Keerthy Suresh గుడ్ లక్ సఖీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మహా నటి ఫేమ్ కీర్తీ సురేష్ నటించిన గుడ్ లక్ సఖీ చిత్రం థియేట్రికల్ రన్‌లో పూర్తిగా నిరాశపరిచింది. స్పోర్ట్స్ కథా నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. జగపతి బాబు, ఆది పినిశెట్టి నటించగా, ఈ సినిమాకు పాపులర్ దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధం చేశారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..

Keerthy Sureshs Good Luck Sakhi

గుడ్ లక్ సఖీ చిత్రం విషయానికి వస్తే.. రాయలసీమ ప్రాంతంలోని గిరిజన తెగకు చెందిన షకీ పామర్ అనే యువతి ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అయితే జీవితంలో అనేక వైఫల్యాలు చవిచూడటంతో ఆమెను అందరూ బ్యాడ్ లక్ సఖీ అని పిలుస్తుంటారు. సఖీ కనిపిస్తే అపశకునంగా భావిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి కల్నల్ (జగపతిబాబు) వస్తాడు. గ్రామీణ ప్రాంతంలో మంచి షూటర్‌ను తయారు చేయాలనే లక్ష్యంతో ఉంటాడు. ఆ సమయంలో సఖీని కల్నల్ గుర్తిస్తాడు. ఆ తర్వాత సఖీని షూటర్‌గా మార్చాడా? బ్యాడ్ లక్ సఖీ కాస్త గుడ్ లఖ్ సఖీ అయిందా అనే ప్రశ్నలకు సమాధానమే గుడ్ లక్ సఖీ సినిమా కథ.

అయితే థియేట్రికల్ రిలీజ్ తర్వాత గుడ్ లక్ సఖీ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నామని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. గుడ్ లక్ సఖీ చిత్రాన్ని ఫిబ్రవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ చిత్రాన్ని దాదాపు 240 దేశాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలిపారు.

నటీనటులు: కీర్తీ సురేష్, జగపతి బాబు, ఆది పినిశెట్టి, రాహుల్ రామకృష్ణ, రఘుబాబు తదితరులు
దర్శకత్వం: నగేశ్ కుకునూర్
నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి: చిరంతన్ దాస్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X