26/11: ముంబై బ్లాస్ట్ నేపధ్యంలో టీవీ షో

By Srikanya

Life OK to come with new show on 26/11 blast
ముంబై: ప్రజల మనసుల్ని కలచివేసిన 26/11 ముంబై ఉగ్రవాద దాడులు చిత్రరూపాలను సంతరించుకుంటున్నాయి. టీవీ సీరియళ్లుగా, చిత్రాలు దీన్ని మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కసబ్‌ను ఉరికంబం ఎక్కించడంతో ఈ సీరియళ్లు, చిత్రాలకు మరింత ప్రచారం లభించనుంది. 'లైఫ్‌ ఓకే' టీవీ ఛానెల్‌లో 26/11 పేరుతో ఓ షో ప్రారంభం కాబోతోంది. దీనిని ఉగ్రవాద దాడుల నేపథ్యంతో రూపొందించారు.

ఇది కేవలం అవగాహన కోసమేనని 'లైఫ్‌ ఓకే' జనరల్‌ మేనేజర్‌ అజిత్‌ ఠాకూర్‌ స్పష్టీకరించారు. ఇలాంటి సంఘటనలకు ప్రజలు ఎలా భయభ్రాంతులకు గురవుతారో చూపించేందుకు ప్రయత్నించామని నిర్మాత సంజయ్‌ వాద్వా చెప్పారు. వాస్తవ సంఘటనల ఆధారంగా సీరియల్‌ను రూపొందిస్తున్నప్పటికీ కొన్ని కల్పితాలకు చోటిచ్చినట్లు తెలిపారు.సహజత్వానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.

ఇందులోని పాత్రల్లో పోలీసుల ప్రవర్తనను నిజాయితీగా చూపించాలని ఇటీవల మాజీ పోలీసు సంచాలకుడు పి.ఎస్‌.పస్రీచా సూచించారు. దీంతోపాటు ఈ సంఘటన ఆధారంగా రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ చిత్రం కూడా రాబోతోంది. చిత్ర నిర్మాణం తుది దశలో ఉందని రాంగోపాల్‌ వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో అండర్‌ వరల్డ్‌, జులై 11 తర్వాత 26/11 సంఘటన కూడా చిత్రాల రూపంలో చూసేందుకు వీలుకలుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X