Don't Miss!
- News
రూపురేఖలే మారిపోతున్నాయి - తెలంగాణాలో కొత్త పండుగ..!!
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
గంగవ్వ సొంత ఇంటి నిర్మాణం పనులు అందుకే ఆలస్యం.. మొత్తానికి ఓ పనైపోయింది!
యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ రోజురోజుకు తన క్రేజ్ ను అమాంతంగా పెంచేసుకుంటోంది. బిగ్ బాస్ ముందు వరకు ఒక తరహాలో ఉన్న ఆమె క్రేజ్ ఆ షో తరువాత మరొక లెవెల్ కు వెళ్లింది. ఒకవైపు సినిమాలు మరోవైపు యూ ట్యూబ్ వీడియోలతో గంగవ్వ ఫ్యాన్ ఫాలోవర్స్ ను కూడా గట్టిగానే పెంచుకుంటోంది. ఇక చాలా రోజుల అనంతరం గంగవ్వ ఇంటికి సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
Recommended Video

గంగవ్వను చూడడం కోసం
సోషల్ మీడియా వలన అసలైన టాలెంటెడ్ యాక్టర్స్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక గంగవ్వ లాంటి యూ ట్యూబర్స్ కూడా వారి స్వచ్ఛమైన మనసుతో అలాగే అమాయకత్వంతో జనాలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. గంగవ్వను చూడడం కోసం వందల కిలోమీటర్ల నుంచి లంబాడీ పల్లెకు వెళుతున్నారు.

నాగార్జున నుంచి మెగాస్టార్ వరకు
ఇక బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకు గంగవ్వ వస్తుందని ఎవరు ఊహించలేదు. బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి అలాంటి విభిన్నమైన కంటెస్టెంట్ కు ఎంట్రీ దక్కింది. ఇక నాగార్జున నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు కూడా ఆమెకు అభిమానులయ్యారు. మై విలేజ్ షోకు కూడా గంగవ్వ కారణంగా కొంత మంచి క్రేజ్ పెరిగింది.

నెలలు గడుస్తున్నా పూర్తి కాలేదు
అయితే గంగవ్వ బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ పూర్తయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా ఇంటి పనులు పూర్తి కాలేదు. దీంతో నెటిజన్లు తరచు గంగవ్వ ఇంటిపై అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక ఎట్టకేలకు మై విలేజ్ షో టీమ్ ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చింది.

అందుకే ఆలస్యం అయ్యింది
గంగవ్వ ఇంటి కోసం దాదాపు 20లక్షల వరకు ఖర్చు అవుతోందట. తెలిసిన కాంట్రాక్టర్ ద్వారానే ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. రెండు బెడ్ రూమ్ లు, ఒక హాల్, కిచెన్ ఉండేలా సింపుల్ గా హౌజ్ ను ప్లాన్ చేసుకున్నారు. అయితే మధ్యలో కరోనా కారణంగా అలాగే గంగవ్వ కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించినందువల్ల ఆ పనులు ఆలస్యం అయ్యాయట.

మొత్తానికి ఓ పనైపోయింది
ఇక మొత్తానికి రీసెంట్ గా గంగవ్వ ఇంటిపై స్లాబ్ పడినట్లు వివరణ ఇచ్చారు. ఇక గంగవ్వ సొంతంగా ఇంటిపై నీళ్లు పడుతున్నట్లు వీడియోలో చూలిపించారు. నాగార్జున సొంతంగా 7లక్షల వరకు ఆర్థిక సహాయం అందించగా బిగ్ బాస్ ద్వారా మిగతా డబ్బుతో ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయట. ఇక అమ్మా రాజశేఖర్ కూడా 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన విషయం తెలిసిందే.