»   »  బిగ్ బాస్ ఒక చెత్త షో, భారతీయతకు చెడ్డ పేరు: తమిళ నటి విమర్షల వర్షం

బిగ్ బాస్ ఒక చెత్త షో, భారతీయతకు చెడ్డ పేరు: తమిళ నటి విమర్షల వర్షం

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్ బాస్ షో అనగానే రకరకాల కంట్రవర్సీలూ గొడవలే గుర్తుకు వస్తాయి. తెలుగులో పరవాలేదు గానీ తమిళ బిగ్‌ బాస్‌ షోకు స్టార్స్‌ కరువయ్యారు. అంతే కాదు ఈ సారి అసలు షో మొదలు కాకముందే ఓ వివాదానికి తెరలేపేసింది తమిళ నటి , దర్శకురాలు అయిన లక్ష్మీ రామకృష్ణన్., అదొక చెత్త షో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది . బిగ్ బాస్ షో వల్ల కుటుంబంలో మనస్పర్థలు చెలరేగడం ఖాయమని ఆ షో మన భారతీయతకు చెడ్డ పేరు తీసుకు వచ్చే షో అని మరీ ముఖ్యంగా దక్షిణాది వాళ్లకు మరింత చేటు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసింది.

కుటుంబ సభ్యుల్లో కూడా

కుటుంబ సభ్యుల్లో కూడా

వ్యక్తిగత మనోభావాలు దెబ్బ తింటాయని..స్వేచ్చగా బతికే వాళ్ల ను బంధించినట్లు అవుతుందని ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడటం వల్ల కుటుంబ సభ్యుల్లో కూడా అభిప్రాయ భేదాలు రావొచ్చని , అంతే కాదు బిగ్ బాస్ షోలో నన్ను పాల్గొనమని కోరారని కానీ నేను మాత్రం పది కోట్ల రూపాయలు ఇచ్చినా చేయను అని ఖచ్చితంగా చెప్పానని అంటోంది.

ఆడ , మగ అనే తేడా లేకుండా

ఆడ , మగ అనే తేడా లేకుండా

ఆడ , మగ అనే తేడా లేకుండా అపరిచితులతో కలిసి బిగ్ బాస్ హౌజ్ లో ఉండాలి . రెండు నెలల పాటు సాగే ఈ వ్యవహారం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బ తింటాయని ఆవేదన వ్యక్తం చేసింది.తెలుగు టీవీ చరిత్రలో అత్యంత ఖర్చుతో తీస్తున్న రియాలిటీ షో 'బిగ్ బాస్' 10 వేల చదరపుటడుగుల విశాలమైన అతిపెద్ద సెట్‌లో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు.

60 కెమెరాలు

60 కెమెరాలు

సుమారు 750 మంది ఈ షో కోసం పనిచేస్తున్నారు.60 కెమెరాలు నిరంతరాయంగా ఈ షో కోసం పనిచేస్తూ ఉంటాయట. డబ్బై రోజుల పాటు ఓ పెద్ద ఇంట్లో 60 కెమెరాల మధ్య వారు బంధీలుగా ఉంటారు. వారి సొంత పనులను వారే చేసుకుంటూ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ డబ్బై రోజులూ ఎలా గడిపారన్నది ఆసక్తిగా ఉంటుంది.

ఒక రెవల్యూషన్

ఒక రెవల్యూషన్

బిగ్ బాస్ ఇండియన్ బుల్లితెర రియాలిటీ షోల చరిత్ర లోనే ఒక రెవల్యూషన్ కొంత మంది సెలబ్రెటీలను ఒకే చోట ఉంచి వారి చుట్టూ కెమెరాలు పెట్టి వారి ప్రతి కదలికను రికార్డు చేస్తూ చూపించే ప్రోగ్రామ్ ‘బిగ్ బాస్' షో. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ సాధించింది.

తమిళ, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా

తమిళ, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా

ఈ ప్రోగ్రామ్ ని తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా తీసుకు వచ్చారు. కాగా తమిళం లో ఈ షో ని కమల్ హసన్ నిర్వహిస్తున్నాడు . ఇక తెలుగు బుల్లితెరపై మొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఈ నెల 16 నుంచి రాబోతుంది. తెలుగు టీవీ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' సందడికి డేట్ ఫిక్స్ అయ్యింది. తొలిసారి బుల్లితెరపై జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో టీవీ మార్కెట్‌ పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

షోపై ఆసక్తి ఏర్పడింది

షోపై ఆసక్తి ఏర్పడింది

ఇటీవల విడుదలైన బిగ్ బాస్ రియాలిటీ షో టీజర్, ప్రోమో, పోస్టర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో తారక్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ షోపై ఆసక్తి ఏర్పడింది.వెండితెరపై భారీ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఉత్తేజపరిచే.. ఎన్టీఆర్ బుల్లితెరపై ఎలాంటి పంచ్‌లతో విసురుతాడా అన్న ఉత్సుకతతో.. ఈ షో ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ షో 70 రోజులు, 12 మంది సెలెబ్రిటీలు, 60 కెమెరాల నీడలో జరుగనున్నాయి. ఈ షో స్టార్ మాలో ప్రసారం కానుంది.

English summary
Senior Actress Lakshmi Ramakrishnan claimed that she had given 10 crores. Criticizing that you do not even see such a worst show at least now is the Talk of the Industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu