For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Dhee షోలో షాకింగ్ సీన్: శ్రద్దా దాస్‌, ప్రదీప్‌తో కిరణ్ గొడవ.. ఏడ్చుకుంటూ వెళ్లిపోయిన హీరోయిన్

  |

  తెలుగు బుల్లితెరపైకి ఎన్నో కార్యక్రమాలు వస్తుంటాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ ఉంటాయి. అదే సమయంలో ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాయి. అలాంటి కార్యక్రమాల్లో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'ఢీ' ఒకటి. దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందిన ఇది.. సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 14వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోలో కిరణ్ మచ్చా గొడవ చేయడం సంచలనంగా మారింది. దీంతో హీరోయిన్ శ్రద్దా దాస్ ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

  తెలుగలో హవాను చూపిస్తోన్న ఢీ

  తెలుగలో హవాను చూపిస్తోన్న ఢీ


  తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల డ్యాన్స్ షోలు వచ్చాయి. అయితే, అందులో 'ఢీ' మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణను అందుకుంది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ డ్యాన్స్ షో అనిపించుకుంటోంది. దీంతో దీనికి ఆదరణ భారీ స్థాయిలో పెరుగుతూనే ఉంది.

  క్లోజప్ ఫొటోల్లో తెలుగు హీరోయిన్ అందాల విందు: స్లీవ్‌లెస్ టాప్‌లో యమ హాట్‌గా!

  పదమూడు కంప్లీట్.. ఐకాన్ కోసం

  పదమూడు కంప్లీట్.. ఐకాన్ కోసం

  'ఢీ' షో ఇప్పటికే పదమూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే పద్నాలుగో దానిని కూడా చాలా రోజుల క్రితమే ప్రారంభించారు. 'ద డ్యాన్సింగ్ ఐకాన్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా మొత్తం కొత్త వాళ్లను తీసుకొచ్చారు. నాలుగు జట్లు ఇందులో పోటీ పడుతున్నాయి. దీనికి కూడా ప్రేక్షకుల నుంచి స్పందన మరింతగా దక్కుతోంది.

  14వ సీజన్ ఎలా సాగుతుందంటే

  14వ సీజన్ ఎలా సాగుతుందంటే

  'ద డ్యాన్సింగ్ ఐకాన్' సీజన్‌ను సోలో, కపుల్స్, చాంపియన్స్, లేడీస్ టీమ్‌ల మధ్య పోటీగా మొదలెట్టారు. ఇందులో హైపర్ ఆది ఒక టీమ్‌కు నవ్య స్వామి, రవికృష్ణ మరో టీమ్‌కు కొందరు సెలెబ్రిటీలు మిగిలిన టీమ్‌లకు మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. జడ్జ్‌లుగా గణేష్ మాస్టర్, నందితా శ్వేత, శ్రద్దా దాస్ ఉన్నారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నాడు.

  పవన్ కల్యాణ్‌కు తీవ్ర అనారోగ్యం: అతడు చేసిన పని వల్లే.. డాక్టర్లు ఏం చెప్పారంటే!

  కొరియోగ్రాఫర్ స్పెషల్ రౌండ్‌తో

  కొరియోగ్రాఫర్ స్పెషల్ రౌండ్‌తో


  'ద డ్యాన్సింగ్ ఐకాన్' సీజన్‌లో ప్రతి వారం సరికొత్త కాన్సెప్టును పరిచయం చేస్తున్నారు. ఇలా వచ్చే బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో కొరియోగ్రాఫర్ స్పెషల్ రౌండ్‌ను జరపబోతున్నారు. అంటే కంటెస్టెంట్‌తో పాటు వాళ్ల కొరియోగ్రాఫర్ కూడా డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను ఢీ షో నిర్వహకులు విడుదల చేశారు.

  శ్రద్దా దాస్ డ్యాన్స్.. కిరణ్ గొడవ

  శ్రద్దా దాస్ డ్యాన్స్.. కిరణ్ గొడవ

  'ద డ్యాన్సింగ్ ఐకాన్' సీజన్‌లో కొరియోగ్రాఫర్ స్పెషల్ రౌండ్‌లో చైతన్య మాస్టర్ రాజశేఖర్ పాటలకు డ్యాన్స్ చేశాడు. దీంతో గతంలో ఆ స్టార్ హీరోతో కలిసి పని చేసిన శ్రద్దా దాస్ వచ్చి అదిరిపోయే స్టెప్పులు వేసింది. దీంతో ఈ షోలో భాగంగా ఉన్న ప్రాంక్‌స్టార్ కిరణ్ మచ్చా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా ఆగలేదు.

  లవర్‌తో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: నైట్ టైమ్ అతడితో యమ హాట్‌గా!

  శ్రద్దా దాస్‌, ప్రదీప్‌తో కిరణ్ ఫైట్

  పిల్లల టీమ్‌కు సపోర్ట్ చేసేందుకు వచ్చిన కిరణ్.. శద్దా దాస్ వచ్చి డ్యాన్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'మా పిల్లలు కూడా మంచిగానే డ్యాన్స్ చేశారు. కానీ, మేడం ఇప్పుడు వచ్చి డ్యాన్స్ చేశారు. దీనిబట్టి ఆమె ఏకపక్షంగా చేస్తున్నట్లు అనిపిస్తోంది' అంటూ ప్రదీప్‌తో గొడవకు దిగాడు. ఆ తర్వాత శ్రద్దా దాస్ కూడా అతడితో ఫైట్ చేసింది. దీంతో ఇది పెద్ద వివాదమైంది.

  ఏడ్చిన శ్రద్దా దాస్.. ప్రదీప్ అలా

  ఏడ్చిన శ్రద్దా దాస్.. ప్రదీప్ అలా

  కిరణ్ మచ్చా.. యాంకర్ ప్రదీప్‌, హైపర్ ఆదితో కూడా తీవ్రమైన పదజాలంతో గొడవ పెట్టుకున్నాడు. చివరకు ఇది పెద్ద రాద్దాంతం అయిపోయింది. దీంతో శ్రద్దా దాస్ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అంతేకాదు, యాంకర్ ప్రదీప్ సైతం అక్కడి నుంచి వాకౌట్ చేసేశాడు. దీంతో ఇది సంచలనం అవుతోంది. ఫలితంగా ఈ ప్రోమో వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Dhee is an Indian dance reality show. This Was telecasting in ETV. Kiran Macha Fight with Shraddha Das in This Show An Upcoming Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X