For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: హాట్ టాపిక్‌గా లహరి షారి రెమ్యునరేషన్ ఎంత.. మూడు వారాలకు ఎంతంటే?

  |

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొత్తానికి మూడు వారాలు పూర్తి చేసుకుంది. అయితే మొదటి మూడు వారాల్లో కూడా అమ్మాయిలే ఎలిమినేట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ తెలుగులో మొదలైనప్పటి నుంచి కూడా ఎక్కువగా అబ్బాయిలే హైలెట్ అవుతూ వస్తున్నారు అని కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాకుండా టైటిల్ విన్నర్ విషయంలో కూడా అమ్మాయిలకు అన్యాయం జరుగుతోందని విమర్శలు కూడా చాలా సార్లు వచ్చాయి. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 లో వరుసగా సరయు ఉమాదేవి లహరి ఎలిమినేట్ అయ్యారు. ఇక లహరికి రెమ్యునరేషన్ ఎంత తీసుకుందనేది హాట్ టాపిక్ గా మారింది.

   గ్లామర్ తో ఎక్కువగా..

  గ్లామర్ తో ఎక్కువగా..

  తదుపరి వారం ఎవరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్ లో ఉన్నటువంటి అందరు కంటెస్టెంట్స్ కూడా చాలా బలంగా ఉన్నారు ఇక మూడు వారాలపాటు హౌస్లో సందడి చేసినటువంటి లహరీ షరీఫ్ బిగ్ బాస్ నుంచి ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుందనేది హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో మూడవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టినటువంటి లహరి తప్పకుండా మరి కొన్ని వారాల పాటు ఉంటుంది అని అందరూ అనుకున్నారు. గొడవలతో ఎక్కువగా హైలెట్ కాకపోయినప్పటికీ ఎక్కువగా గ్లామర్ తో కనిపిస్తూ కుర్రాళ్లను ఎంత గారు ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా శ్రీ రామచంద్రతో ఆమె చాలా క్లోజ్ గా కనిపించింది.

  కన్ఫ్యూజ్ చేస్తోందని..

  కన్ఫ్యూజ్ చేస్తోందని..

  అలాగే మరోవైపు లోబోతో కూడా అప్పుడప్పుడు కామెడీ చేస్తూ కనిపించింది. లహరి బిగ్ బాస్ హౌస్ లో ఒక విధంగా గ్లామర్ భారాన్ని తనపైనే మోసింది. ఆమె అందాన్ని చూసి లోబో చాలా సార్లు ఫిదా అయ్యాడు. ఇటీవల నాగార్జున తో కూడా అదే విషయాన్ని చెప్పాడు. ప్రతిరోజు గ్లామరస్ డ్రెస్ లో కనిపిస్తూ కన్ఫ్యూజ్ చేస్తోందని అసలు ఇంత అందం చూసి నేను తట్టుకోలేక పోతున్నాను అని చాలా ఓపెన్ గా చెప్పేశాడు. ఒక విధంగా లహరిపై పాజిటివ్ గా స్పందిస్తూనే మరోవైపు ఆమె హౌస్ లోకి లోపలి నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పాడు.

  ప్రియ విషయంలో పొరపాటు

  ప్రియ విషయంలో పొరపాటు


  లహరి బయటకు వెళ్లి పోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఆమె రవి గేమ్ లో బలి అయ్యిందనే చెప్పాలి. యాంకర్ అవ్వడం కోసం అతని చుట్టూ తిరుగుతుందని రవి ప్లే చేసిన ఆటలో బలిపశువుగా మారినట్లు క్లియర్ గా అర్ధమయ్యింది. లహరి ప్రియ విషయంలో ఇలాంటి పొరపాటు చేయడం కూడా అభిమానులకు చిరాకు తెప్పించింది. ఒకవిధంగా ప్రియకు అది చాలా హెల్ప్ అయింది అని చెప్పవచ్చు.

   ఆ గొడవల ప్రభావం..

  ఆ గొడవల ప్రభావం..


  అసలు అయితే ఈ సారి బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియ వెళ్లి పోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. లహరి వెళ్లిపోవడానికి పెద్దగా కారణాలు కూడా ఆమెకు దొరకలేదు. పైగా హౌస్ లో ఆమె ఎక్కువగా గ్లామర్ తో ఆకట్టుకుందని అందుకే ఆమె వెళ్లి పోయే అవకాశం లేదని ఊహించుకున్నారు. కానీ ప్రియా రవి మధ్యలో జరిగిన గొడవల్లో ఫైనల్ గా లహరి బలి కావాల్సి వచ్చింది.

  Recommended Video

  Heroine Shwetta Parashar About 'Alanti Sitralu' Movie
   రెమ్యునరేషన్ ఎంతంటే..

  రెమ్యునరేషన్ ఎంతంటే..

  ఇక లహరి బిగ్ బాస్ హౌస్ ఏ స్థాయిలో ర్రెమ్యునరేషన్ అందుకుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మూడు భాగాలుగా కంటెస్టెంట్స్ ను విభజించి ప్యాకేజీలను అందిస్తున్న బిగ్ బాస్ లహరిని రెండవ కేటగిరీలో వేసినట్లు సమాచారం. ఇక ఆమెకు వారానికి 1.50లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మూడు వారాలకు గానీ మొత్తంగా లహరి బిగ్బాస్ నుంచి 5 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఇక బయటకు వెళ్లిన తర్వాత బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో ఇంకా ఆమె ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

  English summary
  Lahari Shari bogg boss telugu 5 remuneration details,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X