The Caspian Sea and the Black Sea,
B) The Red Sea and the Mediterranean Sea
C) The Adriatic Sea and the Red Sea
D) The North Sea and the Tyrrhenian Sea

పైన అడిగిన ప్రశ్నకు సమాధానం B) The Red Sea and the Mediterranean Sea

KBC13s 4th Question on May 14th for registrations

పై ప్రశ్నకు సరైన సమాధానాన్ని Sony Liv యాప్‌ ద్వారా మే 14 తేదీ రాత్రి 9 గంటలలోపు పంపించాల్సి ఉంటుంది. సరైన ప్రశ్నలు పంపిన వారిని తుది రౌండ్‌కు లాటరీ పద్దతిలో ఎంపిక చేసి ఔత్సాహిక కంటెస్టెంట్లతో నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతారు.

గత ఏడాది లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కేబీసీ 12వ సీజన్‌ను అమితాబ్ బచ్చన్ మొదలుపెట్టారు. ఈ సమయంలోనే అంటే జూలై 2020లో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఇద్దరికి కోవిడ్ సోకింది. ఆ తర్వాత ఈ షోను ప్రారంభించి అభిమానులను ఆకట్టుకొన్నారు.

బ్రిటన్‌లో హూ వాంట్స్ టూ బీ ఏ మిలియనీర్ అనే కార్యక్రమం ఆధారంగా తెలుగులో కౌన్ బనేగా కరోడ్‌పతి షో ప్రారంభించారు. 2000 సంవత్సరం నుంచి ఏకధాటిగా ఈ షోకు అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X