»   » ‘కిక్ 2′: శాటిలైట్ రేటు అదిరిపోయింది

‘కిక్ 2′: శాటిలైట్ రేటు అదిరిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా కిక్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం కిక్-2. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. మరోసారి రవితేజ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చాడు. కిక్ తరహాలోనే ఈ సీక్వెల్ సినిమాకు కూడా హుషారెత్తించే బాణీలందించారు. అవి ఇప్పుడు అంతటా ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ సినిమాపై భారీ అంచనలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రిలీజ్ కి ముందే ఓ బంపర్ ప్రైజ్ కి అమ్ముడుపోయాయి. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని వరు సుమారు 7.5 కోట్లకి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని దక్కించుకున్నారు. రిలీజ్ కి ముందే ఈ రేంజ్ రేటు పలకడంతో నిర్మాత కళ్యాణ్ రామ్ చాలా హ్యాపీగా ఉన్నాడు.


Kick 2 satellite rights sold for a fancy price

కిక్ 2 సినిమాతో మరోసారి కామెడీ టైమింగ్ పరంగా తనలోని కొత్త యాంగిల్ ని చూపనున్నాడు. అలాగే కిక్ 2 లో మానరిజమ్స్ కూడా సరికొత్తగా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో కూడా ఎంటర్ టైన్మెంట్ లెవల్స్ మరియు కాండీ హై రేంజ్ లో ఉండేలా సురేందర్ రెడ్డి ప్లాన్ చేసాడు. ఇలా రవితేజలోని మరో సరికొత్త కోణాన్ని చూపించనున్న కిక్ 2 సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


రవితేజ మాట్లాడుతూ కిక్-2 ప్రేక్షకులకు డబుల్ కిక్‌నిస్తుంది. ఇందులో నటించిన రకుల్‌కు మంచి భవిష్యత్తుంది. నాకు ఇష్టమైన వ్యక్తుల్లో కళ్యాణ్‌రామ్ ఒకరు. ఎక్కడా రాజీపడని నిర్మాత ఆయన. సినిమాకు మనోజ్ పరమహంస అద్భుతమైన ఫోటోగ్రఫీని అందించాడు. కిక్ సినిమాతో సురేందర్‌రెడ్డితో నా ప్రయాణం మొదలైంది. ఆరేళ్ల తరువాత కిక్-2 చేస్తున్నాం.


Kick 2 satellite rights sold for a fancy price

అన్నీ కుదిరితే కిక్-3 చేయడానికి సిద్ధమే అన్నారు. సురేందర్‌రెడ్డి, రవితేజ కథ వినగానే సినిమా చేయడానికి అంగీకరించారు. మా సంస్థలో వస్తున్న ఏడవ సినిమా ఇది అని కళ్యాణ్‌రామ్ తెలిపారు. సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ అతనొక్కడే విడుదలై పది సంవత్సరాలవుతోంది. కళ్యాణ్ గట్స్‌తో ఆ సినిమా తీశాడు. అలాగే కిక్-2 కథ విని మంచి బడ్జెట్ ఇచ్చి ఈ సినిమా చేశాడు. తను లేకుంటే కిక్-2 లేదు. రవితేజతో కిక్-3 చేయడానికి రెడీ అన్నారు.


ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు(సీనియర్ ఎన్టీఆర్) పుట్టిన తేది అయిన మే 28,2015 న విడుదల చేయటానికి నిర్మాత నందమూరి కళ్యాణ రామ్ నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, సంగీతం: యస్‌.యస్‌.థమన్‌, కెమెరా: మనోజ్‌ పరమహంస, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: నారాయణరెడ్డి, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌.

English summary
Satellite rights of Ravi Teja’s Kick 2 have been bagged by Gemini TV for a whopping 7.5 crores.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu